Dairy farming ఆవులు మరియు గేదెలు రెండింటిలోను భారతదేశం మొదటి స్థానంలో యున్నది. మన రాష్ట్రం దేశంలో గొర్రెలు, కోళ్ళ సంఖ్యలో ప్రధమ స్థానంలో, గేదెల సంఖ్యలో రెండవ స్థానంలో ఉంది. అలాగే మాంసము, గ్రుడ్ల ఉత్పత్తిలో మొదటి స్థానంలో, పాల ఉత్పత్తిలో మూడవ స్థానంలో ఉంది. రాష్ట్ర స్థూల ఆదాయంలో సుమారు ఏడు శాతం, వ్యవసాయ అనుబంధ రంగాల స్థూలదాయంలో సుమారు మూడవ వంతు పశుసంవర్ధక రంగం సమకూరుస్తోంది.
ప్రపంచంలో భారత దేశపు స్థానం :- ప్రపంచపు ఆవులలో 7 శాతం ఆవులు, 50 శాతం గేదెలు మన దేశంలోనే ఉన్నాయి. 2006-07 సంవత్సరపు గణాంకాల ప్రకారం జాతీయ స్థూల ఆదాయంలో పశు సంపద 5.26 శాతం వరకు ఉంటుంది. దేశ జనాభాలో 66 శాతం మంది వ్యవసాయం, అనుబంధ రంగాల ద్వారానే జీవనోపాది పొందుతున్నారు. ఆంధ్రప్రదేశ్ 9.3 మిలియన్ల పాడి ఆవులతో దేశంలో 7వ స్థానంలోనూ, 10.60 మిలియన్ల గేదెలతో 2వ స్థానంలోను ఉంది.
పాడి పశువుల ఉత్పత్తుల ఎగుమతులు :- మన దేశం నుండి ఎగుమతయ్యే మొదటి 20 సరుకులలో పశు, మత్స్య సంబంధిత ఎగుమతులలో గేదె మాంసం ఒక్కదానికే స్థానం ఉంది. ఐక్యరాజ్యసమితి ఆహార వ్యవసాయ సంస్థ 2010 లెక్కల ప్రకారం మన దేశం 1,692,158,000 డాలర్ల విలువైన 652,790 టన్నుల గేదె మాంసాన్ని ఎగుమతి చేసింది.
పాడి పశువుల పెంపకం లాభాసాటిగా ఉండలాంటి ?
- పాడి పశువులను పోషించే ప్రతి రైతు కొంత భూమిని పశుగ్రాసాల సాగుకు తప్పని సరిగా కేటాయించాలి.
- పాలు గిట్టు బాటు ధరలో అమ్ముకోవడానికి తగిన మార్కెట్ సౌకర్యాలు చూసుకోవాలి. 3. పశుపోషణలో పాటించవలిసిన శాస్త్రీయ విషయ పరిజ్ఞానాన్ని తెలుసుకొని, పునరుత్పత్తి లోను, ఆరోగ్య సంరక్షణలోను, మేపులోను నూతన యాజమాన్య పద్ధతులు పాటించాలి.
- వ్యాపార రీత్యా పాడి పరిశ్రమ నిర్వహించే వారు అనుకూల వాతావరణం గల ప్రదేశాన్ని ఎంపిక చేసుకోవాలి. ముఖ్యంగా రవాణా సౌకర్యాలు పశు వైద్య సౌకర్యాలు, పని చేయు మనుషులున్న చోటునే ఎన్నుకోవాలి.
- నిర్వహణకు కావలసిన స్థిర పెట్టుబడులు, మేత, దాణా కొనుగోలుకు కావలసిన ఆర్థిక వనరులు సమకూర్చుకోవాలి.