Black quarter క్లాస్ట్రీడియం చోవై అనే Gm+ve బ్యాక్టీరియా వలన ఆవులు, గేదెలు, గొర్రెలు మరియు మేకలలో కలుగు అతి ప్రాణాంతకమైన వ్యాధి. ఈ వ్యాధిలో రేఖిత కండరాలలో(తొడ, భుజ, ఛాతి కండరాలు) శోధము కలిగి, రక్తంలో టాక్సిమియా వ్రుద్ధి చెంది పశువులు చనిపోతాయి.
వ్యాధి కారకం :- (1) ఇది క్లాస్ట్రీడియం పై అను Gm+ve బ్యాక్టీరియా వలన కలుగుతుంది.
(2)ఈ బ్యాక్టీరియాకు సిద్ధ బీజాలను ఉత్పత్తి చేసే గుణం కలదు.
(3)ఈ బ్యాక్టీరియా గాలి రహిత స్థితిలోనే పెరుగుతుంది. అన్ని రకముల క్లాస్ట్రీడియం బ్యాక్టీరియాలు
సహజంగా పొట్ట, ప్రేగులలో ఉంటూ, ప్రతికూల పరిస్థితులలో పెరిగి వ్యాధులను కలిగిస్తుంటాయి. (4) ఇవి ప్రాణాంతకమైన Exotoxin విషపదార్థాలను విడుదలచేయును.
వ్యాధి వ్యాప్తి చెందు విధానము :- నోటి ద్వారా (ఇంజేషన్) సిద్ధబీజాలు పోట్టలోనికి చేరి, అక్కడ నుండి ప్రేగుల ద్వారా రక్తంలో కలియును. శరీర గాయాల ద్వారా సిద్ధబీజాలు (spores) నేరుగా రక్తంలో చేరును. రక్తం ద్వారా ఈ సిద్ధబీజాలు శరీర కండరాలలోనికి ముఖ్యంగా రేఖిత కండరాలలో (తొడ, భుజ, ఛాతీ హ్రుదయ, నాలుక కండరాలు ) చేరి, అక్కడ గాలి రహిత స్థితి ఏర్పడినప్పుడు, ఈ సిద్ధ బీజాలు బ్యాక్టీరియాలుగా మారి 4 రకాల Exotoxins ను విడుదల చేస్తాయి (Alfa, Beta, Gamma & Delta).ఇవి నేరుగా రక్తంలో కలిసిపోయి తరువాత శరీరంలోని అన్ని ముఖ్యమైన వ్యవస్థలపై ప్రభావం చూపుతుంది. (Nervous system, Respiratory system, Cardiac systems etc) ఫలితంగా పశువులు ఎటువంటి లక్షణాలు చూపించకుండానే మరణిస్తాయి.
లక్షణాలు :- ఇది అతి తీవ్రమైన వ్యాధి కావడం వలన పశువులు ఎటువంటి వ్యాధి లక్షణాలను చూపకుండా. చనిపోతాయి. వ్యాధి తీవ్రత తక్కువ ఉన్నపుడు ఈ క్రింది లక్షణాలను ముందుగా గమనించవచ్చు.
(1)ఆకలి వుండదు, పశువులు నెమరు వేయవు.
(2) రక్త హీనత వుంటుంది.
(3) కండరాల వాపు ప్రదేశంలో చర్మం కమిలిపోయి, వెచ్చగా నొప్పిగా వుంటుంది. చేతితో ఒత్తిడి కలిగించినపుడు గాలి బుడగల శబ్దం (Crepitation వినిపిస్తుంది.
(4)జ్వరం తీవ్రంగా వుంటుంది.
(5)శ్వాస తీసుకోవడం కష్టంగా వుంటుంది.
(6)నాడీ వేగం పెరిగి వుంటుంది.
(7)పశువులకు చికిత్స చేయనట్లైతే 12-24 గంటలలో చనిపోతాయి.
వ్యాధి కారక చిహ్నములు :- వ్యాధికి గురి అయిన కండరాలు వాచి వుంటాయి. చర్మం నల్లగా కమిలిపోయి వుంటుంది. చేతితో తాకినపుడు గాలి బుడగల శబ్దం వినిపిస్తుంది. పై కండరాలను కత్తితో కోసి చూసినట్లయితే లోపల భాగంలో రక్తం నల్లగా గడ్డకట్టి వుండును. ఆ కండరాల నుండి దుర్వాసన వస్తూ వుంటుంది. ఊపిరితిత్తులు, హ్రుదయ కండరాలలో చిన్న చిన్న రక్తపు చారలు చూడవచ్చు.
చికిత్స – ప్రథమ చికిత్స :- వ్యాధి బారిన పడిన కండరాలను కోసి, వాటిలోని గడ్డకట్టి వున్న రక్తంను, చనిపోయిన కణజాలాలను తీసి వేసి, పొటాషియం పర్మాంగనేట్తో శుభ్రపరిచి తరువాత ఏదేని ఒక ఆంటిసెప్టిక్ ద్రావణంతో ప్రతిరోజు డ్రెసింగ్ చేయవలెను.
వ్యాధి కారకాన్ని నిర్మూలించుటకు చేయు చికిత్స ఇది గ్రామ్ పాజిటివ్, ఎనరోబిక్ మరియు : సిద్ధబీజాలను ఉత్పత్తి చేయు బ్యాక్టీరియా కావడం వలన, గ్రామ్ పాజిటివ్ బ్యాక్టీరియాల పై పని చేయు ఏదెని ఒక ఆంటిబయోటిక్ ఔషదములను ఇవ్వవవలెను (సెఫలోస్పోరిన్ గ్రూప్, టెట్రాసైక్లిన్ గ్రూప్). బ్లాక్ క్వార్టర్ ఆంటి సీరమ్ను ఇవ్వవచ్చు.