పశుపోషణ

Fodder Crops: పశుగ్రాసాల ఎంపిక లో మెళుకువలు

0

Fodder crop జనాభాలో 70 శాతం కంటే ఎక్కువ మంది వ్యవసాయం నుండి వచ్చే ఆదాయంపై ఆధారపడి ఉన్నారు. పశుపోషణ అనేది పంటల వ్యవసాయానికి అనుబంధంగా ఉంది. పశువులు మరియు గేదెలను పాల ఉత్పత్తికి, వివిధ వ్యవసాయ కార్యకలాపాలకు ప్రేరణగా ఉంచారు. జంతువులు సాధారణంగా వ్యవసాయ ఉప ఉత్పత్తులపై నిర్వహించబడతాయి.

  • జీవాల పెంపకం ఉన్నప్పుడు తప్పనిసరిగా రైతులు తమకున్న భూమిలో పశుగ్రాస సాగుకై కొంత భూమిని కేటాయించాలి.
  • పావు ఎకరా భూమిలో (1000 చ.మీ.) నీటి ఆధారంగా పండించే పశుగ్రాసాలతో (బహువార్షికాలు) రెండు పాడి పశువులను లాభసాటిగా పోషించుకోవచ్చు.

  • నీటి వసతితో ఏడాది పొడుగునా కోతకు వచ్చే నేపియర్ పశుగ్రాస రకాలను (కో-4, కో-5) ఎంపిక చేసుకోవాలి.
  • పశువులకు పచ్చిమేత వేసేటప్పుడు గడ్డిజాతి మరియు కాయ జాతికి చెందిన పశుగ్రాసాలు 3:1 నిష్పత్తిలో ఉన్నట్లయితే పశువులకు సమతుల్య ఆహారం అందుతుంది. కావున కాయజాతి పశుగ్రాసాలు (లూసర్న్, అలసంద, హెడ్జ్ లూసర్స్, స్టైలో) కూడా వేయాలి.

జొన్న రకాలు

సి. ఎస్. హెచ్. 24ఎమ్.ఎఫ్.

ఎస్.ఎస్.జి, పి.సి 23

యు.పి. చారి

మొక్కజొన్న రకాలు

ఆఫ్రికన్ టాల్, గంగా సఫేద్-2 హైబ్రిడ్ ఎఫ్-2, ఎ.సి.ఎఫ్.యమ్ -8

సజ్జ

రాజ్కో బాజ్రా, జైంట్ బాజ్రా

  • బహువార్షిక పశుగ్రాసాలు కానీ, ఏకవార్షిక పశుగ్రాసాలు కానీ, చలికాలంలో పెరుగుదల, ఉత్పత్తి చాలా తక్కువగా ఉంటుంది. కాబట్టి వర్షాకాలంలో అవసరానికి మించి, ఉత్పత్తి అయిన పచ్చిగడ్డిని సైలేజ్ పద్ధతిలో మాగబెట్టుకుని 40 రోజుల తర్వాత నుండి వాడుకోవచ్చు.
  • పశువుల యొక్క శరీర బరువుని బట్టి ఒక్కింటికి 300 కిలోల పశుగ్రాసం తగ్గకుండా వేసుకోవాలి.
  • పాడి పెంపకంలో అధిక పాల ఉత్పత్తికి, కాయ జాతి పశుగ్రాసాలు లేక లెగ్యూమ్ పశుగ్రాసాలు చాలా అత్యవసరం. దీనికి గాను లూసర్న్, హెడ్జ్లూసర్న్, బర్సీమ్, స్టైలోసాంథిస్ హెమాటా, సుబాబుల్ వంటి వాటిని సాగు చేసుకోవాలి.

  • ఒక్కో పశువుకు రోజుకు లెగ్యూమ్ పశుగ్రాసం 5 కిలోల చొప్పున వేసుకోవాలి.
  • పశువులకు ఈ విధంగా ధాన్యపు జాతి పశుగ్రాసం మరియు కాయజాతి పశుగ్రాసం కలిపి ఇచ్చినట్లయితే, దాణాపై పెట్టే ఖర్చు తగ్గించుకోవచ్చు.
  • లూసర్న్ గడ్డి చలికాలంలో మాత్రమే విత్తుకోవాలి. విత్తుటకు ముందే కలుపు నివారణకు అన్ని జాగ్రత్తలు తీసుకుని బంగారు తీగ లాంటి కలుపు రాకుండా చూసుకోవాలి.
  • బర్సీమ్ పంటకి ఎక్కువ చలి, నీరు అవసరం. కావున ఆయా పరిస్థితులలోనే సాగుచేసుకోవాలి.
  • పశుగ్రాస ఎంపికలో నీటి వసతి ముఖ్యపాత్ర వహిస్తుంది. నీటి పారుదల సక్రమంగా ఉండి, భూమిని కేవలం పశు గ్రాసాల సాగుకి కేటాయించినచో బహువార్షిక పశుగ్రాస పంటను వేసుకోవాలి. బహువార్షిక పశు గ్రాసాలను ఒకసారి వేసుకుంటే 3 లేదా 4 సంవత్సరాల వరకు పచ్చిమేత దిగుబడి పొందవచ్చు. ప్రతి 45 రోజులకు ఒక కోత వస్తుంది.
Leave Your Comments

Agriculture: తొలకరికి రైతులు ఎలా సన్నాహాలు చేసుకోవాలి.!

Previous article

Sugarcane cultivation: చెఱకు సాగులో చెఱకు చెత్త వినియోగము

Next article

You may also like