Alkali soils పైరుకి కావలసిన అన్ని రకాల పోషకాలు కొంత పరిమాణములో నేలలో సహజంగానే ఉంటాయి. ఇది తయారై పైర్లకులభ్యం కావడం అనేది నేల భౌతిక రసాయనిక లక్షణాలు సూక్ష్మజీవుల చర్య వాతావరణ పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది వీటిలో ఎంతో తేడాలు ఉంటే అవకాశం ఉంది.
యాజమాన్యం:
- ఈ నేలల్లో లవణ సాంద్రత సమస్య కాదు.
- ఉదజని సూచి5 – 10.0 వరకూ ఉండడం, బంక మట్టి రేణువుల మీద సోడియం (Na) ఆయాన్లు 15 కన్నా ఎక్కువగా అంటిపెట్టుకుని ఉండడం వల్ల నేలలో మట్టి రేణువులు విడిపోయి నేల ఆకృతి క్షీణించును. అందువల్ల నీరు నేలలో నికి ఇంకదు. ఎండినపుడు నేల చాలా గట్టిగా ఉంటుంది.
- వేసవి లో నేల పెద్దగా బీటలు ఏర్పడి చీలి పోతుంది.
- బాగా గట్టి పడుతుంది.
- సాగు కష్టతరమవుతుంది.
ఈ నేల పునరుద్ధరణకు మట్టి రేణువుల పై అంటియున్న Na+ అయాన్ల ను తీసివేసి లేదా తగ్గించే ప్రయత్నం చేయాలి.
- దీనికి జిప్సం (CaSO, 211,0) హెక్టారు కు 2 టన్నుల (నేల క్షారాన్ని బట్టి) పొడిని పొలం మీద జల్లి తర్వాత నేలను కలియదున్ని నీరు పెట్టాలి.
- రసాయన ప్రక్రియ వల్ల Na” ఆయాన్లు బంకమట్టి నుండి తొలగిపోతాయి.
- జిప్సం లోని సల్ఫేట్ అయాన్లు సోడియం తో కలిసి సోడియం సల్ఫేట్ లవణాలు గా ఏర్పడి నీటిలో కరిగి మురుగు నీరు ద్వారా పొలం నుండి బయటకు పోగొట్టాలి.. ఇలా చాలా సార్లు చేసిన నేల బాగుపడుతుంది.
- అంతేగాక జీలుగ, సీమ జీలుగ, పిల్లి పెసర వంటి పచ్చి రొట్ట పంటలు ఈ క్షార నేలల్లో పెంచి కలియదున్నడం వల్ల ఈ నేలలు పునరుద్దరింపబడతాయి.
- చక్కర ఫాక్టరీ లలో వ్యర్ధ పదార్ధం గా మిగిలే ప్రెస్ మడ్ ను కూడా జిప్సం బదులు వాడవచ్చు. (2-3 ట/హె)
- ఇటువంటి నేలల్లో ఒక బోదె విడిచి రెండవ బోదెలో నీటిని కట్టి పైరును నీరు కట్టిన సాలు లో వేసి దిగుబడి పెంచవచ్చు.
Leave Your Comments