Groundnut వేరుశనగ తెలంగాణ రాష్ట్రంలో విస్తీర్ణంలో (సుమారు 2.0 లక్షల హెక్టార్లు) సాగవుతున్న నూనె గింజల పంట. వేరుశనగ ప్రధానంగా యాసంగిలో మహబూబ్నగర్, వరంగల్, నల్గొండ పక్షంలోపు, మరియు కరీంనగర్ జిల్లాల్లో అధిక విస్తీర్ణంలో పండిస్తున్నారు. ఈ పంట సాగుకు అనువైన తేలిక పాటి నేలలు మరి నేలలు మరియు తుంపర (స్ప్రింక్లర్ల) పద్ధతి ద్వారా సులువైన నీటి యాజమాన్యం వలన యాసంగిలో ఈ వేరుశనగ పంట యొక్క విస్తీర్ణం గణనీయంగా పెరుగుతుంధి.
వేరుశెనగ నూనె వివిధ ఆహార పదార్థాలు తయారు చేయడానికి వంట మాధ్యమం. ఇది ఆసియా ప్రజలకు కూరగాయల నూనె అవసరం యొక్క ప్రాథమిక మూలం.
విత్తుకునే సమయము : ఖరీఫ్లో వేరుశనగ పంటను జూలై రెండవ పక్షం వరకు విత్తుకోవచ్చు. ఈ పంటను యాసంగిలో ఉత్తర తెలంగాణలో అక్టోబరు రెండవ పక్షంలోపు, దక్షిణ తెలంగాణలో సెప్టెంబరు మొదటి పక్షం నుండి నవంబరు రెండవ పక్షం వరకు విత్తుకోవచ్చు.
నేలలు మరియు నేల తయారీ: ఇసుకతో కూడిన గరప నేలలు లేదా నీరు త్వరగా ఇంకే ఎర్ర చల్కా నేలలు వేరుశనగ సాగుకు చాలా అనుకూలమైనవి. ఎక్కువ బంకమన్ను కలిగిన నల్లరేగడి నేలల్లో ఈ పంట వేయరాదు. విత్తే ముందు నేలను మెత్తగా దుక్కిచేసి చదును చేయాలి.
సూక్ష్మ పోషకాల లోపాలు : జింకు లోపించిన పైరులో ఆకులు చిన్నవిగా మారి మొక్కలు గిడస పడతాయి. ఈ లోపాన్ని సవరించడానికి ఎకరాకు 400 గ్రా, జింక్ సల్ఫేట్ 200 లీటర్ల నీటిలో కలిపి కనీసం 2 సార్లు పిచికారి చేసుకోవాలి. ఇనుప ధాతు లోపం నల్లరేగడి నేలల్లో అధిక తేమ ఉన్నపుడు కనిపిస్తుంది. లేత ఆకులు పసుపు పచ్చగా తర్వాత తెలుపు రంగుకు మారుతాయి. ఈ లోపాన్ని అధిగమించుటకు ఎకరాకు 30 రోజుల తర్వాత తొలి పూత దశలో మరో 10-18 కిలోల యూరియా వేసుకోవాలి. ఎకరానికి 200 కిలోల జిప్పము పూత దశ పూర్తయి ఊడలు దిగే సమయంలో
1 కిలో అన్నభేధి మరియు 200 గ్రా, సిట్రిక్ ఆమ్లం 200 లీ. నీటిలో కలిపి రెండు సార్లు పిచికారి చేసుకోవాలి.