Red Palm Weevil Management in Coconut: కొబ్బరిని పండించటంలో కేరళ, తమిళనాడు, కర్నాటక రాష్ట్రాల తరువాత తెలుగు రాష్ట్రాలు ఉన్నాయి. ముఖ్యంగా ఏపిలో అధిక విస్తీర్ణంలో ఈ పంట సాగవుతుంది. కొబ్బరి మనకు భగవంతుడు ప్రసాదించిన అమృతభాండము. అందుకే కొబ్బరిని కల్పవృక్షమని పిలుస్తారు. కొబ్బరి చెట్టులోని ప్రతి భాగము మానవాళికి ఉపయోగకరము. ప్రపంచ దేశాలలో కొబ్బరితో తయారైన ఉప ఉత్పత్తులకు మంచి గిరాకి ఉన్నది. ఈ ఉప ఉత్పత్తులలో కోకో కెమికల్స్, కొబ్బరి పాలు ఉత్పన్నాలు, కొబ్బరి నీరు ఆధారంగా ఉత్పన్నాలు, కొబ్బరి టెంక మరియు కొబ్బరి పీచుతో ఉత్పన్నాలు ప్రధానమైనవి.
Also Read: Mango Cultivation: మామిడిలో నేల తయారీ మరియు మొక్కలు నాటుటలో మెళుకువలు.!
గుర్తింపు చిహ్నాలు (MOI) :
-
- ఇది కాండాన్ని ఆశించి డొల్లగా చేస్తుంది.
- పెంకుపురుగులు ముదురు ఎరుపు రంగులో ఉండి వంపు తిరిగిన ముక్కు కలిగి ఉండును.
- ఉరంపైన 6 నల్లటి మచ్చలుంటాయి.
- లద్దెపురుగు పసుపురంగులో ఉండి ఎర్రని తల కలిగి ఉండును.
గాయపర్చు విధానం & గాయం లక్షణాలు :
- లేత కొబ్బరిచెట్లకు ఇది ఎక్కువ ప్రమాదకరం. ఇది కొమ్ము పురుగు వలె పెంకుపురుగు దశలో ఎక్కువ నష్టాన్ని లద్దెపురుగు కాండంలోపలికి ప్రవేశించి లోపల ఉన్న కణజాలాలను తింటూ కాండంలోపల భాగాన్ని దొల్లగా చేస్తుంది. ఫలితంగా చెట్లు ఎండిపోతాయి.
- కాండంపై రంధ్రాలు ద్వారా కాఫీ రంగు జిగురు నమిలిన పిప్పి బయటికి వచ్చును. అప్పుడప్పుడు ఆకుల మట్టలు నిలువుగా చీలిపోవును. ఈ పురుగు ఆశించిన వెంటనే మొవ్వులోని ఆకులు పసుపు రంగుకు మారి ఎండిపోతాయి. కాండంపై గుండ్రటి రంధ్రాలు కనిపిస్తాయి.
నివారణ :
- ఈ పురుగు ఆశించే చనిపోయిన మానులను నరికి చీల్చి తగులబెట్ట వలెను.
- పురుగుపాటుకు లేక మొవ్వు క్రుళ్ళుతో చనిపోయిన కొమ్మలను వెంటనే తోటనుండి తొలగించవలెను.
- కొబ్బరిచెట్టు కాండంపైన మొదలువద్ద ఏ విధమైన గాయం చేయరాదు.
- పేర్లు నరకరాదు. పచ్చి ఆకులు లాగకూడదు.
- ఎర్రముక్కు పురుగులను గుంపులుగా ఆకర్షించడానికి కృత్రిమ ఎరలను బకెట్లో ఉంచిక కొబ్బరిచెట్టు కాండమునకు అమర్చాలి.
- వేరు ద్వారా మందు పెట్టాలి.
- కొబ్బరి చెట్టు కాండానికి 100ml తారు 10g లిండేన్ పొడి కలిపి పూసినట్లయితే ఈ పురుగు యొక్క గుడ్లు పొదగబడవు.
Also Read: Soils in Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ నేలల లక్షణాలు మరియు యాజమాన్య పద్ధతులు