Minister Niranjan Reddy: పత్తి సాగులో ఆధునిక పద్దతులు, అధిక సాంధ్రత పత్తి సాగుపై అధ్యయనంలో భాగంగా అమెరికాలోని టెన్నెస్సీ రాష్ట్రం మెంఫిస్ నగరంలో 13 వేల ఎకరాలలో పత్తి సాగు చేస్తున్న రైతులు రిచర్డ్ కెల్లీ, బ్రాడ్ విలియమ్స్ వ్యవసాయ క్షేత్రం రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి (Agriculture Minister Singireddy Niranjan Reddy) గారు సందర్శించారు, ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు రవీంద్ర నాయక్, డాక్టర్ మెతుకు ఆనంద్, పెద్ది సుదర్శన్ రెడ్డి, సీడ్స్ ఎండీ కేశవులు కూడా పాల్గొన్నారు.

Minister Niranjan Reddy
ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారు కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఉత్పాదకత పెంచే పత్తి వంగడాలు, భారతీయ కమతాలకు తగిన యంత్రాలు రావాలని అన్నారు. ఈ దిశగా వ్యవసాయ శాస్త్రవేత్తలు పరిశోధనలు వేగవంతం చేయాలని వ్యాఖ్యానించారు.
Also Read: Cotton Crop Cultivation: పత్తి సాగుకు ప్రభుత్వ ప్రోత్సాహకం.!
అమెరికా వ్యవసాయ కమతాలు అతి పెద్దవి .. దీంతో పోల్చుకుంటే భారతీయ కమతాలు ఎంతో చిన్నవి. చిన్న కమతాలకు సరిపోయేవిధంగా యాంత్రీకరణ జరిగితే రైతాంగానికి ఎంతో మేలు జరుగుతుందని అన్నారు. అంతర్జాతీయ పోటీని తట్టుకోవాలంటే పెట్టుబడి ఖర్చులు తగ్గించుకోవడంతో పాటు పంట ఉత్పాదకతను పెంచుకోవాల్సిన ఆవశ్యకత ఉన్నది. అమెరికా యాంత్రిక వ్యవసాయంలో ఎకరాకు 30 వేల పత్తి మొక్కలు .. అధిక సాంద్రత పద్దతిలో సాగుమూలంగా చీడపీడల బెడద తక్కువ అని అన్నారు.

Minister Niranjan Reddy Visited Bayer Cotton Seed Crop Gene Research Center At America
సగటున వెయ్యి ఎకరాల నుండి 5 వేల ఎకరాల కమతాలు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాయి. రోజుకు 70 టన్నులు పత్తి తీసే యంత్రాలు, రోజుకు 52 నుండి 70 హెక్టార్లలో ఒకేసారి పత్తిని తీసే (సింగిల్ టైమ్ హార్వెస్టర్) ధర 1 మిలియన్ యూఎస్ డాలర్లు ఉన్నది. రోజుకు 500 గ్యాలన్ల డీసిల్ వినియోగం అవుతుంది. 200 ఏళ్లుగా అమెరికా టెన్నెస్సీ రాష్ట్రంలో ప్రధానపంట పత్తి .. కాబట్టి కాలక్రమంలో పత్తి సాగులో విప్లవాత్మక మార్పులు రావాలని ఆకాక్షించారు.

Bayer Cotton Seed Crop Gene Research Center At America
టెన్నెన్సీ రాష్ట్రంలో ఏటా 5.5 లక్షల ఎకరాల నుండి 6.5 లక్షల ఎకరాలలో పత్తి సాగు చేయబడుతుంది. ఏటా మిలియన్ బేళ్ల వరకూ ఉత్పత్తి అవుతుంది.. నేషనల్ కాటన్ కౌన్సిల్ ఆఫ్ అమెరికాకు ఇది ప్రధాన కార్యలయంగా పనిచేస్తున్నది. పత్తి సాగులో ఆధునిక పద్దతులు, అధిక సాంధ్రత పత్తి సాగుపై అధ్యయనంలో భాగంగా అమెరికాలోని టెన్నెస్సీ రాష్ట్రం మెంఫిస్ నగరంలో 13 వేల ఎకరాలలో పత్తి సాగు చేస్తున్న రైతులు రిచర్డ్ కెల్లీ, బ్రాడ్ విలియమ్స్ వ్యవసాయ క్షేత్రం సందర్శించిన రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, ఎమ్మెల్యేలు రవీంద్ర నాయక్, డాక్టర్ మెతుకు ఆనంద్, పెద్ది సుదర్శన్ రెడ్డి, సీడ్స్ ఎండీ కేశవులు పాల్గొన్నారు.
ఈ సంధర్భంగా సింగిల్ పిక్ కాటన్ సాగు, విత్తన తయారీ కేంద్రం, జిన్నింగ్ మిల్ సందర్శన .. సింగిల్ పిక్ కాటన్ లో ఒకేసారి దున్ని, విత్తనాలు విత్తడం, కలుపుమందు చల్లే యంత్రం పరిశీలించారు.
Also Read: High Density Planting in Cotton: అధిక సాంద్ర పద్దతిలో “తెల్ల బంగారం”సాగు