Price Fall on Oil and Maize: రానున్న రోజుల్లో నిత్యా వసర సరుకులు, ఇతర ఆహార పదార్థాల ధరలు మరింత తగ్గనుగ్గన్నట్లు తెలుస్తుంది. గ్యాస్ సిలిండర్ ధర పెరుగుతున్న సమయంలో ఇది ప్రజలకు మరింత ఊరట కలిగించే విషయం!

Price Fall on Oil and Maize
Also Read: Sugar Leads to Cancer: పంచదార క్యాన్సర్ కు కారకం. స్వీట్ ప్రియులకు విన్నపం.!
ఆర్థిక నిపుణులు అంచనా ప్రకారం సరఫరా పెరగడంతో వంట నూనె, గోధుమలతో పాటు ఇతర సరకుల ధరలు తగ్గుముఖం పడవచ్చు. ఫ్యూచర్స్ మార్కెట్ లో వస్తువుల ధరలు పతనమవడం దీనికి మరో కారణం. ప్రపంచంలో ఎక్కువగా వినియోగించే వంట నూనె, పామ్ ఆయిల్ ధర ఏప్రిల్ మాసంలో రికార్డు స్థాయికి చేరుకున్నా, ప్రస్తుతం 45 శాతం మేర తగ్గింది. ఈ ఏడాదిలోనే ఇది అత్యంత తక్కువ స్థాయి. గోధుమల ధర ఇప్పుడు 35 శాతం, మక్కజొన్న 30 శాతం పడిపోయింది. ఉక్రెయిన్పై రష్యా యుడడంతో పెరిగిన పొద్దు తిరుగుడు నూనె ప్రస్తుతం యుద్ధ తీవ్రత తగ్గిపోగ్గి వడంతో తిరిగి సాధారణ స్థాయికి రానున్నాయి.
కౌలాలంపూర్ మార్కెట్లో పోయిన బుధవారం టన్ను పామ్ ఆయిల్ ధర 10 శాతం వరకు తగ్గి 3757 రూపాయలు చేరుకుంది. చికాగోలో సోయాబీన్ నూనె, మక్కలు, గోధుమల ధర పతనమయింది. ఇండోనేషియా ఎగుమతులపై నిషేధం ఎత్తివేసింది. మలేసియాలోనూ ఆయిల్ పామ్ ఉత్పత్తి సాధారణ స్థాయికి పెరిగింది. బయోడీజిల్ గిరాకీ ఊహించని విధంగా తగ్గిపోయింది. ఎగుమతులపై నిషేధాలు ఎత్తేయదాంతో భారత్,చైనా తక్కువ ధరలకు భారీ స్థాయిలో దిగుమతులు చేసుకోవచ్చని బిజినెస్ అనలిటిక్స్ సతీష్ పేర్కొ న్నారు.నేడు ఆగస్టు నెలతో పోలిస్తే ఇండోనేషియా, మలేషియాలో క్రూడ్ పామ్ఆయిల్ రిఫరెన్స్ రేటు చాలా తక్కువగా ఉందని అంటున్నారు. అమెరికాలో మక్కజొన్న పంట చేతికి రానుండడంతో రాబోయే రెండు నెలల కాలం ధరల హెచ్చు తగ్గుదలకు అత్యం త కీలకంగా మారనుంది.
Also Read: Weed Menace in Agriculture: కలుపు ముప్పా లేదా మేలా ?