మన వ్యవసాయంరైతులు

Woman Farmer Success Story: సేంద్రియ సాగులో ఆదర్శంగా నిలుస్తున్న మహిళ

0
Woman Farmer Success Story
Woman Farmer Success Story

Woman Farmer Success Story: కేరళలోని కొక్కూర్ కు చెందిన సీనత్ అనే మహిళ సేంద్రియ విధానంలో పంటలు పండిస్తూ తన గ్రామంలో ని మహిళలకు ఉపాధి కల్పిస్తోంది. మొదట్లో ఆమెను చాలామంది నిరుత్సాహ పరిచారు. అయినా ఏమాత్రం వెనుతిరుగకుండా ఆత్మవిశ్వాసం తో అడుగు ముందుకు వేసింది. అసాధ్యాన్ని సుసాధ్యం చేసి చూపించి ఎంతోమంది మహిళలకు సీనత్ ఆదర్శంగా నిలుస్తోంది.

Woman Farmer Success Story

వ్యవసాయ ఆధారిత కుటుంబం నుంచి వచ్చిన సీనత్ కు వ్యవసాయ రంగంలో రాణించాలనే పట్టుదల గట్టిగా ఉండేది. పెండ్లి తరువాత ఆమె ఆలోచనలను అమలు చేయడానికి సిద్ధమైంది. అందుకోసం సేంద్రియ విధానంలో పంటలు ఎలా పండించాలి? ఎటువంటి పద్ధతులను అనుసరిస్తే ఎక్కువ దిగుబడులు వస్తాయనే అంశాలపై ప్రత్యేకంగా దృష్టి సారించింది. కేరళలోని మన్నుతి అగ్రికల్చరల్ యూనివర్సిటీ (Agricultural Technology Information Centre, Mannuthy) కి చెందిన కృషి భవన్ లో సేంద్రియ సాగుపై శిక్షణ ఇస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న ఆమె అక్కడ వారు ఏవిధంగా పంటలు పండిస్తున్నారనే అంశాలను పరిశీలించింది.

Also Read: Blind Woman: చూపు లేకపోతేనేం.. నెయ్యి & సూపర్‌ఫుడ్స్ అమ్ముతూ నెలకు రూ. 50 వేల సంపాదన

ఆ తర్వాత పదిమంది మహిళా స్వయం సహాయక సంఘలతో 2015లో సీనత్ “పెన్ మిత్ర” పేరుతో ఓ సంఘాన్ని ఏర్పాటు చేసింది. మన్నుతి అగ్రికల్చరల్ యూనివర్శిటీకి చెందిన శాస్త్ర వేత్తల సలహాలు, సూచనలు తీసుకుని సేంద్రియ పంటలను సాగు చేయడం మొదలు పెట్టింది. తక్కువ సమయంలోనే వారంతా సమిష్టిగా వ్యవసాయం చేసి,తమ గ్రామానికి సరిపడా కూరగాయలు పండించగలిగారు. ఊరంతా సరిపోగా మిగిలిన పంటలను ఇతర గ్రామాల్లో అమ్మేవారు. టమాట,బెండకాయ, క్యాలీ ఫ్లవర్,క్యాప్సికం, కూరగాయలతోపాటు, వరి పంట కూడా సాగు చేస్తున్నారు. ఐదేకరాల భూమిని కౌలుకు తీసుకుని అందులో వరి పంట సాగు చేస్తున్నారు.

కేవలం పదిమందితో మొదలైన “పెన్ మిత్ర” ప్రస్తుతం 50 మహిళా సంఘాలుగా అభివృద్ధి చెందింది. పదోతరగతి మాత్రమే చదివిన సీనత్ కు డిగ్రీ చదవాలని ఉండేది. దీంతో ఆమె ఇందిరా గాంధీ ఓపెన్ యూనివర్సిటీ లో చేరి డిగ్రీ పూర్తి చేసింది. “చదువుకోవడం వల్ల మరిన్ని విషయాలు తెలుసుకోవచ్చు. చదువు కోవడానికి వయసు అడ్డుకాకూడదు. చదువు జ్ఞానం సంపాదించడానికి ఒక సాధనం వలే ఉపయోగపడుతుందని” ఆమె చెబుతున్నది.

తాను చదువుకోవడం వల్ల సరికొత్త వ్యవసాయ పరికరాలను గురించి తెలుసుకుని మరింతగా దిగుబడులను సాధించేందుకు సీనత్ కృషి చేస్తోంది. సేంద్రియ సాగులో ఆమె తెలుసుకున్న మెలకువలను ఇతర మహిళా సంఘాలకు తెలియజేస్తూ సేంద్రియ సాగుతో అధిక దిగుబడులు పొందుతున్నారు. ప్రస్తుతం “పెన్ మిత్ర”కు చెందిన మహిళా సంఘాలు వ్యవసాయ అనుబంధ కార్యకలాపాలను ప్రారంభించారు. పశుపోషణ, పౌల్ట్రీ పరిశ్రమల్లో అడుగు పెట్టిన ” పెన్ మిత్ర “మహిళలు మరిన్ని విజయాలు సాధిస్తూ ప్రగతి పథంలో దూసుకుపోయేందుకు సీనత్ ఎంతో బాగా కృషి చేస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు.

Also Read: Woman Farmer Success Story: ఇంట్లో ‘మినీ ఫారెస్ట్’

Leave Your Comments

Safflower Harvesting: కుసుమ పంట కోత సమయంలో రైతులు తీసుకోవలసిన జాగ్రత్తలు

Previous article

Gap Filling and Thinning in Cotton: పత్తిలో అధిక దిగుబడికి సరైన మొక్కల జనాభా అవసరం

Next article

You may also like