1. సిస్టీన్, సిస్టయిన్,మెథియోనిన్ అమైనో ఆమ్లాలు, సల్ఫర్ కలిగిన ప్రోటీన్ సంశ్లేషణ కోసం ఇది అవసరం.
2. ఇది అవిసె, సోయాబీన్, వేరుశెనగ మొదలైన పంటలలో నూనె శాతాన్ని పెంచుతుంది.
3. చిక్కుళ్లలో N స్థిరీకరణకు ఉపయోగపడే నైట్రోజినేస్ ఎంజైమ్ వ్యవస్థలో భాగం.
4. ఇది థయామిన్ మరియు బయోటిన్ వంటి విటమిన్లు, కో-ఎంజైమ్‌లు మరియు గ్లూటాతియోన్, ఎసిటైల్ కోయెంజ్ A (కొవ్వు ఆమ్ల సంశ్లేషణకు పూర్వగామి), ఫెర్డాక్సిన్ వంటి పిగ్మెంట్ల తయారీకి తోడ్పడుతుంది. ఇవి మనకు విటమిన్ ఏ ను అందిస్తాయి.
5. ఇది ఉల్లి, ఆవాలు, క్యాబేజీ మరియు క్యాలీఫ్లవర్ వంటి పంటలలో పాలీసల్ఫైడ్‌ల రూపంలో ఉంటుంది.
6. ఇది పాపైనేస్ మరియు పపైన్ యొక్క సంశ్లేషణ వంటి కొన్ని ప్రొటీయోలైటిక్ ఎంజైమ్‌లను సక్రియం చేస్తుంది.
7. డైసల్ఫైడ్ లింకేజీలు ప్రొటీన్ల నిర్మాణంతో సంబంధం కలిగి ఉంటాయి.
8. మొక్కలలో సల్ఫైడ్రైల్ (-SH) సమూహాలు ఏర్పరిచి శీతాకాలంలో పెరిగిన చలికి నిరోధకతకు ఇస్తుంది.
Also Read: Jeera Health Benefits: శరీరానికి జీలకర్ర మేలు.!
మొక్కలలో సల్ఫర్ లోపం యొక్క లక్షణాలు:
మొక్కలలో సల్ఫర్ 0.1 నుండి 0.4% మధ్య ఉంటుంది. భారతదేశంలో క్షేత్ర స్థాయిలో సల్ఫర్ లోపాల సంభవం ప్రకారం, N, P మరియు K తరువాత ఇది నాల్గవ ప్రధాన పోషకంగా వర్ణించబడింది. సల్ఫర్ లోపంతో బాధపడే మొక్కలు మాంసకృత్తులలో నైట్రేట్ మరియు అమైడ్ యొక్క రూపాలలో నాన్-ప్రోటీన్ నైట్రోజన్‌ను పేరుకుపోతాయి. వీటితో మనకు ఎలాంటి ఉపయోగం ఉండదు.
మొక్కలలో N:S నిష్పత్తి 9 నుండి 12 మధ్య సల్ఫర్ స్థిరంగా ఉంటుంది, లోపం లేత ఆకులపై వ్యక్తమవుతుంది.
1.ఆకులలో ఆకుపచ్చ రంగు క్షీణించడం తర్వాత పసుపు భారడం జరుగుతుంది.
2. కాండం పెరుగుదల పరిమితం అవుతుంది.
3. ప్రోటీన్లు మరియు నూనెల సంశ్లేషణ తగ్గవచ్చు. 4. బ్రాసికాలో తక్కువ ఆకులు ఉంది, అవి వంకరగా ఉండటం వలన గుబురుగా కంపించును.
5. పాత ఆకులు ఈనెల మధ్య ప్రదేశాలలో బుడిపెలు ఏర్పడును.
6. పాత ఆకులు నారింజ లేదా ఎర్రటి రంగులకు మారును లేదా ముందుగానే రాలిపోవచ్చు.
7. కాండం మరియు ఆకు ఈనెలు పెళుసుగా మారవచ్చులేదా ఆకులు రాలిపోవచ్చు.
సల్ఫర్ నిర్వహణ లేదా S లోపం కోసం సవరణ చర్యలు:
- క్షార సల్ఫర్ లేదా జిప్సం ముఖ్యంగా నల్ల చౌడు నేలలపై వేసుకోవాలి.
- సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ (12-14% S),మెగ్నీషియం సల్ఫేట్ (30 % S), అమ్మోనియం సల్ఫేట్ (24.2% S) వంటి సల్ఫర్‌ను కలిగిన ఎరువులు ఉపయోగించడం.
- నిలబడిన పంటపై సల్ఫర్ లోపాలను సరిదిద్దడానికి,ఫెర్రస్ సల్ఫేట్ (32.8% S) మరియు ఫెర్రస్ అమ్మోనియం సల్ఫేట్ (16% S) మొదలైనవి ఆకులను పిచికారీ చేయాలి.
Also Read: Homeopathy Treatment For Neem Trees: వేపకు హోమియో ట్రీట్మెంట్.!