చీడపీడల యాజమాన్యంమన వ్యవసాయం

Pseudo Stem Borer in banana: అరటి లో కాండం తొలుచు పురుగు యాజమాన్యం

2

Banana మానవాళికి తెలిసిన పురాతన పండ్లలో అరటి ఒకటి. ఈవ్ తన నమ్రతను కప్పిపుచ్చడానికి దాని ఆకులను ఉపయోగించినట్లు చెప్పబడిన స్వర్గపు తోటలో దాని పురాతనత్వాన్ని గుర్తించవచ్చు. అరటిపండును “యాపిల్ ఆఫ్ ప్యారడైజ్” అని పిలవడానికి ఇది ఒక కారణం కావచ్చు. అరటిపండు విటమిన్ ఎ యొక్క మంచి మూలం మరియు విటమిన్ క్యాండ్ బి2 యొక్క సరసమైన మూలం. అరటి పండ్లలో మెగ్నీషియం, సోడియం, పొటాషియం మరియు ఫాస్పరస్ వంటి ఖనిజాలు పుష్కలంగా ఉన్నాయి మరియు కాల్షియం మరియు ఇనుము యొక్క సరసమైన మూలం.

గుర్తింపు చిహ్నాలు  :

  • పెంకు పురుగు ఎరుపు గోధుమవర్ణం కలిగి కొబ్బరి ఎర్రముక్కు పురుగును పోలి ఉండును.
  • లద్దెపురుగు మెరిసే తెలుపువర్ణంలో ఉండి ముదురు గోధుమరంగు తల కలిగి ఉండును.

గాయపర్చు విధానం మరియు గాయం లక్షణాలు :

  • పెంకు పురుగులు చెట్టు మొదలుగాని, క్రుళ్ళిన మొక్క భాగాలలోగాని ఉండి, ఆకుతొడిమె మీది కణాలను తినును.
  • పెంకు పురుగులు ఎక్కువ నష్టం కలుగజేయును.
  • గుడ్డు నుండి వెలువడిన వెంటనే లద్దెపురుగు ఆకు తొడిమె చుట్టూ గల కణాలను తినును.

  • పురుగు ఆశించిన ఆకుతొడిమెను తొలగించి చూసిన ఎరుపు వర్ణపు జిగురు ఉండును. కొన్ని సార్లు ఆకుకాడ మరియు ఈనెల పైనఎర్రటి చారలు ఏర్పడును. తర్వాత క్రమేపి చెట్టు మొదలులోకి ప్రవేశించి మొక్కకు నష్టం కలుగజేయును.
  • లద్దెపురుగు తొలచిన మొదలు క్రుళ్ళి బలహీనపడును. అందువల్ల గాలి వీచినపుడు పడిపోవును.
  • ఈ పురుగు ఉదృతి గెలవేసే దశలో ఎక్కువగా ఉండును. అందువల్ల గెలలు కాడలు కుళ్ళి కాయలు పెరగకుండానే పక్వానికి వచ్చును.

జీవితచక్రం :

  • తల్లిపురుగు భూమిపై 1-1.5 మీ॥ ఎత్తులోగల మొదలుపై ఆకు తొడిమెలలో గ్రుడ్లను ఒక్కొక్కటిగా పెట్టును. అవి 5-8 రోజులలో పొదుగును.
  • లద్దెపురుగు 25-30 రోజులు పెరిగి నారలాంటి పదార్థాన్ని ముందుగా ఏర్పరిచి మొదలు లోపలనే కోశస్థదశలలో ప్రవేశించును.
  • మొత్తం జీవితచక్రం 50-100 రోజులలో పూర్తగును.

నివారణ :

  • పురుగు ఆశించని ఆరోగ్యవంతమైన పిలకలను నాటాలి.
  • పురుగు ఆశించిన మొక్కలను తీసి ఫోరేట్ (or) కార్బోఫ్యురాన్ Carbofuran 3G గుళికలను 25gr ఒక మొక్క చొప్పున మొక్కల మొదలులో వేయాలి. (3 నెలల వయసు గల మొక్కలు)
Leave Your Comments

Early blight of tomato: టమాట ఆల్టర్నేరియా ఎండు తెగులు లక్షణాలు మరియు నివారణ చర్యలు

Previous article

Tobacco climate: పొగాకు సాగు కు అనుకూలమైన వాతావరణం

Next article

You may also like