Protection of Forest Nursery: ప్రపంచ దేశాలు అడవిని తల్లిగా భావిస్తారు. అడవి భద్రంగా ఉంటేనే మనిషి మనుగడ సాధ్యం అవుతుంది. అడవి లేనిదే వర్షపాతం లేదు. వర్షపాతం లేనిదే మానవ మనుగడ లేదు. నిజానికి మనిషికీ, మొక్కకూ ఉండేది పేగు బంధం లాంటిది. మనిషి పుట్టుక మరియు మరణం వరకు అనుక్షణం సుఖసంతోషాలతో ముడిపడి, ఎడతెగని బంధంగా నిలిచేది ప్రకృతే. ఆ సత్యాన్ని గ్రహించకుండా ఎడాపెడా అడవులు నరకడమంటే పుడమి తల్లికి కడుపు కోతను మిగల్చడమే.మానవాళి మనుగడకు అడవి చాలా ముఖ్యమైనది. నేటికీ అనేక మంది అడవులలో జీవనోపాధి కోసం జీవిస్తున్నారు.
మధ్యప్రదేశ్‌లో దేశంలోనే అత్యధిక అటవీ విస్తీర్ణం ఉంది, తర్వాత అరుణాచల్ ప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, ఒడిశా మరియు మహారాష్ట్ర ఉన్నాయి. మొత్తం భౌగోళిక విస్తీర్ణంలో అటవీ విస్తీర్ణంలో మొదటి ఐదు రాష్ట్రాలు మిజోరం (84.53%), అరుణాచల్ ప్రదేశ్ (79.33%), మేఘాలయ (76.00%), మణిపూర్ (74.34%) మరియు నాగాలాండ్ (73.90%).
అటవీ నారుమడులను పెంపుడు, వన్య జంతువులు మేయుట ద్వారా చేసే నష్టము నుండి కాపాడవలెను.
దీని కొరకు ఈ క్రింది రక్షణ పద్ధతులను అవలంభించవలెను.
- 1.5 మీ. ఎత్తైన బార్బడ్ వైర్ కంచెను స్థాపించవలెను
- శాశ్వత నారుమడుల చుట్టూ పశువులు మేయకుండా రాయి గోడ లేక కంచెను ఏర్పర్చవలెను.
- ఏనుగులు నష్టము చేసే ప్రదేశాలలో, ఏనుగులు రాకుండా ఉండేటట్లు కందకములు త్రవ్వవలెను.
- పొడి ప్రదేశాలల్లో నారుమడులను వేడిగాలుల నుండి మరియు గాలికోత నుండి రక్షించుటకు విండ్ బ్రేక్స్, షెల్టర్ బెల్ట్‌ను స్థాపించవలెను.
- నారుమడుల చుట్టూ ముండ్ల పొదలుంచినచో పక్షుల బారి నుండి నర్సరీ మొక్కలను కాపాడుకోవచ్చును.
నారుమడుల యాజమాన్యం:
- నారుమడులలో బాగా ఎదిగిన సీడ్ లింగ్స్, బయట క్షేత్ర వాతావరణ పరిస్థితుల్లో మంచిగా పెరుగుతాయి.
- నాటే స్థలాలలకు, నారుమడులు వీలైనంత దగ్గరలో స్థాపించవలెను.
- నారుమడులను పెంచే స్థలాల్లో సరిపడ నీటి వసతి కలిగియుండ వలెను. అదేవిధముగా నీడలో పెరిగే కొన్ని వృక్ష జాతి మొక్కలకు కూడ నీడను కలిగియుండవలెను.
- నారుమడులలో నుంచి నాటే స్థలాలకు మొక్కలను రవాణా చేసిన తరువాత ఒక రోజు అలాగే ఉంచవలెను. అప్పుడు అవి ఆ వాతావరణ పరిస్థితికి అలవాటు పడతాయి.