చీడపీడల యాజమాన్యంమన వ్యవసాయం

Neem oil: వేప మందుల వాడకంలో రైతులు తీసుకోవలసిన జాగ్రత్తలు

0

Neem oil వృక్ష సంబంధ క్రిమి సంహారక మందులలో వేప చాల ముఖ్యమైనది. వేప చెట్టు యొక్క ప్రతి భాగము క్రిమి సంహారక స్వభావం కలిగి ఉండి, సుమారుగా 200 జాతుల పురుగులను అదుపులో ఉంచగలదు.

 వేప మందులు పని చేసే విధానము :

  • వేప మందులు పిచికారి చేసినప్పుడు మొక్కలపై పిల్ల మరియు పెద్ద పురుగులు చేరకుండా వికర్షకాలుగా పని చేస్తాయి. తల్లి పురుగులు గ్రుడ్లు పెట్టలేవు.
  • వేపమందులు పిచికారి చేసిన మొక్కలను పురుగులు తినలేవు, తిన్నప్పటికి జీర్ణకోశం లోకి సరిగ్గా తీసుకోలేవు.
  • పురుగుల పెరుగుదలను నిరోధిస్తాయి. పిల్ల పురుగులు సరిగ్గా పెరగక, కోశస్థ దశకి చేరుకోకముందే, చనిపోతాయి. ఒకవేళ కోశస్థ దశకి చేరినప్పటికి ఆ దశలో ఓ చనిపోతాయి. పెద్ద పురుగులు సరిగ్గా ఏర్పడవు.
  • పురుగులపై బాహ్యచర్మం ఏర్పడదు. దీని వలన పురుగులు సహజ శత్రువులకి, ప్రతికూల వాతావరణ పరిస్థితులకి సులువుగా చనిపోతాయి.
  • మగ మరియు ఆడ పురుగులలో ఒక దానిని ఇంకొకటి గుర్తించలేక సంపర్కం చెందలేవు. సంతతి అభివృద్ధి చెందదు.
  • పెద్ద పురుగులలో వంధ్యత్వం కలిగి, గ్రుడ్లను పెట్టే శక్తిని కోల్పోతాయి.
  • వేప మందులు పిచికారి తరువాత పురుగులు 3-14 రోజులలో చనిపోతాయి. రసం పీల్చే పురుగులకన్నా, మొక్క భాగాలను కొరికి నమిలి తినే పురుగులపై బాగా పని చేస్తాయి.

 వేప మందుల పిచికారితో ప్రయోజనాలు :

  • ఇవి మనుష్యులకు, ఇతర క్షీరదాలకు సురక్షితమైనవి.
  • • వేపలో ఉన్న చాల రసాయనాలు పురుగులను నివారించుటలో దోహదం చేస్తాయి. కాబట్టి పురుగులలో వేపమందులకి నిరోధకశక్తి పెరిగే అవకాశం తక్కువ.
  • అంతర్వాహిక చర్యతో పనిచేసే పురుగులను అదుపులో ఉంచుతాయి.

 

  • పిచికారి చేసిన తరువాత వేపమందుల అవశేషాలు మొక్కలలో ఉండవు.
  • వీటి వలన వాతావరణానికి హాని ఉండదు.

వేప మందుల వాడకంలో తీసుకోవలసిన జాగ్రత్తలు :

  • వేపమందులను వీలైనంత వరకు ఉదయం పూట పిచికారి చేయాలి. ఉదయం 11 గం॥ల నుండి మధ్యాహ్నం 2 గం||ల మధ్య పిచికారి చేస్తే, అతి నీలలోహిత కిరణాల వల్ల సరిగ్గా పని చేయవు.

  • పంట విత్తిన 15 నుండి 45 రోజుల వరకు ఇవి పిచికారి చేయవచ్చు. రెక్కల పురుగులు, గ్రుడ్లు, పిల్ల పురుగు దశల్లో పిచికారి చేస్తే సమర్ధవంతంగా పని చేస్తాయి. • వేప గింజల కషాయాన్ని నిల్వ ఉంచకుండా వెంటనే వాడుకోవాలి.
  • వేపనూనె మందు ద్రావణం తయారు చేసినప్పుడు సర్పడి మరియు సాండోవిట్ జిగురును కలిపి పిచికారి చేసినట్లైతే ఆకులకి అంటుకుని వ్యాప్తి చెందుతుంది.

 

Leave Your Comments

Waste Decomposer: సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహించడంలో వేస్ట్ – డికంపోసర్

Previous article

Agriculture: తొలకరికి రైతులు ఎలా సన్నాహాలు చేసుకోవాలి.!

Next article

You may also like