Precautions After Mango Planting: మన రాష్ట్రంలో మామిడి షుమారుగా 7,64,495 ఎకరాల విస్తీర్ణంలో సాగుచేయబడుతూ 24,45,824 టన్నుల మామిడి పండ్లు ఉత్పత్తి చేయబడుతుంది. మామిడిని ప్రధానంగా కృష్ణా, ఖమ్మం, విజయనగరం, పశ్చిమగోదావరి, తూర్పుగోదావరి, శ్రీకాకుళం, కరీంనగర్, విశాఖపట్నం, చిత్తూరు, కడప, అదిలాబాదు మరియు నల్లగొండ జిల్లాల్లో విస్తారంగా సాగుచేస్తారు. దేశపు ఉత్పత్తిలో షుమారు 24 శాతం వాటా మన రాష్ట్రానిదే. మామిడి కాయల్లో విటమిన్ సి, ఇ, యాంటీ ఆక్సిడెంట్లు అధికం ఉంటాయి. అందువల్ల వీటిని తింటే రోగ నిరోధక శక్తి బాగా పెరుగుతుంది. సీజనల్‌గా వచ్చే దగ్గు, జలుబు, జ్వరం సమస్యల నుండి విముక్తి పొందవచ్చు. వ్యాధులు, ఇన్‌ఫెక్షన్లు రాకుండ అడ్డుకోవచ్చు. మామిడి ఫైబర్లో పుష్కలంగా ఉంటుంది. ఇది జీర్ణ సమస్యలను తగ్గిస్తుంది. అజీర్ణం, మలబద్దకం, గ్యాస్ సమస్యలు తగ్గుతాయి.
Also Read: Mango Plant Protection: మామిడిలో సమగ్ర సస్యరక్షణ.!
మామిడి రకాలు: దాదాపు భారతదేశంలో 1000 మామిడి రకాలు ఉన్నాయి. అయితే వీటిలో దాదాపు 20 రకాలను మాత్రమే వాణిజ్య స్థాయిలో పండిస్తున్నారు. భారతదేశంలోని మామిడి యొక్క వాణిజ్య రకాలు దేశంలో వివిధ ప్రాంతాలకు ప్రత్యేకమైనవి.
నేల తయారీ నాటుట: వడగాల్పులు పెనుగాలులు వీచే ప్రాంతాలలో సరుగుడు యూకలిప్టస్ లేక ఎర్రచందనం మొక్కలు గాలి వీచే దశలో 2 వరుసలలో 2మీటర్ల దూరంలో నాటుకోవాలి. తోట వేయుటకు నిర్ణయించిన నేలను బాగా దున్ని చదును చేసి నిర్దేశించిన దూరంలో 1×1×1 మీటర్ల గుంతలను తవ్వాలి. మొక్కలు నాటుటకు ముందు గుంతలలో 50 కేజీల పశువుల ఎరువు కేజీల సూపర్ పాస్పేట్ మరియు చెదలు పట్టకుండా 100 గ్రాముల పాలిడాల్ 2% పొడిని తవ్విన మట్టిలో కల్పి గుంతలను నింపాలి. మొక్కలను సూమారు 7-10 మీటర్ల దూరంలో నాటాలి. బాగా సారవంతలైన నేలల్లో 12. మీటర్ల దూరంలో కూడా నాటుకోవచ్చు. మొక్క నాటునప్పుడు అంటు మొక్కను మట్టి గడ్డలతో సహా తీసి వేళ్ళు కదలకుండా గుంతలో నాటాలి. అటు పిమ్మట మొక్క చుట్టూ మట్టిని గట్టిగా నొక్కి గాలికి పడిపోకుండా కొయ్యతో కట్టవలెను. నాటిన వెంబడే నీరు పోయాలి. అటు తర్వాత నేల తేమను బట్టి 15 రోజులకొకసారి వర్షాలు లేనప్పుడు. నీళ్ళు పోసి 2 సం.ల వరకు కాపాడాలి.
మొక్కలు నాటిన తర్వాత జాగ్రత్తలు:
నాటేటప్పుడు అంటు అతుకు భూమట్టానికి సుమారు 15-20 సెం.మీటర్ల పైన ఉండునట్లు శ్రద్ధ తీసుకోవాలి. మొక్క చుట్టూ చిన్న కుదుళ్లు చేసి నీరు పోయాలి. అంటు అతుకు క్రింద వేరు మూలంపై చిగుళ్ళు వస్తే వాటిని తొలగించాలి. అంట్లు స్థిరపడని చోట ఖాళీలు పూరించాలి. అంట్లు సుమారు 1మీటరు వరకు పెరిగినపుడు కొనను గిల్లివేస్తే యొక్క శాఖీయంగా బాగా పెరుగుతుంది. అంటు కట్టిన మొక్కలు ఒక సంవత్సరం తర్వాత పుష్పించటం ప్రారంభిస్తాయి. వీటిని కాపు కాయనిస్తే మొక్క పెరుగుదల దెబ్బతింటుంది. కనుక మొదటి 3-4 సంవత్సరాల వరకు పుష్పాలను తుంచివేయాలి. ప్రధాన కాండం మీద 1 మీ ఎత్తు వరకు శాఖ పెరకుండా చూడాలి. ఇది చెట్టు సరిగా రూపొందటానికి అవసరం.
Also Read: Mango Grafting: మామిడిలో మొక్కల వ్యాప్తి ఎలా జరుగుతుంది.!