Seed Treatment in Groundnut: వేరుశనగ రాష్ట్రంలో విస్తీర్ణంలో సాగవుతున్న నూనె గింజల పంట. వేరుశనగ ప్రధానంగా యాసంగిలో మహబూబ్‌నగర్, వరంగల్, నల్గొండ, అనంతపురం మరియు కరీంనగర్ జిల్లాల్లో అధిక విస్తీర్ణంలో పండిస్తున్నారు. ఈ పంట సాగుకు అనువైన తేలిక పాటి నేలలు మరి నేలలు మరియు తుంపర (స్ప్రింక్లర్ల) పద్ధతి ద్వారా సులువైన నీటి యాజమాన్యం వలన యాసంగిలో ఈ వేరుశనగ పంట యొక్క విస్తీర్ణం గణనీయంగా పెరుగుతుంది. వేరుశెనగ నూనె వివిధ ఆహార పదార్థాలు తయారు చేయడానికి వంట మాధ్యమం. ఇది ఆసియా ప్రజలకు కూరగాయల నూనె అవసరం యొక్క ప్రాథమిక మూలం.

Seed Treatment in Groundnut
విత్తుకునే సమయము: ఖరీఫ్‌లో వేరుశనగ పంటను జూలై రెండవ పక్షం వరకు విత్తుకోవచ్చు. ఈ పంటను యాసంగిలో ఉత్తర తెలంగాణలో అక్టోబరు రెండవ పక్షంలోపు, దక్షిణ తెలంగాణలో సెప్టెంబరు మొదటి పక్షం నుండి నవంబరు రెండవ పక్షం వరకు విత్తుకోవచ్చు.
Also Read: Garlic Harvesting: వెల్లుల్లి కోత సమయంలో తీసుకోవలసిన జాగ్రత్తలు
నేలలు మరియు నేల తయారీ: ఇసుకతో కూడిన గరప నేలలు లేదా నీరు త్వరగా ఇంకే ఎర్ర చల్కా నేలలు వేరుశనగ సాగుకు చాలా అనుకూలమైనవి. ఎక్కువ బంకమన్ను కలిగిన నల్లరేగడి నేలల్లో ఈ పంట వేయరాదు. విత్తే ముందు నేలను మెత్తగా దుక్కిచేసి చదును చేయాలి.

Seed Treatment
విత్తనశుద్ధి: కిలో విత్తనానికి 1 గ్రా., టెబ్యుకొనజోల్ లేదా 3 గ్రా., మాంకోజెబ్ పొడి మందు పట్టించాలి. కాండం ఖరీ కుళ్ళు వైరస్ తెగులు ఆశించే ప్రాంతాలలో ఒక మి.లీ., ఇమిడాక్లోప్రిడ్ ను 7 మి.లీ. నీటిలో కలిపి ఒక కిలో విత్తనానికి పట్టించాలి.
వేరుపురుగు ఉధృతి ఎక్కువగా ఆశించే ప్రాంతాలలో 6.5 మి.లీ., క్లోరిపైరిఫాస్ తో విత్తన శుద్ధి చేసుకోవాలి. వరి మాగాణుల్లో లేక కొత్తగా వేరుశనగ సాగు చేసేటప్పుడు ఎకరాకు సరిపడే కిలో విత్తనానికి 200 గ్రా., రైజోబియం కల్చరుని పట్టించాలి. విత్తే పదు వేరుకుళ్ళు, మొదలు కుళ్ళు మరియు కాండము కుళ్ళు తెగుళ్ళు ఎక్కువగా ఆశించే పరిస్థితులలో కిలో విత్తనానికి విత్తుకోవా 10గ్రా. ట్రైకోడెర్మా విరిడిని పట్టించి మంచి ఫలితాలు పొందవచ్చు.
Also Read: Maize Cultivation: మొక్కజొన్న సాగులో జాగ్రత్త వహించవలసిన అంశాలు