తెలంగాణవార్తలు

ICAR Award to KarimNagar Farmer: కరీంనగర్ రైతుకు భారత వ్యవసాయ పరిశోధన మండలి అవార్డు.!

1
KarimNagar Farmer - Mallikharjuna Reddy
KarimNagar Farmer - Mallikharjuna Reddy

ICAR Award to KarimNagar Farmer: సేంద్రియ వ్యవసాయ పద్ధతి ద్వారా వివిధ రకాల పంటలను సాగు చేసినందుకు గాను కరీంనగర్ జిల్లా వాస్తవ్యులైన యువ ఆదర్శ రైతు మావురం మల్లికార్జున్ రెడ్డి గారు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ (ICAR), న్యూ ఢిల్లీ అవార్డుకు ఎంపికయ్యారు.తెలంగాణ రాష్ట్రం నుండి ఈ అవార్డుకు ఎంపికైన ఏకైక రైతు ఆయనే. అవార్డు వచ్చిన విషయం తెలుసుకున్న నాటి జిల్లా కలెక్టర్ కె.శశాంక గారు మల్లికార్జున్‌రెడ్డిని కరీంనగర్లో గల కలెక్టరేట్‌కు ఆహ్వానించి అభినందించారు.

ICAR Award to KarimNagar Farmer

ICAR Award to KarimNagar Farmer

చొప్పదండి మండలం పెద్దకూర్మపల్లికి చెందిన మల్లికార్జున్‌రెడ్డి, అతని భార్య సంధ్యతో సహా 2014లో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగాలకు స్వస్తి చెప్పి స్వగ్రామం తిరిగి వచ్చారు. వ్యవసాయం పట్ల మక్కువతో, తనకున్న 17 ఎకరాల్లో సేంద్రియ సాగు విధానం ద్వారా వివిధ రకాల పంటలు సాగు చేస్తు వ్యవసాయాన్ని లాభదాయకం చేస్తున్నారు.

Also Read: Subabul Biscuits for Cattle: పశువుల కోసం సుబాబుల్ బిస్కెట్లు.!

2006లో చదువు పూర్తయిన తర్వాత హైదరాబాద్‌లోని ఓ ప్రముఖ సాఫ్ట్‌వేర్ కంపెనీలో ఇంజనీర్ గా చేరిన మల్లికార్జున్ రెడ్డి గారు, ఎంబీఏ గ్రాడ్యుయేట్ అయిన సంధ్యతో వివాహం జరిగింది.వీరు ఇద్దరూ హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లుగా కొన్ని సంవత్సరాల పాటు పనిచేశారు. ఉద్యోగంలో అసంతృప్తితో ఈ దంపతులు తమ వృత్తికి స్వస్తి చెప్పి తమ స్వ గ్రామంలో తమకున్న 12 ఎకరాల భూమిలో పంటలు సాగు చేస్తున్నారు. వ్యవసాయంలోని సాధక బాధకాలు, విజయాలు రుచి చూసిన తర్వాత మరొక ఐదు ఎకరాలు కౌలుకు తీసుకుని మొత్తం 26 రకాల పంటలు సాగు చేస్తూ నేటి యువతకు ఆదర్శమవుతున్నారు.

KarimNagar Farmer - Mallikharjuna Reddy

KarimNagar Farmer – Mallikharjuna Reddy

మల్లికార్జున్ రెడ్డి ఈ అవార్డుకు ఎంపిక కావడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు.పెద్దగా తెలియని మెలకువలతో వచ్చి నేడు రాష్ట్రంలో ఉత్తమ రైతుగా పేరు సంపాదించడం, సాగులో మరిన్ని వినూత్న పద్ధతులను అభ్యసించేలా తనను ప్రోత్సహించిన ప్రొఫెసర్‌ జయశంకర్‌ అగ్రికల్చర్‌ యూనివర్సిటీలోని వ్యవసాయ శాస్త్రవేత్తలకు కృతజ్ఞతలు తెలిపారు.పెద్దగా పండని 12 ఎకరాల్లో వరి సాగలో కొత్త మెళకువలు నేర్చుకునేందుకు వారి మేలు మర్చిపోలేను అన్నారు.

రసాయన ఆధారిత ఎరువులకు బదులుగా, అతను ఇతర సేంద్రియ, వ్యవసాయ పదార్థాలతో పాటు పశువుల పేడ మరియు వేప ఆకులను ఉపయోగించి తయారుచేసే సేంద్రియ రసాయనాల తయారీ అభ్యసించడం ప్రారంభించాడు.ఇవి పంటలో పురుగు మందుల వినియోగం తగ్గించింది. వరితో పాటు కూరగాయలు, అల్లం,ఇతర 26 రకాల పంటలను దంపతులు సాగు చేస్తున్నట్లు తెలిపారు. ఈ అవార్డు రావడం పట్ల గ్రామ ప్రజలు, స్థానిక ఎం.ఎల్.ఏ సుంకే రవిశంకర్ అభినందనలు తెలిపారు.

Also Read: Mid Season Drainage In Paddy: వరి లో మిడ్ సీజన్ డ్రైనేజ్ యొక్క ప్రాముఖ్యత.!

Leave Your Comments

Subabul Biscuits for Cattle: పశువుల కోసం సుబాబుల్ బిస్కెట్లు.!

Previous article

Agricultural Research Station-Mudhole: తెలంగాణలో పత్తిపై పరిశోధించి ఏకైక పరిశోధనా కేంద్రం

Next article

You may also like