Latest News in Cooking Oil: ఇప్పటికే మోగుతున్న నూనె, గోధుమ, సోయాబీన్ రేట్లకు మరొకటి చేరకముందే కేంద్ర ప్రభుత్వం రంగంలోకి దిగింది. సామాన్యులకు పెను భారం తగ్గించే దిశగా దిగుమతులపై కస్టమ్స్ సేస్స్ తొలగిస్తూ, చెక్కర దిగుమతుల పైన కూడా విధి విధానాలు ప్రవేశ పెట్టింది.2022-24 మధ్య ఉన్న రెండు ఆర్ధిక సంవత్సరాలకు వర్తించే విధంగా 20 లక్షల మెట్రిక్ టన్నుల పొద్దుతిరుగుడు నూనె, ఇంకో 20 లక్షల మెట్రిక్ టన్నుల సొయా నూనె మీద కస్టమ్స్ టాక్స్, అగ్రికల్చరల్ ఫెసిలిటీ డెవలప్మెంట్ సెస్స్ లను తొలగిస్తున్నట్లు ప్రకటించింది.

Latest News in Cooking Oil
ఈ రెండు సంవత్సరాలలో 80 లక్షల మెట్రిక్ టన్నుల నూనె పైన సుంకం మినహాయింపు వస్తుందని అంచనా. ఇది సామాన్యుడి పైన భారం తగ్గడానికి ఉపయోగపడుతుంది. కేంద్రం 5.5 % సుంకాన్ని వసూలు చేస్తుంది. ఇది తగ్గడం వలన సోయా నూనె లీటరుకి 3 రూపాయలు తగ్గనుంది.
Also Read: Seed Treatment in Groundnut: వేరుశనగ లో విత్తనశుద్ధి తో తెగుళ్ళ కు చెక్
పామ్ ఆయిల్ మీద సుంకాన్ని తగ్గించి సాగు పెంచుతున్న విషయం తెలిసిందే దీని కోవా లోకే రైస్ బ్రాన్ ఆయిల్, నువ్వుల నూనె కూడా తీసుకురావాలని నిపుణులు కోరుతున్నారు. పెట్రోల్, డీసెల్ ధరలను తగ్గించినందుకు గాను రవాణా ఖర్చులు కూడా తగ్గి నూనెల ధరలు సామాన్యుడికి అందుబాటులో రావచ్చు. పది మిలియన్ టన్నుల చెక్కరను మాత్రమే దిగుమతి చేసుకోవాలని కేంద్రం దిగుమతి సంస్థలకు ఆదేశించింది.
ఈ ఆదేశాలు జూన్ 1 నుండి అమలు పర్చనున్నారు,ఈ మార్కెటింగ్ సంవత్సరంలో దేశంలో 60 లక్షల చెక్కర నిల్వలు ఉంచుకుని 9 మిలియన్ టన్నుల చెక్కర ఎగుమతి చేయమని ఆదేశించగా అందులో 7. 5 మిలియన్ టన్నుల చెక్కరను ఇప్పటికే ఎగుమతి చేశారు. గత సంవత్సరం 2021-2022 లో 7 మిలియన్ టన్నుల పంచదారను ఎగుమతి చేసింది. దిగుమతులు చేసే సంస్థలు మే 27 నుండి జూన్ 18 లోగా కేంద్రానికి దరకాస్తులు సమర్పించాల్సి ఉంటుంది.
Also Read: Garlic Harvesting: వెల్లుల్లి కోత సమయంలో తీసుకోవలసిన జాగ్రత్తలు