జాతీయంవార్తలు

Tomato Prices: తగ్గనున్న టమాటా ధరలు – కేంద్ర ఆహార కార్యదర్శి

0
Tomato Prices
Tomato

Tomato Prices: స్థానికంగా కురిసిన వర్షాల కారణంగా, పంట నష్టం కారణంగా రేట్లు బాగా పెరిగిన దక్షిణాది రాష్ట్రాల్లో వచ్చే రెండు వారాల్లో రిటైల్ టమోటా ధరలు స్థిరంగా ఉంటాయని కేంద్ర ఆహార కార్యదర్శి సుధాన్షు పాండే తెలిపారు. వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ (Ministry of Consumer Affairs) నిర్వహించిన డేటా ప్రకారం, రిటైల్ టొమాటో ధరలు అనేక ప్రాంతాల్లో కిలో రూ. 50 మరియు 106 మధ్య ఉన్నాయి.

Tomato Prices

Tomato Prices

కిలో రూ.40కి విక్రయించబడుతున్న ఢిల్లీ మినహా, ఇతర మెట్రో నగరాల్లో రిటైల్ ధరలు అత్యధికంగా ఉన్నాయి. ఢిల్లీలో టమాటా ధరలు నిలకడగా ఉన్నాయని, దక్షిణ భారతదేశంలో స్థానిక వర్షాల కారణంగా పంట దెబ్బతినడం వల్ల ధరలు పెరిగాయని పాండే విలేకరులతో అన్నారు.

Also Read: Tomato Health Benefits: టొమాటో తో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు

వాస్తవ ఉత్పత్తి మరియు రాకపోకలు ఎక్కువ కాబట్టి ఉత్పత్తి విషయంలో ఎలాంటి సమస్య లేదని, ఈ విషయమై రాష్ట్రాలతో ప్రభుత్వం చర్చించిందని చెప్పారు. రాబోయే రెండు వారాల్లో టమాటా ధరలు నిలకడగా ఉండబోతున్నాయని కేంద్ర ఆహార కార్యదర్శి సుధాన్షు పాండే తెలిపారు.

అంతేకాకుండా ఉల్లి ఉత్పత్తి, కొనుగోళ్లు కూడా గతేడాది షెడ్యూల్‌ కంటే ముందున్నాయని ఆయన పేర్కొన్నారు. రబీ సీజన్‌లో ఇప్పటికే 52 వేల టన్నులు సేకరించామని, గత ఏడాది 30 వేల టన్నుల కంటే చాలా ఎక్కువ అని సుధాన్షు పాండే చెప్పారు.

Also Read: Tomato Farming: సరిగ్గా సాగు చేస్తే టమోటాతో లక్షల్లో ఆదాయం

Leave Your Comments

Hydroponics Farming: హైడ్రోపోనిక్స్ వ్యవసాయంతో సంవత్సరానికి 70 లక్షలు సంపాదన

Previous article

TS Agriculture Minister: కంపతార చెట్లు కానరావొద్దు

Next article

You may also like