Wild Brinjal Pests: రోడ్ల పైన పనికి రాని కలుపు మొక్కగా మాత్రమే మనకు తెలిసిన అడవి వంకాయ ఒక మంచి కూరగాయ మరియు ఔషధ మొక్క. ఈ మొక్కను పురాతన నాటు వైద్యంలో ఉపయోగించేవారు. దీనిని అతి తక్కువ మంది వాణిజ్య పరంగా పండిస్తారు. ఈ మొక్కను నీటి ఎద్దడి, జీవ నిర్జీవ సంబంధ కారకాలకు మొండి మొక్కగా శాస్త్రవేత్తలు అభివర్ణిస్తారు, ఇది తీవ్రమైన తెగుళ్ల నుండి తనకు తానూ రక్షించుకోగలదు.
అయినప్పటికీ, ఇది కొన్నిసార్లు ఆకులను తినే గొంగళి పురుగులు మరియు రెక్కలు లేని పచ్చ పురుగుల భారిన పడుతుంది. ముళ్ళు ఉన్నప్పటికీ దీని ఆకులను తిని నష్టపరుస్తుంది. దీని నివారణకు క్లోరిపైర్ఫోస్ 2మీ లీ లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. కాయ తొలుచు పురుగు (ల్యూసినోడ్స్ ఆర్బోనాలిస్) మరియు ఆకు తినే పెంకు పురుగులు కూడా ఆశించి నష్టపరుస్తాయి. ఇవి కూడా ఆకులను తిని నష్టపర్చును. నియంత్రించడానికి క్లోరోపైరిఫాస్‌ను 2 ఎం.ఎల్ / లీటర్ నీటికి కలిపి ఆకుల పైన పిచికారికి ఉపయోగించవచ్చు. అడవి వంకాయను పురుగుల కన్నా వ్యాధులు ఎక్కువగా పీడిస్తాయి.
Also Read: Kaleshwaram Project: కాళేశ్వరం రైతుకు లాభమా ? నష్టమా ?
1. పొడి మరియు వెచ్చని కాలంలో బూజు తెగులు కనిపిస్తుంది, బావిస్టిన్ 1 గ్రాము లీటర్ నీటికి కలుపుకుని వ్యాధి నివారణకు పిచికారీ చేయాలి.
2. పొలాన్నికలుపు లేకుండా శుభ్రంగా ఉంచడం, పంటను బాగా ఎండిపోయిన మట్టిలో మొలకలతో నాటడం ద్వారా కాలర్ తెగులు లేదా ఫ్యూసేరియం వడలు తెగులును అధిగమించవచ్చు.మొలకల వేర్లు ను బావిస్టిన్ యొక్క 0.1% ద్రావణంలో 1 గంట పాటు ముంచడం లేదా 0.25% కాపర్ ఆక్సిక్లోరైడ్ లేదా 0.1 % బావిస్టిన్ ద్రావణంతో విత్తనాలను కలిపి విత్తన శుద్ధి చేయడం వ్యాధిని నియంత్రిస్తాయి.
3. కొన్నిసార్లు మొక్కల మీద మొజాయిక్ కనబడుతుంది. మొజాయిక్ అనగా లేత ఆకుపచ్చ, పసుపు రంగు మిళితమై ఆకు వాడిపోతుంది. మొజాయిక్ అనేది మూడు వేర్వేరు వైరస్ల వల్ల కలుగుతుంది.ఈ వైరస్ లు దాడి చేయడం వలన ఎదుగుదల కుంగిపోయి లేత ఆకుపచ్చ, పసుపు రంగు వలయాలు ఉంటాయి. ఈ మొక్కలను బాగా తొలగించి నాశనం చేయాలి.
4. ఈ పంటలో బాక్టీరియల్ ఆకు మచ్చ అనేది తీవ్రమైన వ్యాధి కాదు.కానీ తీవ్రమైన యెడల 30 గ్రా స్ట్రెప్టోసైక్లిన్ మరియు 30 గ్రా కాపర్ సల్ఫేట్ 500లో కరిగించి 200 లీటర్ల నీటిలో కలిపి ఎకరాకు పిచికారీ చేసుకోవాలి.
5. ఆకు-ముడత వ్యాధి అనేది పైథియం బుట్లేరి అనే శిలీంద్రం వలన నర్సరీ బెడ్లలో వస్తుంది, నర్సరీ-బెడ్లలో పెరుగుతున్నప్పుడు డంపింగ్-ఆఫ్ (వేరు కుళ్ళు వ్యాధి ) వ్యాధి కి కారణం అవుతుంది. దీనిని నియంత్రించడానికి , విత్తనాలను బావిస్టిన్ 3గ్రా / కిలో విత్తనాలతో కలిపి శుద్ధి చేస్తారు. సీడ్-బెడ్లను విత్తిన తర్వాత మరియు మళ్లీ 50% విత్తనాలు మొలకెత్తినప్పుడు, 0.1% బావిస్టిన్ లేదా
0.25% కాపర్ ఆక్సిక్లోరైడ్ ద్రావణంతో పిచికారీ చేసుకోవాలి.
6. వేరు బుడిపెల నులి పురుగు లేదా రూట్-నాట్ నెమటోడ్‌తో కారణంగా మొక్కలు వాడిపోవడం జరుగును దీనిని అదుపులో పెట్టుకోవడానికి పంట మార్పిడి లేదా కార్బొఫురన్ 3జి గుళికలు 4 కిలోలు ఎకరా చొప్పున విత్తన చాళ్లలో వేసుకోవాలి.
Also Read: Brinjal cultivation: వంకాయ సాగుకు అనుకూలమైన సమయం