Mango Grafting: మన రాష్ట్రంలో మామిడి షుమారుగా 7,64,495 ఎకరాల విస్తీర్ణంలో సాగుచేయబడుతూ 24,45,824 టన్నుల మామిడి పండ్లు ఉత్పత్తి చేయబడుతుంది. మామిడిని ప్రధానంగా కృష్ణా, ఖమ్మం, విజయనగరం, పశ్చిమగోదావరి, తూర్పుగోదావరి, శ్రీకాకుళం, కరీంనగర్, విశాఖపట్నం, చిత్తూరు, కడప, అదిలాబాదు మరియు నల్లగొండ జిల్లాల్లో విస్తారంగా సాగుచేస్తారు. దేశపు ఉత్పత్తిలో షుమారు 24 శాతం వాటా మన రాష్ట్రానిదే. మామిడి కాయల్లో విటమిన్ సి, ఇ, యాంటీ ఆక్సిడెంట్లు అధికం ఉంటాయి. అందువల్ల వీటిని తింటే రోగ నిరోధక శక్తి బాగా పెరుగుతుంది. సీజనల్గా వచ్చే దగ్గు, జలుబు, జ్వరం సమస్యల నుండి విముక్తి పొందవచ్చు. వ్యాధులు, ఇన్ఫెక్షన్లు రాకుండ అడ్డుకోవచ్చు. మామిడి ఫైబర్లో పుష్కలంగా ఉంటుంది. ఇది జీర్ణ సమస్యలను తగ్గిస్తుంది. అజీర్ణం, మలబద్దకం, గ్యాస్ సమస్యలు తగ్గుతాయి.

Mango Cultivation
Also Read: Mango Plant Protection: మామిడిలో సమగ్ర సస్యరక్షణ.!
నేల తయారీ మరియు మొక్కలు నాటుట:
వడగాల్పులు పెనుగాలులు వీచే ప్రాంతాలలో సరుగుడు యూకలిప్టస్ లేక ఎర్రచందనం మొక్కలు గాలి వీచే దశలో 2 వరుసలలో 2మీటర్ల దూరంలో నాటుకోవాలి. తోట వేయుటకు నిర్ణయించిన నేలను బాగా దున్ని చదును చేసి నిర్దేశించిన దూరంలో 1×1×1 మీటర్ల గుంతలను తవ్వాలి. మొక్కలు నాటుటకు ముందు గుంతలలో 50 కేజీల పశువుల ఎరువు కేజీల సూపర్ పాస్పేట్ మరియు చెదలు పట్టకుండా 100 గ్రాముల పాలిడాల్ 2% పొడిని తవ్విన మట్టిలో కల్పి గుంతలను నింపాలి. మొక్కలను సూమారు 7-10 మీటర్ల దూరంలో నాటాలి. బాగా సారవంతలైన నేలల్లో 12. మీటర్ల దూరంలో కూడా నాటుకోవచ్చు. మొక్క నాటునప్పుడు అంటు మొక్కను మట్టి గడ్డలతో సహా తీసి వేళ్ళు కదలకుండా గుంతలో నాటాలి. అటు పిమ్మట మొక్క చుట్టూ మట్టిని గట్టిగా నొక్కి గాలికి పడిపోకుండా కొయ్యతో కట్టవలెను. నాటిన వెంబడే నీరు పోయాలి. అటు తర్వాత నేల తేమను బట్టి 15 రోజులకొకసారి వర్షాలు లేనప్పుడు. నీళ్ళు పోసి 2 సం.ల వరకు కాపాడాలి.
మొక్కల వ్యాప్తి: కావల్సిన రకం మొక్కలను అంటుకట్టడం ద్వారా వ్యాప్తి చేసి నాటటం మంచిది. సాధారణంగా, వెనీర్, ఎటిపోటర్ గ్రాఫ్టింగ్ ద్వారా వ్యాప్తి చేస్తారు. ఇటీవల కాలంలో వెనిర్ అంటుకట్టడం బాగా వృద్ధి చెందింది. కారణం ఇది అత్యంత వీలైన, సులభమైన పద్ధతి, పండ్ల నుంచి తీసిన వెంటనే టెంకెలు మడులలో నాటాలి. టెంకలు తీసిన తర్వాత 70-80 రోజులు ఉంచితే అవి మొలకెత్తె శక్తి కోల్పోతాయి. టెంకలను నారుమడులో 20×45 సెం.మీటర్ల దూరంలో నాటాలి. మొక్కలు బాగా శాఖీయంగా పెరిగి కాండం సుమారు పెన్సిల్ అంటుక అయిన పిమ్మట అంటుకట్టటానికి ఉపయోగించాలి. సయాన్ కొన మొగ్గతో ఉన్నపుడు కోసి నారు మొక్కపై కట్టాలి. సయాన్ కొమ్మను కోయడానికి కాండంం ముందు సయాన్ కాండం ఆకులు తీసివేస్తే త్వరగా మొగ్గ తొడుగుతుంది. అంటు కట్టిన దాదాపు 3,4 నెలలు తర్వాత అంటు బాగా అతుక్కొని పెరుగుతుంది.
Also Read: Mango Cultivation: మామిడిలో నేల తయారీ మరియు మొక్కలు నాటుటలో మెళుకువలు.!