Fungal Disease Management: విత్తన నిల్వలో పురుగులు ఆశించడం సర్వ సాధారణం. అయితే కొన్ని ప్రత్యేక సందర్భాలలో మాత్రం శిలీంద్రాలు కూడా ఆశిస్తాయి. ఇవి ఆశించడం వలన గింజ రంగు మారుతుంది, పగులుతుంది, అలాగే బూజు పట్టి తుట్టెలుగా కూడా మారుతుంది. సాధారణంగా ఆస్పెర్జిల్లాస్ మరియు ఆల్ట్రనేరియా, హెల్మెంతోస్పోరియం వంటి శిలీంద్రాలు ఎక్కువగా ఆశిస్తాయి నిల్వ సమయంలో తెగుళ్లు ఆశించి ధాన్యం యొక్క పరిమాణంలో మరియు నాణ్యతలో నష్టం చేస్తాయి. దాదాపు 5-10 శాతం ధాన్యం తెగుళ్ల వలన నష్టపోయి తినడానికి నిరుపయోగంగా మారుతుంది. కావున రైతులు లేదా గోదాము నిర్వాహకులు తగు జాగ్రత్తలు చేపట్టి సమగ్రంగా తెగుళ్ల నిర్వహణ చేపట్టుకోవాలి.
Also Read: Facts about TS Agriculture: తెలంగాణాలో సాగులో కీలక అంశాలు.!
నిల్వ సమయంలో శిలీంధ్ర వ్యాప్తి కి అనుకూలించే పరిస్థితులు
1.విత్తనంలో తేమశాతం ఎక్కువుగా ఉండటం.
2. వానాకాలంలో 25-30 డిగ్రీల ఉష్ణోగ్రత్త ఉన్న పరిస్థితులలో నిల్వ చేయడం.
3.ధాన్యంలో కలుపు విత్తనాలు కలిసి నిల్వ చేసినపుడు.
4. పంట సమయంలోనే కోతకు మునుపే శిలీంద్రం గింజలను ఆశించి ఉండడం.
5. విత్తనాన్ని దీర్ఘ కాలం నిల్వ చేయడం.
6. నిల్వ చేసే పరిసరాలు అశుభ్రంగా ఉండడం.
శిలీంధ్ర తెగులు విత్తనాన్ని ఆశించకుండా తీసుకోవలసిన జాగ్రత్తలు
1. ధాన్యం పొలం మీద ఉన్నపుడు పూర్తిగా గట్టిపడినపుడు మాత్రమే కొత్త కోయాలి. పగిలిన లేదా సగం నిండి గింజలను శిలీంద్రాలు ఆశిస్తాయి కావున కొత్త మరియు నిల్వ సమయంలో గింజకూ ఎలాంటి బాహ్య దెబ్బ తాకకుండా చూసుకోవాలి.
2. నిల్వ ప్రదేశం లో 60% కన్నా తక్కువ తేమ ఉండేలా చర్యలు చేపట్టాలి.
3. గింజను 8% కన్నా తక్కువ తేమ వచ్చే విధంగా ఎండబెట్టాలి. ఎక్కివ తేమ ఉన్నట్లైతే సూక్ష్మ జీవులు సునాయాసంగా వృద్ధి చెందుతాయై.
4. గోదాములు శుభ్ర పరిచి కీటక రహితంగా చేసుకోవాలి.
5. వీలుంటే ధాన్యాన్ని గామా లేదా మైక్రోవేవ్ కిరణాలతో శుద్ధి చేసుకోవాలి.
6. ప్రతి సీజన్లో నిల్వకు ఉపయోగించే సంచులు తప్పనిసరిగా మార్చాలి.
Also Read: TS Seed Regulation Report: తెలంగాణ ప్రభుత్వ విత్తన నియంత్రణ వార్షిక నివేదిక 2021-22