Nitrogen and Phosphorus Deficiency in Plants: భూమి పై పొరలో 109 మూలకాలు గుర్తించడం జరిగింది.మొక్కల పెరుగుదలకు కొన్ని మూలకాలను ఎక్కువ పరిమాణంలోనూ, కొన్నింటిని తక్కువ గానూ నేలనుండి తీసుకొంటాయి.ఇతర మూలకాలు అనేకం నేలలో ఉన్నప్పటికీ వాటిని తీసుకోవు. ఇలా మొక్కలు వాటి అవసరార్ధం నేలనుండి సంగ్రహించే మూలకాలను ” పోషకాలు ” అంటారు. పోషకాలలో భారత నేల చాలా తక్కువగా ఉందని పేర్కొంది. సాంపిల్స్‌లో దాదాపు 85 శాతం మట్టిలో ఆర్గానిక్ కార్బన్ లోపం ఉంది. వీటిలో దాదాపు 15 శాతం శాంపిల్స్‌లో ఆర్గానిక్ కార్బన్ తక్కువ స్థాయిలో ఉంది.

Phosphorus Deficiency – Early Growth Stage
Also Read: Optimum Plant Population: సరైన మొక్కల సాంద్రత అధిక దిగుబడికి సోపానం.!
నత్రజని:
ప్రాముఖ్యత
పత్ర హరితం, అమినో ఆమ్లాలు, ప్రోటీన్లు మరియు జీవ పదార్దం లో ఆవశ్యకమైన అంగిక భాగం. శాఖీయ వృద్ధి కి తోడ్పడుతుంది. ముదురు హరిత వర్ణాన్ని (ఆకుపచ్చ)ఇస్తుంది. మొక్క రసభరితం అవుతుంది. భాస్వ, పొటాషియం మరియు ఇతర పోషకాలను ఉపయోగించుకోవడానికి “N” తోడ్పడుతుంది.
లోప లక్షణాలు
పెరుగుదల సరిగా లేకపోవడం, దశ్యకమైన మొక్క పొట్టిగా ఉండడం, లేత ఆకు పచ్చ రంగు కలిగి ఉండటం, పసుపు పచ్చగా మారడం, తీవ్ర దశలో ముదురు ఆకులు ఎండి రాలిపోతాయి.
నివారణా చర్యలు
- రసాయన ఎరువులు వాడకం సర్వ సాధారణం.తేలిక నేలల్లో మరియు సమస్యాత్మక నేలల్లో నత్రజని వృధా అయ్యే శాతం ఎక్కువ.
- యూరియా, అమ్మోనియం సల్ఫేట్, మరియు నత్రజని కలిగి ఉన్న సంకీర్ణ ఎరువులు (complex fertilizers) వేసి నీరు పెట్టాలి.
- సాగు నీరు లేని పొలాల్లో నత్రజని లోప నివారణకు 2% యూరియా పిచికారిచేసుకోవలయును.
- ముంపు కు గురయి, దెబ్బ తిన్న పైర్లకు వర్షాభావ పరిస్థితుల్లో యూరియా కు బదులు సూర్యాకారం (పొటాషియం నైట్రేట్) పిచికారి చేయవచ్చు.

Nitrogen Deficiency in Plants
భాస్వరము :
ప్రాముఖ్యత
- కేంద్రక ఆమ్లములు, మాంస కృత్తులు ఫోస్పో లిపిడ్లు, ఎంజైములలో భాస్వరం ఒక భాగం.
- కొన్ని అమినో ఆమ్లాలలో కూడా భాస్వరం చాలా ముఖ్యమైనది.
- క్రోమోజోములలో భాస్వరం ఒక భాగం కాబట్టి కణ విభజనకు అంటే మొక్క పెరుగుదలకు భాస్వరం అవసరం. వేర్ల వృద్ధి కి అవసరం. రెమ్మల సంఖ్యను పెంచుతుంది.
లోప లక్షణాలు
- ఆకులు ముదురు ఆకుపచ్చ, నీలి రంగు మిశ్రమ రంగు లోనికి తిరుగుతాయి. భాస్వర తీవ్ర లోపం ఎరువులు విస్తృత వల్ల కాండం, ఆకులు ఎరుపు, నీలం దీని లోపాలు ఆ శ మిశ్రమ రంగు లోనికి మారుతాయి.
- పైరు పక్వానికి ఆలస్యంగా వస్తుంది. విత్తనం కట్టడం, అభివృద్ధి లోప నివారణ చేయ కావడం తక్కువ గా ఉంటుంది.
నివారణ చర్యలు
- భాస్వర లోపం ఆంధ్ర ప్రదేశ్ లో పెద్ద సమస్య కాదు. సంకీర్ణ భాస్వర ఎరువులు విస్తృతం గా వాడటం వలన దీని లోపాలు ఆశించవు.
- సింగిల్ సూపర్ ఫాస్పేట్, ఇతర సంకీర్ణ ఎరువులు వాడకం ద్వారా లోప నివారణ చేయవచ్చు.
- ఉదా: డై అమ్మోనియం ఫాస్పేట్ (DAP, 18-18-0, 17-17-17)
Also Read: Types of Nutrients: పోషకాల రకాలు మరియు వాటి లక్షణాలు.!