Pulse production మన దేశం లో 2.4 కోట్ల హెక్టార్ల లో వివిధ రకాల పప్పు ధాన్యాలు పండిస్తున్నారు. ఉత్పత్తి 1.4 కోట్ల టన్నులు. ఆంధ్ర ప్రదేశ్ లో 20 లక్షల హెక్టార్లు. దేశ సగటు ఉత్పాదకత హెక్టారుకు 600 కిలోలు ఉండగా రాష్ట్ర ఉత్పాదకత 676 కిలోలు. మొత్తం ఆహార పంటల విస్తీర్ణం లో పప్పు ధాన్యాలు 19 % ఆక్రమించాయి. దేశం లో ప్రధానం గా పప్పు ధాన్యాలు పండించే ప్రాంతాలు మధ్య ప్రదేశ్, ఉత్తర ప్రదేశ్, మహారాష్ట్ర, రాజస్థాన్ 81 % మేరకు ఉత్పత్తి చేస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ లో పప్పు ధాన్యాలు పండించే జిల్లాలు గుంటూరు, ప్రకాశం, తూర్పు గోదావరి, కర్నూలు, మహబూబ్ నగర్, అనంత పూర్ మొదలైనవి. దేశం లో పండే పప్పు ధాన్యాలలో ముఖ్యమైనవి మినుము, సెనగ, కంది, పెసర, మిగిలిన అన్ని రకాలు కలిపి 40 % ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ లో ప్రధాన పప్పు ధాన్యపంటలు సెనగ, మినుము, కంది, పెసర, ఉలవలు, ఇతర పప్పు ధాన్యాలు.
ప్రపంచం లో పప్పు ధాన్యాల అత్యధిక విస్తీర్ణం, ఉత్పత్తి మన దేశం లోనే ఉన్నది. ప్రపంచ ఉత్పత్తి లో 25% మన దేశం లోనే ఉత్పత్తి అవుతున్నది. అత్యధిక వినియోగం కూడా మన దేశం లో నే ఉన్నది. పప్పు ధాన్యాలు దిగుమతి చేసుకొనే దేశాల్లో మన దేశానిదే అగ్ర స్థానం. మయన్మార్ (బర్మా), పాకిస్తాన్, కెనడా, టాంజానియా, టర్కీ, ఆస్ట్రేలియా నుంచి సుమారు రెండు వేల కోట్ల రూపాయలు విలువ చేసే 16 లక్షల టన్నుల పప్పు ధాన్యాలు దిగుమతి చేసుకుంటున్నాం.
సమస్యలు:
- అపరాల సాగు ను 92% వరకు వర్షాధారం గా పండిస్తున్నారు.
- కీలక దశ లో అధిక నీటి ఎద్దడి కి మరియు ఎక్కువ ఉష్ణోగ్రత కు గురి కావడం జరుగుతుంది. అసాధారణ
- మరియు అసమాన వర్షాల వలన నీటి ఎద్దడికి మరియు నీటి ముంపు కు పంట గురికావడం జరుగుతుంది.
- నేల కోతకు గురైన సారవంతం కాని నేలల్లో అపరాలను పండించడం వలన తక్కువ దిగుబడులు వస్తున్నాయి.
- అపరాలు సున్నితమైన పంటలు. అవి ఆమ్లత్వాన్ని, కారత్వాన్ని, నీటి ముంపు ను తట్టుకోలేవు. ఎత్తైన నీటి మట్టం ఉన్న ప్రాంతాల్లో పండించ దానికి పనికి రావు.
- అధిక ఉత్పాదకత గల రకాలు లేకపోవడం
- రైతులకు అపరాలు సాగు చేయడం పై అవగాహన లోపించడం
- అధిక మోతాదు లో కలుపు ఉధృతి ఉండడం
- పురుగులు, తెగుళ్ళు ఎక్కువ గా ఆశించడం
- కోత తర్వాత గింజ నిల్వ సమయం * పురుగులు ఆశించి నష్టం చేయడం.
- కోత అనంతర సాంకేతిక పరిజ్ఞానం లో ప్రతికూల అంశాలు ఉండటం