Coconut Nut Rot Disease: కొబ్బరిని పండించటంలో కేరళ, తమిళనాడు, కర్నాటక రాష్ట్రాల తరువాత తెలుగు రాష్ట్రాలు ఉన్నాయి. ముఖ్యంగా ఏపిలో అధిక విస్తీర్ణంలో ఈ పంట సాగవుతుంది. కొబ్బరి మనకు భగవంతుడు ప్రసాదించిన అమృతభాండము. అందుకే కొబ్బరిని కల్పవృక్షమని పిలుస్తారు. కొబ్బరి చెట్టులోని ప్రతి భాగము మానవాళికి ఉపయోగకరము. ప్రపంచ దేశాలలో కొబ్బరితో తయారైన ఉప ఉత్పత్తులకు మంచి గిరాకి ఉన్నది.
Also Read: Bud Rot Symptoms in Coconut: కొబ్బరిలో మొవ్వు కుళ్ళు తెగులు లక్షణాలను ఇలా గుర్తించండి.!
కాయకుళ్ళు తెగులు:
- కాయలపై మొదట నీటి మచ్చలుగా ఏర్పడి క్రమేపి గోధుమ రంగులోకి మారి ఒక దానితో ఒకటి కలిసి పెద్ద మచ్చలుగా ఏర్పడతాయి.
- ఈ మచ్చల దిగువున ఉన్న పీచు, కొబ్బరి పూర్తిగా కుళ్ళి నీటితో నిండి కుళ్ళు వాసన వస్తుంది.
- కుళ్ళు వలన పీచులో తేమ శాతం పెరిగి కాయ బరువెక్కి ముచ్చిక బలహీనపడి కాయలు రాలిపోతాయి.
- ముందుగా గెలలోని ఒకటి, రెండు కాయలకు తెగులు సోకి నెమ్మదిగా గెలలోని ఇతర కాయలకు, ఇతర గెలలకు వ్యాపిస్తుంది.
- తగిన సమయంలో నివారణా చర్యలు తీసుకొనకపోతే ఈ తెగులు కొబ్బరి తోటలకు విపరీతంగా నష్టాన్ని కల్గించును.
అనుకూల పరిస్థితులు మరియు వ్యాప్తి: కాయ కుళ్ళు, మొవ్వు కుళ్ళు వర్షాలు అధికంగా ఉన్న సంవత్సరాలలో కొబ్బరి మొక్కలు దగ్గరగా అంటే 8మీటర్ల మధ్య దూరం కంటే తక్కువగా నాటినప్పుడు, తోటలలో మురుగు నీరు నిలువ ఉన్నప్పుడు ఎక్కువగా ఆశిస్తుంది. ఈ తెగులు వ్యాప్తి, అభివృద్ధి వాతావరణ పరిస్థితులు పై ఆధారపడి ఉంటుంది. అధిక వర్షపాతం, గాలిలో తేమ, సమతల శీతోష్ణస్థితి ఈ తెగులు అభివృద్ధికి మరియు వ్యాప్తికి బాగా అనుకూలిస్తాయి. గాలిలో తేమ 95% ఉండి, కనిష్ట ఉష్ణోగ్రత 24 °C కంటే తక్కువగా ఉంటే ఈ తెగులు ఉధృతికి
యాజమాన్యం:
- సిఫారసు చేసిన విధంగా 8 మీటర్ల ఎడంతో కొబ్బరి మొక్కలు నాటాలి. దగ్గర దగ్గరగా నాటితే గాలిలో తేమ పెరిగి, సులభంగా తెగులు వ్యాప్తి చెందుతుంది.
- తోటలో మురుగు నీరు నిల్వ ఉండకుండా బయటకు పోయే ఏర్పాటు చేయాలి. తెగులు సోకి చనిపోయిన చెట్లను తీసి కాల్చివేయాలి. మొవ్వు కుళ్ళు సోకిన చెట్టు మొవ్వు, దాని ప్రక్కన కుళ్ళిన భాగము తీసివేసి తగులబెట్టాలి. గిడసబారి, కురచ ఆకులున్న చెట్ల మొవ్వులోని పీచుకోసీ ఆకులు సులభంగా బయటకొచ్చేలా వదులుచేయాలి. సిఫారసు చేసిన మోతాదులో పొటాష్ ఎరువులు క్రమం తప్పకుండా వేస్తే మొక్కలలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది.
- కాయకుళ్ళు సోకిన గెలను తొలగించి, ఇతర గెలలు, మొవ్వు భాగం తడిచేలా రాగిధాతు శిలీంధ్ర మందు లీటరు నీటికి 3 గ్రా. చొప్పున కలిపి పిచికారి చేయాలి.
- వరద ముంపుకు గురైన తోటలలో వరద నీరు తగ్గగానే మొవ్వులలో చేరిన ఒండ్రు మట్టి పోయేలా శుభ్రంగా కడిగివేయాలి. తర్వాత3% కాపర్ ఆక్సీ క్లోరైడ్ మందు ద్రావణం మొవ్వు భాగం, ఆకులు పూర్తిగా తడిచేలా పిచికారీ చేయాలి.
- కొబ్బరి మొక్క మొవ్వు భాగంలో సుడోమోనాస్ ఫ్లోరిసెన్స్ పొడి వేయాలి.
- కాయ కుళ్ళు సోకిన గెలను తొలగించి, ఇతర గెలలు మొవ్వు భాగం తడిచేలా సుడోమోనాస్ ఫ్లోరిసెన్స్ కల్చర్ ద్రావణాన్ని పిచికారి చేయాలి.
- తెగులు కలిగించే శిలీంద్ర బీజాలు నేలలో ఉండి వాతావరణ పరిస్థితులు అనుకూలించినప్పుడు కొబ్బరి మొక్కను ఆశించి తెగులు కలగజేస్తాయి. దీనిని అరికట్టేందుకు ప్రతి ఏడాది చెట్టుకు 50గ్రా. ట్రైకోడెర్మ విరిడి శిలీంధ్ర పొడిని 5 కిలోల వేప పిండితో కలిపి పాదులో వేయాలి.
Also Read: Red Palm Weevil Management in Coconut: కొబ్బరిలో ఎర్రముక్కు పురుగుని ఇలా నివారించండి.!