Govt Hikes Paddy MSP 2022-23: ఆరుగాలం కష్ట పడి పండించిన పంటలకు మద్దతు ధర లేక అలమటించిన రోజులు ఎన్నెన్నో.పంట ఉన్నా తగ్గ ధర లేకపోవడం రైతుల కష్టాన్ని వృధా చేసిన రోజులు కోకొల్లలు.పెరిగిన పంట పెట్టుబడులు, రైతు కష్టాన్ని గమనించి రైతులకు కేంద్రం తీపు కబురును అందించింది. దాదా పు 14 పంటలకు కనీస మద్దతు ధరను పెంచుతున్నట్లుగా ప్రధాని నరేంద్ర మోడీ గారి నేతృత్వం వహించే ఆర్ధిక వ్యవహారాల కాబినెట్ కమిటీ బుధవారం రోజున ఆమోదించింది. ఈ ప్రకటిత మద్దతు ధరలు 2022-23 సంవత్సరానికి వర్తించనున్నాయి.

Union Govt Hikes Paddy MSP 2022-23
మద్దతు ధర అంటే ఏంటి ?
కనీస మద్దతు ధర (MSP) అంటే వ్యవసాయ ఉత్పత్తిదారులకు వ్యవసాయ ధరలలో ఊహించని పతనానికి వ్యతిరేకంగా బీమా కల్పించడానికి భారత ప్రభుత్వంచే నిర్ణయించబడు కనీస మార్కెట్ ధర. ఎలాంటి పరిస్థితిలో అయినా ఈ ధరను చెల్లించి మాత్రమే రైతు నుండి పంటను కొనుగొలు చేయాలి. ఉత్పత్తికి ఆయె ఖర్చు, పెట్టుబడిలో మార్పులు, ఇన్పుట్-అవుట్పుట్ ధర సమానత్వం, మార్కెట్ ధరలలో మారుతున్న పోకడలు, డిమాండ్ మరియు సరఫరా, పారిశ్రామిక వ్యయం పై ప్రభావం, జీవన వ్యయంపై ప్రభావం, సాధారణ ధరల యొక్క స్థాయిపై ప్రభావం, అంతర్జాతీయ ధరల యొక్క పరిస్థితి, రైతులు చెల్లించే ధరలకు మరియు అందుకున్న ధరలకు మధ్య ఉన్న సమానత్వం, ఇష్యూ ధరలు మరియు సబ్సిడీ మధ్య సంబంధం వంటి అంశాలను పరిగణలోకి తీస్కుని కమిషన్ ఫర్ అగ్రికల్చరల్ కాస్ట్స్ అండ్ ప్రైసెస్ నిర్ణయిస్తుంది.
Also Read: వంకాయ నాటే సమయం లో రైతులు తీసుకోవలసిన జాగ్రత్తలు

Minimum Support Price for all Kharif crops for Marketing season 2022-23
వ్యవసాయ ఖర్చులు మరియు ధరల కమిషన్ (CACP)ని 1965లో కేంద్రం ఏర్పాటు చేసింది, ఇది భారత ప్రభుత్వ వికేంద్రీకృత ఏజెన్సీగా పనిచేస్తుంది. ఇది వివిధ అంశాలను పరిగణనలోకి తీసుకుని కనీస మద్దతు ధరలను (MSPs) సిఫార్సు చేసే హక్కు దీనికి మాత్రమే ఉంటుంది. ప్రస్తుతం వారికీ 100 రూపాయలు పెరిగి 2040 రూపాయలు అయింది. గరిష్టంగా నువ్వులకు 523 రూపాయలు పెంచబడింది. మొక్కజొన్నకు 93 రూపాయలు, పెసరకు 480 రూపాయలు పెంచారు.
Also Read: టమాట పంటలో నీటి యాజమాన్యం