పశుపోషణమన వ్యవసాయం

Poultry farming: కడక్ నాథ్, అసిల్, బస జాతి కోళ్ల లక్షణాలు మరియు ఉపయోగాలు

1

Poultry farming కోళ్ల  పెంపకం, దేశీయంగా లేదా వాణిజ్యపరంగా పక్షులను పెంచడం, ప్రధానంగా మాంసం మరియు గుడ్ల కోసం కానీ ఈకల కోసం కూడా. కోళ్లు, టర్కీలు, బాతులు మరియు పెద్దబాతులు ప్రాథమిక ప్రాముఖ్యత కలిగి ఉంటాయి, అయితే గినియా ఫౌల్ మరియు స్క్వాబ్‌లు (యువ పావురాలు) ప్రధానంగా స్థానిక ఆసక్తిని కలిగి ఉంటాయి. పౌల్ట్రీ పెంపకం ఇది వ్యవసాయ యుగం నుండి ఉద్భవించింది. గుడ్ల కోసం పెంచే కోళ్లను పొరలుగా పిలుస్తారు, మాంసం కోసం పెంచే కోళ్లను బ్రాయిలర్‌లు అంటారు.

 (I) అసిల్ (ASEEL) :

1) ఈ జాతి కోళ్ళు ఇండియా లోని ఆంధ్ర ప్రదేశ్, ఉత్తర్ ప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాలలో అగుపించును. 2) ఈ జాతిలో ఉన్న రకాలు (1) Golden Red (2) Black & Red (3) Nuric (White), (4) Kagar (Black) (5) Chitta (Black & white)(6) gava (Black) (7) sabja (white,golden), (8) pea comb.

జాతి లక్షణాలు :

  • వీటి చెవి తమ్మెలు మరియు వాటిల్స్ ఎరుపు రంగులో ఉండును.
  • వీటి ముక్కు పొట్టిగా ఉండును.
  • వీటికి తక్కువ ఈకలు కలిగి ఉండి తోక చిన్నగా ఉండును.
  • వీటి కాళ్ళు నిలువుగా పొట్టిగా ఉండును.
  • ఇవి మంచి పొదుగుడు లక్షణాలను కలిగి ఉండును.

ఉపయోగములు (UTILITY) :

  • పుంజులు సగటున5 కే.జీలు, మరియు పెట్టలు 3 కే.జీల బరువు కలిగి ఉండును.

 (II) బస (BUSRA):

  • ఈ జాతి కోళ్ళు గుజరాత్ మరియు మహరాష్ట్రా రాష్ట్రాల యందు కనపడును.

జాతి లక్షణాలు:

1) ఇవి మద్యస్థ పరిమాణంలో ఉండి, శరీరపు రంగు వివిధ రకాలలో వుండును. 2) వీటి శరీరం డీప్ గా వుండి, తక్కువ ఈకలను కలిగి ఉండును. 3) ఇవి తక్కువ గ్రుడ్లను ఉత్పత్తి చేయును మరియు వివిధ వ్యాధులకు తట్టుకొను మంచి రోగ నిరోధక శక్తి కలిగియున్నది.

(III) కడక్ నాథ్ (KADAKNATH):

ఈ జాతి కోళ్లు పడమర మధ్య ప్రదేశ్ Jhabvua మరియు Dhar జిల్లాల యందు కనపడును. కాలామాసి అని కూడా అంటారు. దీని మాంసం నల్లగా ఉంటుంది.

జాతి లక్షణాలు:

  • వీటి శరీరం డీప్ గా ఉండి, తక్కువ ఈకలను కలిగి ఉండును.
  • వీటి కూంట్, వాటిల్స్ పర్పల్ రంగులో ఉండును.
  • వీటి చర్మం, ముక్కు, వ్రేలు, పాదము టీ రంగులో ఉండును.
  • వీటి ఈకలు, రెక్కలు సిల్వర్ గోల్డ్ రంగులో ఉండును.
  • ఇవి మరిక్కు తప్ప మిగతా వ్యాధుల నుండి మంచి రోగ నిరోధక శక్తి కలిగియున్నది.

ఉపయోగములు (UTILITY) :

  • వీటిని మాంసము మరియు గ్రుడ్ల ఉత్పాదనకు ఉపయోగిస్తారు. మాంసము రుచికి పేరు గాంచినది.
  • పుంజులు సగటున5 కే.జీలు, మరియు పెట్టలు 1 కె.జీ బరువు తూగును.

 

 

Leave Your Comments

Late blight of tomato: టమాట ఫైటాఫ్తోరా ఎండు తెగులు లక్షణాలు మరియు నివారణ చర్యలు

Previous article

Environmental pollution: పర్యావరణ కాలుష్యానికి కారణాలు మరియు నివారణకు చేపట్టవలసిన అంశాలు

Next article

You may also like