Paddy Cultivation: రాష్ట్రవ్యాప్తంగా సాగుచేసే ప్రధాన ఆహార పంట వరి, దాని పెరుగుతున్న జనాభాకు ఆహారం, పశువులకు మేత మరియు గ్రామీణ ప్రజలకు ఉపాధిని అందిస్తోంది. ఆంధ్రప్రదేశ్లో ఖరీఫ్ మరియు రబీ సీజన్లలో 22 లక్షల హెక్టార్లకు పైగా సాగు చేసే ప్రధాన పంట వరి. ఆంధ్రప్రదేశ్లోని 13 జిల్లాలు వరి పంటను ఉత్పత్తి చేస్తున్నాయి, వీటిలో పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి, కృష్ణా, గుంటూరు, శ్రీకాకుళం, విజయనగరం మరియు చిత్తూరు ప్రధాన ఉత్పత్తిదారులు. నిజానికి పశ్చిమగోదావరి, తూర్పుగోదావరి మరియు కృష్ణా మూడు ఆంధ్రప్రదేశ్లోనే కాకుండా మొత్తం భారతదేశంలోనే మూడు ముఖ్యమైన వరిని ఉత్పత్తి చేసే జిల్లాలు. పశ్చిమ గోదావరి మరియు తూర్పు గోదావరి జిల్లాలు ఆంధ్ర ప్రదేశ్ యొక్క రైస్ బౌల్ గా పరిగణించబడతాయి.
Also Read: Paddy main field management: వరి ప్రధాన పొలం తయారీ లో మెళుకువలు
సమగ్ర సస్యరక్షణ చర్యలు:
-
- నిరోధక శక్తిగల రకాలను నాటుకోవాలి.
- విత్తన శుద్ధిని తప్పకుండా చేయాలి.
- నారు మడిలో తప్పనిసరిగా సస్యరక్షణ చర్యలు చేపట్టాలి.
- నాటే సమయంలో నారు కొనలను తుంచి నాటుకోవాలి.
- ప్రతి 2 మీ॥కు 20 సెంమీ. కాలి బాటను వదిలి పెట్టాలి.
- పురుగుల నిఘా కొరకు లింగాకర్షక బుట్టలు ఎకరానికి 4 చొప్పున అమర్చాలి.
- హాని చేయు పురుగులు మరియు మిత్ర పురుగుల నిష్పత్తి 21 గా ఉన్నప్పుడు సన్యరక్షణ చర్యలు వాయిదా వేయవచ్చు.
- సరైన నీటి యాజమాన్య పద్ధతులు తప్పకుండా పాటించాలి.
- దుబ్బులను కర్ర వచ్చి మీదనే నేల మట్టానికి కోసి లోతు దుక్కి చెయ్యాలి.
- ట్రైకోగ్రామా పరాన్న జీవులు ఎకరానికి 20 వేల చొప్పున నాటిన 30-45 రోజుల్లో మూడు దఫాలుగా పొలంలో వదలాలి.
- పొలం గట్లపై ఉండే గడ్డి, కలుపు మొక్కలను ఎప్పటికప్పుడు తీసి శుభ్రం చేయాలి.
- మురుగు నీటిని బయటకు తీయటం ద్వారా పురుగుల అభివృద్ధి అదుపులో ఉంచవచ్చు.
- నత్రజని ఎరువులను సిఫారసు చేసిన మోతాదుకు మించి ఎక్కువ వేయరాదు.
- తప్పనిసరి పరిస్థితుల్లో మాత్రమే క్రిమిసంహారక మందులను వాడాలి.
- మందులు పిచికారి చేయడానికి నాన్సాక్ స్ప్రేయరు లేదా పవర్ స్ప్రేయర్ మాత్రమే వాడాలి. వృక్ష సంబంధమైన వేప గింజల కషాయం లేదా వేప నూనెలను వీలైనంత వరకు వాడాలి.
- ఖరీఫ్ జూలై మాసాంతం లోపల, రబీలో డిశంబరు మాసాంతం లోపల నాట్లు పూర్తి చేయాలి. చీడపీడల తీవ్రతను బట్టి, అవసరాన్ని బట్టి మాత్రమే సరైన మోతాదులో పురుగు మందులను వాడాలి.
Also Read: Mid Season Drainage In Paddy: వరి లో మిడ్ సీజన్ డ్రైనేజ్ యొక్క ప్రాముఖ్యత.!