Green gram మన రాష్ట్రంలో పెసర సాగు విస్తీర్ణం 8.13 లక్షల ఎకరాలు, ఉత్పత్తి 1.36 లక్షల టన్నులు మరియు ఉత్పాదకత ఎకరాకు 180 కిలోలు. ముఖ్యంగా తెలంగాణా, రాయలసీమ ప్రాంతాల్లో తొలకరి పంటగాను, కోస్తా ఆంధ్రలో తొలకరి మరియు రబీ పంటగా పండిస్తారు. రబీ వరి తర్వాత మాగాణి భూముల్లో, వేసవిలో కృష్ణా, గోదావరి డెల్టా ప్రాంతంలో మూడవ పంటగాను పండిస్తున్నారు. ప్రత్తిలో అంతర పంటగా కూడ పండించవచ్చు.
పెసరను, వర్షాకాలము, చలికాలము, వేసవిలోనే కాక, రెండుకాలాల మధ్య కూడా సాగు చేయబడుతున్నది. ఈ పంటను పచ్చిరొట్టపంటగా కూడా పెంచుతారు. వరిసాగుకు సరిపడినంత వర్షం పడకపోతే , పచ్చిరొట్ట పంటను, అలాగేపెంచి, దాని నుండి వచ్చే కాయలను తీసుకొని, మొక్కలను భూమిలోకి దున్నేస్తారు. ఈ పంట నీటి ఎద్దడిని కూడా తట్టుకుంటుంది. అందువలన దీనిని వర్షాధారంగా కూడా పండిస్తారు. ఈ పంటను కందిలోను, శనగలోను అంతర పంటగా పండిస్తారు- బత్తాయి, మామిడి వంటి తోట పంటల లేతదశలో పెసరను అంతర పంటగా పండించి ఖాళీ భూమిని సద్వినియోగంచేస్తారు.
విత్తేసమయం/కాలం:
ఖరీఫ్ కాలంలో జూన్-జులైలోను విత్తుకోవచ్చు.
రబీలో ఉత్తర, దక్షిణ తెలంగాణలో అక్టోబరులో విత్తుకోవచ్చు. కృష్ణా-గోదావరి మండలంలో వరి మాగాణుల్లో నవంబరు-డిసెంబరు మొదటి వారంలో, వేసవికాలంలో ఫిబ్రవరి – మార్చిలో విత్తుకోవచ్చు.
కలుపు నివారణ చర్యలు:
ఖరీఫ్ వరి అడుగులలో విత్తనం చల్లిన 21 28 రోజుల మధ్య ఫినాక్సిప్రాప్ ఇథైల్ 250 మి.లీ. లేదా సైహలోఫాప్ బ్యూటైల్ 300 మి.లీ. లేదా సోడియం ఎసిఫ్లోర్ఫెన్ + క్లోడినాఫాప్ ప్రొపార్జిల్ 400 మి.లీ. కలుపు 3-4 ఆకుల దశలో వున్నప్పుడు 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారి చేయాలి. క్విజాల్పాఫ్ ఇథైల్ 400 మి.లీ. ఎకరాకు (చిప్పెర గడ్డి మరియు గడ్డిజాతి కలుపు కోతానంతర జా నివారణకు), 250 మి.లీ. ఇమాజితాఫర్ఎ కరానికి పంట కాండం. (బంగారు తీగ లేదావెడల్పాకు లేదా బంగారు తీగ కలుపు నివారణకు), పై మందులను ఎకరానికి 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారి చేయాలి. కలుపు లేకుండా విత్తిన 25 రోజుల వరకు పైరులో చూసుకోవాలి.