మన వ్యవసాయం

Subabul cultivation: సుబాబుల్ రకాలు మరియు వాటి లక్షణాలు

0

Subabul cultivation సుబాబుల్ సెంట్రల్ అమెరికా యొక్క దేశీయ చెట్టు దీన్ని చాలా ఉష్ణోగ్రత దేశాల్లో ప్రవేశపెట్టారు.ఇది రకం మీద ఆధారపడి ఉంటుంది. ఇది ఎత్తుగా పెరిగి 20 మీ ఎత్తు ఉండును.లార్వా త్వరగా పొదగా 5 మీ ఎత్తు వరకు పెరుగును.ఇది నిత్యం పచ్చగా ఉండును.చిన్నని, తెల్లని పువ్వులు కలిగి ఉండును. మరియు పొడవైన గుత్తులు పొడుగాటి చదునైన కాయలు, ప్రతి కాయ 15-30 గింజలు కలిగి ఉండును. పక్వానికి రాని కాయలు కొద్దిగా పచ్చగా ఉండి స్పటిక వలె ఉండును. పక్వానికి వచ్చిన కాయలు గోధుమ రంగులో ఉండి మైనం పూతతో మెరుస్తూ ఉండును. ఎండినపుడు ఒకేసారి తెరుచుకొనును.

వాతావరణం:ఈ చెట్లు పచ్చగా ఉండే ఉష్ణం మరియు ఉపఉష్ణం ప్రాంతాలకు చెందినవి.ఇది 400 సెంటీ.గ్రే ఉష్ణోగ్రతను తట్టుకొనగలదు.కానీ వృద్ధ చలిలో చనిపోగలదు.ఇది 600-700 మిల్లీ.మీటర్లు సంవత్సరం వర్షపాతం గల ప్రాంతాలలో బాగా పెరుగును మరియు 250 మిల్లీ.మీటర్లు అతి తక్కువ వర్షపాతం గల ప్రాంతాలలో కూడా పెరుగును.ఇది అనావృష్టిని తట్టుకొనును.

నేలలు: ఈ చెట్టు వివిధ రకాల నేలల్లో పెరుగును. కాని తటస్థంగా ఉండి కొద్దిగా క్షారం కల భూముల్లో చాలా బాగా

పెరుగును.ఆమ్లం కల నేలల్లో బలహీనంగా పెరుగును. ఈ చెట్టు సముద్ర మట్టం నుంచి 100 మీ.ల ఎత్తు వరకు పెరుగును.

100 కన్నా ఎక్కువ సుబాబుల్ న్నాయి. 3 భాగాలుగా విభజించారు.

 హవాయి రకం: పొదలాగా ఉండి 5 మీ.ల ఎత్తు వరకు ఎరుగును. పశుగ్రాసం మరియు కలప దిగుబడి తక్కువ సాధారణంగా నిస్సారమైన బలహీనంగా ఉండి కొండ, ఏటవాలుగా ఉండే ఉష్ణ ప్రాంతాలలో పెంచుతారు. వంటచెరకు కొరకు కూడా సాగుచేయవచ్చును.

 పైరు రకం: మధ్యస్థం నుండి ఎక్కువ పెరిగే చెట్లు. ఇది 15 మీ ఎత్తుగా పెరుగును. కాండం కింది వరకు విస్తారంగా కొమ్మలు పెరుగును. దీనిని ముఖ్యంగా పశుగ్రాసం కోసం పెంచుతారు.

సాల్విడార్ రకం:

  • ఇది ఎత్తుగా పెరిగే చెట్టు. ఇది 20 మీ ఎత్తు వరకు పెరుగును.
  • ఆకులు, కాయలు ఉండును. మందంగా ఎక్కువ కొయ్యలు లేని కాండంను కలిగి ఉండును.
  • ఇది త్వరగా పెరుగును మరియు అధిక దిగుబడిని ఇచ్చును.
  • కలప గురించి ఈ రకాన్ని పెంచెదరు.

క్రొత్త హైబ్రిడ్ రకములు:హవాయి జెయింట్, సరాసరి జెయింట్

Leave Your Comments

Biogas Preparation: బయోగ్యాస్ తయారీ లో రైతులు తీసుకోవలసిన జాగ్రత్తలు

Previous article

Tamarind cultivation: చింత సాగులో నాటే పద్ధతులు

Next article

You may also like