Nursery Management in Jatropha: జట్రోఫా కర్కస్ అమెరికాలోని ఉష్ణమండల ప్రాంతానికి చెందిన చిన్నపాటి పొదలాంటి చెట్టు. ఇది విభిన్న వాతావరణ పరిస్థితుల్లో పెరుగుతుంది. మన రాష్ట్రంలో జట్రోఫా తూర్పుకనుమల్లో సహజసిద్ధంగా కనబడుతుంది. ముఖ్యంగా విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, ఖమ్మం జిల్లాల్లో గల కొండ ప్రాంతాల్లో కనబడుతుంది.
Also Read: Soils in Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ నేలల లక్షణాలు మరియు యాజమాన్య పద్ధతులు
లక్షణాలు :
ఇది పొద రకము ప్రధాన కాండం నుండి ప్రక్క కొమ్మలు ఎక్కువగా వేస్తుంది. షుమారు 3-4 మీటర్ల ఎత్తు వరకు పెరుగుతుంది. ఆకులు పొడవు 10-15 సెం.మీ., 7-12 సెం.మీ., వెడల్పుతో చివర్లు మొనదేలి ఉంటాయి. పుష్పాలు పసుపు ఆకుపచ్చ రంగులో ఉండి వదులుగా ఉండే పుష్పగుచ్ఛమును కలిగి ఉంటాయి. సంవత్సరంలో రెండు సార్లు మార్చి-ఎప్రిల్, సెప్టెంబర్-అక్టోబర్లో పుష్పిస్తాయి. పరిపక్వం చెందిన పండ్లు పసుపు వర్ణంలో ఉండి. 2-5 సెం.మీ., సైజును కలిగి ఉంటుంది. విత్తనాలు ఆముదం విత్తనాలను పోలి ఉంది, 1.8-2.0 సెం.మీ., పొదవు. మరియు అండాకారంలో ఉండి, పై పొర నల్లగా ఉంటుంది.
వాతావరణం మరియు నేలలు:
శుష్క వర్షపాతం మరియు తక్కువ గల ప్రాంతాలు మరియు అర్ధశుష్క ప్రాంతాలు, తక్కువ భూసారం, తేమ గల నేలలులో పెరుగుతాయి. రాతినేలలు, చల్కానేలలు, ఇసుక, గట్టి ఎర్రనేలలు, బంజరు భూముల్లో, బాగా పెరుగుతాయి కాని ముద్ద చలిని తట్టుకోలేవు. వేడి మరియు ఆర్ధత కలిగిన వాతావరణంలో అధిక మొలకశాతం ఉండును. వర్షాభావ పరిస్థితులను కూడా తట్టుకొంటుంది. వర్షపాతం షుమారు 500-1200 మి.మీ., ఉండాలి.
పునరుత్పత్తి: విత్తనాలు లేదా కాండపు ముక్కల ద్వారా పునరుత్పత్తి చేయవచ్చు. కాండపు ముక్కల ద్వారా వచ్చిన మొక్కలకు తల్లి వేరు వుండదు. పక్క వేళ్ళుంటాయి. కాబట్టి వర్షాభావ పరిస్థితుల్లో పెరుగుదల తగ్గుతుంది.
నర్సరీ యాజమాన్యం: నాణ్యమైన విత్తనాలను ముందుగా సేకరించాలి. నర్సరీ మొక్కలు పెంచడానికి 5–9 సైజు కలిగి 200 గేజీ పాలిథీన్ సంచులు అనుకూలం. ఈ సంచుల్లో 3:2:1 నిష్పత్తిలో మట్టి, ఇసుక, పేడ, ఎరువుల మిశ్రమాన్ని జల్లెడపట్టి నింపాలి. సంచులను వరుసల్లో అమర్చి నీటితో తడపాలి. నీరు అడుగువరకు చేరాలంటే 4.5 సార్లు తడపాలి. జట్రోఫా విత్తనాలను ముందుగా చల్లని నీటిలో 12 గంటలు నానబెట్టి బరువుగా వున్న వాటినే ఎంపిక చేయాలి. ఫిబ్రవరి-మార్చి మాసాల్లో ఒక్కో సంచిలో 2 గింజలను షుమారు 2 సెం.మీ లోతుగా చేసి మట్టిని కప్పాలి. విత్తిన మొదటివారం రోజులు 2 సార్లు నీరు పోయాలి. 5-6 రోజుల్లో విత్తనం మొలకెత్తుతుంది. తర్వాత 4వ వారం వరకు రోజుకోసారి నీరు పోయాలి. 2వ నెలనుండి 2 రోజులకోసారి నీరు పోయాలి. మొక్కలు సాధారణంగా 3-4 నెలల కాలంలో 35-45 సెం.మీ ఎత్తువరకు పెరుగుతాయి. మొక్కలు పెరిగే దశలో సంచుల క్రింద నుండి వేర్లు వచ్చినపుడు వాటిని కత్తిరించి యధాతధంగా వరుసల్లో అమర్చుకోవాలిస ఆపై 10-15 రోజులకు మొక్కలను పొలంలో నాటుకోవచ్చు. అలాగే కొమ్మ కత్తిరింపులను కూడా సంచుల్లో అమర్చుకోవాలి. ఆపై 10-15 రోజులకు మొక్కలను పొలంలో నాటుకోవచ్చు. అలాగే కొమ్మ కత్తిరింపులను కూడా సంచుల్లో పెట్టి రోజూ నీరు ఒక సారి పోయాలి. కొమ్మల కత్తిరింపుల ద్వారా మొక్కలు 3 నెలలకు తయారవుతాయి. మొక్కలు జూన్ మాసానికల్లా తయారయి నాటటానికి సిద్ధమవుతాయి.
Also Read: కోళ్ల పెంపకంలో లిట్టర్ యాజమాన్యము