Timber Plantations: ఏజెన్సీ ప్రాంతాలలో సమతలంగా లేని నెలల్లో, బంజరు భూముల్లో కలప మొక్కలను పెంచి ఆదాయం పొందవచ్చు. ముందుగా ఆ నేలల్లో ఉండే ముళ్ళపొదలను అడవి మొక్కలను వేర్లతో సహా పెకలించి అనువుగా ఉన్న చోట్ల దున్నాలి. అలవిగాని ప్రాంతాలలో బుల్డోజర్ల సహాయంతో నేలను సిద్ధం చేసుకోవచ్చు. మొక్కలు నాటడానికి ముందు నేల భౌతిక, రసాయనిక గుణాలను భూసార పరీక్షల ద్వారా అధ్యయనం చేయాలి. నేల స్వభావం ఫలితాలను అనుసరించి చెరువు మట్టిని మొక్కలు నాటే గుంతల్లో కలపడం వలన అనేక ప్రయోజనాలు ఉంటాయి.
Also Read: Green Manure Cultivation: పచ్చి రొట్ట పైర్లసాగుతో భూమికి సారం- రైతుకు లాభం
గుంతల తవ్వకం:
ఎంపిక చేసుకున్న భూముల్లో కొలతల్ని 30I30I45 సెంటీమీటర్లు కొలతలతో తవ్వుకోవాలి. ఎకరాకు ఎన్ని గంటలు తీయాలన్నది పెంచే మొక్క లను బట్టి ఆధారపడి ఉంటుంది.
ప్రతి గుంత సుమారుగా ఎటుచూసినా 2 నుండి 4 మీటర్ల దూరంలో ఉండాలి పశువుల ఎరువుతో పాటు నల్ల మట్టి వేయాలి. వీలైతే వీటికి అరకిలో వేపపిండి 50 గ్రాములు మూడు శాతం లిండేన్ పొడి కలిపి గుంతల్ని నింపాలి. రుతువులను అనుసరించి మొక్కలను నాటాలి. మే నుండి జూన్ లో గుంతలు తీసుకొని జూన్ నుండి ఆగస్టులో నాటుకోవచ్చు
నాటిన తరువాత:
. మొక్కలు నాటిన తరువాత 1-2 సంవత్సరాల పాటు అనేక జాగ్రత్తలు తీసుకోవాలి.
. మొదటి సంవత్సరం రెండు లేదా మూడు వారాలు పరిస్థితులు ఉంటే తప్పనిసరిగా కడవలతో నీళ్లు పోయడం లేదా పద్ధతిలో నీరు అందిస్తూ ఉండాలి.
. నాటిన తరువాత వచ్చే మొదటి వేసవి కాలంలో 15 నుంచి 20 రోజులకు ఒకసారి ఏడు నుంచి ఎనిమిది సార్లు అవసరాన్ని బట్టి మొక్కలకు నీరు అందించాలి దీని వలన ఎక్కువ శాతం మొక్కలు బతుకుతాయి.
. కలప మొక్కలు ఏపుగా పెరగడానికి కలుపు పిచ్చిమొక్కలు పెరగనివ్వకుండా కాదు చుట్టూ వర్షపు నీరు అందేలా చేస్తే మొక్కలు ఏపుగా పెరుగుతాయి.
. మొక్కల ఆకృతి బాగుండేలా అవసరం మేరకు కత్తిరింపులు చేపడితే చెట్లు నిటారుగా పెరిగే అవకాశం ఉంది.
. వర్షాకాలంలో వర్షం పడిన వెంటనే ఒక్కో మొక్కకు 100 గ్రాముల చొప్పున డి ఏ పి పటాస్ లలో రెండు సార్లు అందించాలి.
తేమ తగ్గకుండా..
కలప మొక్కలను పెంపకానికి ఎంపిక చేసుకునే భూమి అధికశాతం తేలికవి, సారవంతమైనవి అయినందున సాధారణ నేలలో తేమ ఎక్కువ కాలం నిల్వ ఉండదు. తేమను నిలుపుకునే చౌకగా లభించే వరిపొట్టును పాదుల్లో 8 సెంటీమీటర్లు మందంలో వేయాలి. మూడు వారాలకు ఒకసారి నీరు అందించాలి. పొట్టు వేసే ముందు చెదలు పట్టకుండా 50 గ్రాములు 3 శాతం పొడిని చల్లాలి. వరి పొట్టు వల్ల తేమ ఎక్కువ కాలం నిల్వ ఉండటమే కాక కలుపు బెడద తగ్గుతుంది. వరి పొట్టు కొంతకాలానికి బాగా చివికి సేంద్రియ ఎరువుగా నేలలో కలిసిపోతుంది.
డా. కె. తేజేశ్వరరావు, డా. యం. స్వాతి, డా. కె. లక్ష్మణ,
ఏరువాక కేంద్రం, విజయనగరం,
ఫోన్ : 94930 84826
Also Read: Trichoderma: నేలకు ఆరోగ్య సంజీవని` ట్రైకోడెర్మా.!