చీడపీడల యాజమాన్యంమన వ్యవసాయం

Early blight of tomato: టమాట ఆల్టర్నేరియా ఎండు తెగులు లక్షణాలు మరియు నివారణ చర్యలు

1

Tomato భారతదేశంలో ఇప్పటికీ చాలా మంది ప్రజలు వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో నివసించే చాలా మంది ప్రజలు వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నారు. అయితే భారత రైతుల ఆర్థిక పరిస్థితి బాగా లేదు. ఇక్కడ వ్యవసాయాన్ని లాభాపేక్షలేని రంగంగా పరిగణిస్తారు. వ్యవసాయంలో నష్టం వాటిల్లడంతో పెద్దసంఖ్యలో రైతులు తమ గ్రామాలను వదిలి నగరంలో పని చేయాల్సి వస్తోంది. కానీ సరిగ్గా సాగు చేస్తే రైతులను ధనవంతులుగా మార్చగల అనేక పంటలు ఉన్నాయి. టమోటా పంట రైతులకు మంచి ఆదాయ వనరుగా మారుతుంది.

లక్షణాలు:

తెగులు తీవ్రత జూన్ జూలై మాసంలో విత్తిన పంట పై ఎక్కువగా జనవరి నుండి ఏప్రిల్ మాసంలో విత్తిన పంటపై 1 తక్కువగాను కనిపించును.ఆకులపై చిన్న చిన్న పాలిపోయిన గోధుమ వర్ణపు మచ్చలు ఏర్పడి మచ్చలపై ఆకుపచ్చ నీలివర్ణపు శిలీంద్రపు ఎదుగుదల కనిపించును. తెగులు ముందుగా మొక్క క్రింది ఆకులపై సోకి తరువాత పై ఆకులకు వ్యాపించును. ఆకుల పై కణజాల క్షయం వలయాకారపు మచ్చలు ఏర్పడుట (టార్గెట్ బోర్డు ) ఈ తెగులు యొక్క ప్రత్యేక లక్షణము. పొడి వాతావరణంలో మచ్చల భాగం గట్టిపడి ఆకులు ముడుచుకుపోవును. తేమ గల వాతావరణంలో తెగులు మచ్చలు ఒకదానితో ఒకటి కలిసి కుళ్ళిపోయి పెద్ద మచ్చలు ఏర్పడును. తెగులు తీవ్రత ఎక్కువైనపుడు ఆకులు ముడుచుకుపోయి మొక్క నుండి రాలిపోవును.

సుగ్రాహ్యపు మొక్కలలో కాండము పై కూడా తెగులు సోకి గోధుమ వర్ణపు లేదా నలుపు వర్ణపు మచ్చలు ఏర్పడును. ఈ దశలో ఆకులు పూర్తిగా రాలిపోయి కొన్ని కొమ్మలు లేక మొక్క పూర్తిగా వాడిపోయి కాయలకు ఎండ దెబ్బ తగిలినట్టు అగుపించును. అనుకూల వాతావరణ పరిస్థితులలో ఈ శిలీంధ్రం నారుమడిలో నారు కుళ్ళు మచ్చలు ఏర్పడి తెగులును కలుగజేయును. కాండం మొదటిభాగంలో గోధుమవర్ణపు మచ్చలు ఏర్పడి మొక్కలు చనిపోవుట లేక గిడసబారిపోవుట జరుగును.

తెగులును కలుగజేసే శిలీంధ్రం, శిలీంధ్ర బీజాలు ఎండిపోయిన ఆకులలో, మొక్కల అవశేషాలలో ఒక సంవత్సరము జీవించి ఉండి తరువాత పంటపై తెగులును కలుగజేయును. శిలీంధ్ర బీజాలు గాలి, నీరు మరియు కీటకాల వలన ఒక మొక్క నుండి వేరొక మొక్కకు వ్యాపించును. వర్షపాతం, వాతావరణంలో తేమ, ఆకులపై మంచు పరిమాణం, కాంతి వ్యవధి, ఉష్ణోగ్రతలు పై తెగులు తీవ్రత ఆధారపడి ఉంటుంది.

నివారణ:

  • పంట మార్పిడి పద్ధతి అవలంబించాలి.మొక్కల అవశేషాలను ఏరి కాల్చివేయాలి.
  • మొక్కలు నాటిన తరువాత తెగులు సోకక ముందే (సుమారు నాటిన రెండు నెలల తరువాత శిలీంద్ర నాశక మందులను పిచికారి చేయాలి. మాంకోజెబ్ (0.3%), జీరం (0.3%), కాప్టస్ (0.3%), కాపర్ ఆక్సీ క్లోరైడ్ (0.25%) మందులలో ఒకదానిని 7 నుండి 10 రోజుల వ్యవధిలో పిచికారి చేయాలి.
Leave Your Comments

Brucellosis disease in cattle: పశువులలో ఈసుకుపోవు రోగము ఇలా వ్యాప్తి చెందుతుంది

Previous article

Pseudo Stem Borer in banana: అరటి లో కాండం తొలుచు పురుగు యాజమాన్యం

Next article

You may also like