Cotton Cultivation: తెలంగాణలో “తెల్ల బంగారం” సాగు దాదాపు 30 లక్ష హెక్టార్లకు పైగానే సాగు చేస్తున్నారు. ఇది నెల రోజులు బెట్టకు గురైనా కూడా ఒక వర్షం పడితే కోలుకుని మంచి దిగుబడులు ఇవ్వగల మొండి పంట అందుకే దీనిని వర్షాధారంగా ఎక్కువ నీటిని నిల్వ చేసుకోగల నల్ల రేగడి భూముల్లో సాగు చేస్తుంటారు.
Also Read: Bayer Cotton Seed Crop Gene Research Center: సాగునీటి సదుపాయం ఉంటే హెక్టారుకు లక్ష 10 వేల మొక్కలు.!
పంట దశ:
- రాష్ట్రంలో ప్రస్తుతం ప్రత్తి పంట 25 – 30 రోజుల దశలో ఉంది. –
- చేపట్టవలసిన తక్షణ చర్యలు: అధిక వర్షాల నుండి పంట త్వరగా కోలుకోవడానికి పొలాల నుండి అదనపు / నిల్వ ఉన్న నీటిని బయటకు తీసివేయాలి.
వర్షాలు తగ్గిన తర్వాత పాటించవలసిన యాజమాన్య పద్ధతులు:
- ప్రత్తి పంట ఎండిపోవడం గమనించిన చోట కాపర్ ఆక్సిక్లోరైడ్ @ 3 గ్రా./లీ (లేదా) కార్బండాజిమ్ @ 1 గ్రా. లీటరు నీటికి కలిపి 5-7 రోజుల వ్యవధిలో రెండుసార్లు మొక్కల అడుగుభాగం తడిచేటట్లు పిచికారి చేయాలి.
- పంట త్వరగా కోలుకోవడానికి నీటిలో కరిగే ఎరువులైన పాలిఫీడ్ (19:19:19) (లేదా) మాల్టీ-కే (లేదా) యూరియా @ 10గ్రా. లీటరు నీటికి కలిపి వారం రోజుల వ్యవధిలో రెండుసార్లు పోషకాలను పంటపై పిచికారి చేయాలి.
- భూమిలో తగిన తేమ ఉన్న సమయంలో గుంటుక/గోర్రుతో అంతర కృషి చేసి కలుపును నివారించుకోవాలి.
- విత్తిన 25-30 రోజులలో వచ్చే గడ్డి జాతి మరియు వెడల్పాకు కలుపు మొక్కలను నివారించడానికి పైరిథాయోట్యాక్ సోడియం @ 1.25 మి.లీ. (+) క్విజలోఫాఫ్ ఈథైల్ @ 2 మి.లీ. లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి.
పంట రక్షణ కొరకు తీసుకోవలసిన జాగ్రత్తలు:
పంటను చీడపీడల బారీ నుండి కాపాడుకునేందుకు కార్బండాజిమ్ @ 1గ్రా. (లేదా) ఫ్రోపికోనాజోల్ @1 మి.లీ.. వేపనూనె (1500 పి.పి.యమ్) @5మి.లీ. (లేదా) ఫిప్రోనిల్ @ 2 మి.లీ (లేదా) ఎసిపిట్ @ 1.5 గ్రా. లీటరు నీటికి కలిపి పంటపై పిచికారి చేయాలి.
Also Read: High Density Planting in Cotton: అధిక సాంద్ర పద్దతిలో “తెల్ల బంగారం”సాగు