జాతీయం

Environmental Scientists of India: భారతదేశ ప్రముఖ పర్యావరణ శాస్త్రవేత్తలు.!

1
Dr. Salim Ali - The Bird Man of India
Dr. Salim Ali - The Bird Man of India

Environmental Scientists of India: మన దేశంలో పర్యావరణం క్షీణించుతున్న పరిస్థితులలో కాపాడడానికి సామాజిక పర్యావరణ వేత్తలు పాలుపంచుకున్నారు. భారత దేశ పర్యావరణ చట్టాలకు ఆకృతిని రూపొందించడంలో అనేక మంది వ్యక్తులు ఉన్నారు. అలాంటి గొప్ప వ్యక్తులను స్మరించుకోవలసిన బాధ్యత యావత్ దేశ ప్రజలకు ఉంది.

Dr. Salim Ali - The Bird Man of India

Dr. Salim Ali – The Bird Man of India

సలీం అలీ: ప్రముఖ భారతీయ పక్షి శాస్త్రవేత్త మరియు ప్రకృతి శాస్త్రవేత్త. వీరిని “భారతదేశపు పక్షి మనిషి” అని పిలుస్తారు. భారతదేశం అంతటా క్రమపద్ధతిలో పక్షుల సర్వేను నిర్వహించిన మొదటి భారతీయులలో సలీం అలీ కూడా ఉన్నారు. అతను భరత్‌పూర్ పక్షుల అభయారణ్యం (కియోలాడియో నేషనల్ పార్క్)ని రూపొందించడంలో కీలక పాత్ర పోషించారు. ఇప్పుడు సైలెంట్ వ్యాలీ నేషనల్ పార్క్ విధ్వంసాన్ని నిరోధించినందుకు 1976లో భారతదేశపు రెండవ అత్యున్నత పౌర పురస్కారం, పద్మవిభూషణ్ అవార్డు లభించింది. అతని ఆత్మకథ, “ఫాల్ అఫ్ ఏ స్పర్రో”, ప్రతి ప్రకృతి ఔత్సాహికులు తప్పని సరిగా చదవాలి.

Indira Gandhi

Indira Gandhi

శ్రీ మతి ఇందిరా గాంధీ: భారతదేశ వన్యప్రాణుల పరిరక్షణలో ప్రధానమంత్రిగా చాలా ముఖ్యమైన పాత్ర పోషించారు. ఆమె ప్రధానమంత్రిగా ఉన్న కాలంలోనే, రక్షిత ప్రాంతాల నెట్‌వర్క్ (PAs)లు 65 నుండి 298 వరకు పెరిగినవి.నేటికీ పాటిస్తున్న వన్యప్రాణి సంరక్షణ చట్టం రూపొందించనది శ్రీమతి గాంధీ గారే. ది ఇండియన్ బోర్డ్ ఆఫ్ వైల్డ్లైఫ్ కు ఆమె వ్యక్తిగతంగా అన్ని సమావేశాలకు అధ్యక్షత వహించినందున చాలా చురుకుగా పనిచేసింది.

Also Read: PJTSAU: పిజె టిఎస్ ఎయూ లో ICAR అగ్రికల్చరల్ రీసెర్చ్ నోడల్ అధికారుల 7వ సదస్సు.!

SP Godrej

SP Godrej

SP గోద్రెజ్: వన్యప్రాణుల సంరక్షణ మరియు ప్రకృతి అవగాహనా కార్యక్రమాలలో చురుకుగా పాల్గొనే వార. 1975 మరియు 1999 మధ్య కాలంలో SP గోద్రెజ్ 10 అవార్డులు అందుకున్నారు. భారతదేశంలో వన్యప్రాణుల పరిరక్షణ కోసం ప్రధాన న్యాయవాద పాత్రను పోషించారు.

MS Swaminathan

MS Swaminathan

M. S. స్వామినాథన్: అతను MS స్వామినాథన్ రీసెర్చ్ ఫౌండేషన్‌ను స్థాపించాడు. చెన్నై, జీవ వైవిధ్య పరిరక్షణపై పని చేస్తుంది.

Madhav Gadgil

Madhav Gadgil

మాధవ్ గాడ్గిల్: భారతదేశంలో ప్రసిద్ధ పర్యావరణ శాస్త్రవేత్త. కమ్యూనిటీ బయోడైవర్సిటీ రిజిస్టర్‌లను అభివృద్ధి చేయడం మరియు పరిరక్షించడం వంటి పర్యావరణ సమస్యలపై ఆయన జీవిత కాలం పాటుపడ్డారు. క్షీరదాలు, పక్షులు మరియు కీటకాల ప్రవర్తనపై అధ్యయనాలు చేశారు. అతను 215 పరిశోధనా పత్రాలు మరియు 6 పుస్తకాలను ప్రచురించాడు. ‘లైఫ్‌స్కేప్స్ ఆఫ్ పెనిన్సులర్ ఇండియా’ అనే పుస్తకానికి సంపాదకునిగా వ్యవహరించారు.

MC Mehta

MC Mehta

M. C. మెహతా: ప్రముఖ పర్యావరణ న్యాయవాది. ఇతని కృషి వలెనే పాఠశాలలు మరియు కళాశాలలలో పర్యావరణ విద్య అమలు చేసేందుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. తాజ్ మహల్ రక్షణ కోసం మరియు గంగా జలాన్ని శుభ్రపరచడం కోసం పోరాటాలు జరయినా రాతిఫలమే నేటి క్లీన్ గంగ.

Anil Agarwal

Anil Agarwal

అనిల్ అగర్వాల్:1982లో భారతదేశ పర్యావరణ స్థితిపై మొదటి నివేదిక రాసిన పాత్రికేయుడు. అతను సెంట్రల్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్ స్థాపకుడు,పర్యావరణ సమస్యలపై పనిచేసే క్రియాశీల NGOగ నేటికీ అవతరించింది.

Also Read: D.D Kisan Studio Inagurated: రైతు కళ్యాణార్థం డి .డి కిసాన్ స్టూడియో ప్రారంభం.!

Leave Your Comments

PJTSAU: పిజె టిఎస్ ఎయూ లో ICAR అగ్రికల్చరల్ రీసెర్చ్ నోడల్ అధికారుల 7వ సదస్సు.!

Previous article

Ban On Single Use Plastic 2022: సింగల్ యూస్ ప్లాస్టిక్ కి ఇక స్వస్తి.!

Next article

You may also like