PJTSAU MIC Report: వచ్చే నెల నుండి ఖరీఫ్ సీజన్ ప్రారంభం కానున్న వేళా ప్రొఫెసర్ జయ శంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆశ్చర్యమైన విషయాలు వెల్లడించింది. వచ్చే వానాకాలంలో తెలంగాణ రైతులు వరి, మొక్కజొన్న, పసుపు వంటి పంటలకు గిట్టుబాటు ధరలు ఉండకపోవచ్చు అని, ఈ పంటల సాగు లాభదాయకంగా ఉండకపోవచ్చు అని వర్శిటీ మార్కెట్ ఇంటలిజెన్స్ సెంటర్ తన అద్యాయనంలో వ్యక్త పరిచింది. ఈ మార్కెట్ ఇంటలిజెన్స్ సెంటర్ అనేది రాబోయే సీజన్లో లో ఎలాంటి పంటలకు జాతీయ అంతర్జాతీయ మార్కెట్లలో డిమాండ్ ను, వినియోగదారుల అభిరుచుల ఆధారంగా ఈ అంచనాలను ప్రతి సంవత్సరం అంచనా వేస్తుంది. అయితే పప్పు దినుసులు, సోయా బీన్, పత్తి వేయడం లాభ దాయకంగా ఉంటుంది అని అంచనా. దీనికి మంచి ధర లభిస్తుందని ఎం. ఐ. సీ ప్రకటించింది.

PJTSAU MIC Report
Also Read: How Methane Released in Farming: మీథేన్ భూమి నుండి ఎలా వస్తుంది, ఏ విధంగా హాని చేస్తుంది?
వరి గురించి ఎం. ఐ. సీ ఏం చెబుతుంది ?
ప్రస్తుతానికి వరి నిలువలు ఎక్కువవడంతో కేంద్రం కొనుగోలు మానేసింది. రాష్ట్ర ప్రభుత్వమే బలవంతంగా 1940/- కి కొంటుంది కాని వచ్చే వానాకాలంలో దీనికి గిట్టుబాటు కూడా రాకపోవచ్చు అని ముందస్తు సూచన. దీని రేటు 1650/- నుండి 1940/- మధ్య ఉండవచ్చు. క్వింటా కు 50/- పెరిగే అవకాశం ఉన్నా కూడా వరి సాగు ఆదా జనకంగా ఉండకపోవచ్చు అని చెపుతున్నారు వర్సిటీ అధికారులు.

MIC Report
ఎక్కువ దిగుబడి వచ్చినా మార్కెట్ లో డిమాండ్ లేకపోతే చివరకు మిగిలేది నష్టమే. మార్కెట్ ఇంటెలిజెన్స్ ప్రకారం పంటను ఎంపిక చేసుకోవడం తెలివైన పనిగా నిపుణులు పేర్కొంటారు, ఇది రైతు లాభం ఆర్జించడం మాత్రమే కాకుండా ఇతరులకు ఆదర్శంగా నిలబెడుతుంది.వానాలంలో నవంబర్ నెలలో అమ్మే పత్తికి ₹ 8100-8600/- మధ్య, పొద్దు తిరుగుడు ₹ 6500 -6700 /-, మిరప కు జనవరి నుండి మార్చి మధ్య 13,500 – 15,500/- ఉంటుందని ప్రాథమిక అంచనా. ఇలాగే దాదాపు 15 రకాల పంటలకు అంచనా రేట్లను వెలువడించారు వ్యవసాయ సంచాలకులు డాక్టర్.జగదీశ్వర్.
Also Read: Eutrophication Losses: యూట్రోఫికేషన్ గురించి ప్రతి రైతు తెలుసుకోవలసిన విషయాలు.!