లవంగం జన్మస్థానం మొలక్కస్. లవంగంను పెద్ద మొత్తంలో టాంజానియా, మెడగాస్కర్ మరియు ఇండోనేషియా దేశాల్లో ఉత్పత్తి చేయుచున్నారు. లవంగమును 1800 సంవత్సరంలో మనదేశానికి పరిచయం చేయడం జరిగింది. మనదేశంలో కేరళ, తమిళనాడు రాష్ట్రంలో ఈ పంట విస్తరించి ఉన్నది. లవంగము ముఖ్యంగా తమిళనాడులోని ‘తిరనిల్‌వెలి’ జిల్లాలోని ‘బర్లియర్’ దగ్గర నీగిరి కొండ యొక్క తూర్పు ఏటవాలు ప్రాంతాల్లో మరియు ‘మధురై’ జిల్లాలోని మేఘమలై ప్రాంతాల్లో బాగా పెరుగుతుంది. భారతదేశంలో లవంగానికి గిరాకీ చాలా బాగుంది. భారతీయ లవంగానికి మార్కెట్‌లో మంచి ధర కూడా భిస్తుంది.
ఉపయోగాలు :
- ఆకుపచ్చని లవంగం పచ్చళ్ళ తయారీలో వాడతారు.
- లవంగం తైలము (యూజినాల్)ను సబ్బు తయారీలోనూ, పరిమళ ద్రవ్యాలోనూ వాడతారు. అలాగే లవంగం యొక్క ఏంటిసెప్టిక్ ధర్మము వల్ల దీన్ని టూత్‌పేస్టు తయారీలో కూడా వాడతారు.
- ఇండోనేషియాలో లవంగంను పొగాకుతో కలిపి సిగరెట్ తయారీలో వాడుతున్నారు.
- వంగ వృక్షం 7-15 మీ. ఎత్తు వరకు పెరుగుతుంది. ఇది కొంత ఎత్తు పెరిగిన తరువాత కొమ్ము ఉద్భవిస్తాయి. శాఖలు బూడిద రంగు బెరడు కలిగి ఒక్కోసారి పెళుసుబారినట్లుగా ఉంటాయి.
- తైల గ్రంధులు విరివిగా ఆకుయొక్క క్రింది భాగంలో ఉంటాయి.
- పుష్పములు ద్విలింగాశ్రయ స్థితిలో ఉంటాయి. మొత్తం పుష్ప విన్యాసం 5 సెం.మీ వరకు పొడవు పెరుగుతుంది. పుష్పంయొక్క క్రింది భాగం మరియు రక్షక పత్రావళి చివరకు ఒక రసయుతమైన నల్లని టెంకగల కాయగా అభివృద్ది చెంది ఒక విత్తనం కలిగి ఉంటుంది. రక్షక పత్రము ముందుకు పొడుచుకుని వచ్చి త్రిభుజాకారంగా మారతాయి. దీనిని మాతృ లవంగం అంటారు.
రకాలు :
లవంగంలో బాహ్యస్వరూపం ఆధారంగా 3 జాతులు కలవు.
1. సిహుట్టిన్ :
చిగుర్లు పసుపు ఆకుపచ్చ నుండి ఆకుపచ్చ రంగులో ఉంటాయి. పుష్పాలు పెద్దవిగా పసుపురంగులో ఉంటాయి.
2. సికోటిక్ :
ఆకు ఎల్లప్పుడూ ఆకుపచ్చగానే ఉంటుంది. సిహుట్టిన్‌తో పోల్చితే ఆకు చిన్నదిగా ఉంటుంది.
3. జంజిబర్ :
- కోత సమయంలో వచ్చే చిగురు లవంగ పండు రంగులో ఉంటుంది. ఈ లవంగము నలుపు రంగులో ఉండి చాలా చిన్నవిగా ఉంటాయి.
- వాణిజ్య పరంగా పీనాంగ్ లవంగాలు ఆకృతిలో బాగా ఉంటాయి. ఇవి పెద్దగా ప్రకాశవంతమైన ఎరుపురంగులో ఉంటాయి.
- మనదేశంలో రెండు అత్యధికంగా దిగుబడినిచ్చే సంతానములో ఒకటి ‘‘బర్లియర్ నెం-1 ఎస్టేట్’’ మరియు ‘‘ఒడెథం ఎస్టేట్’’ వీటిని తమిళనాడులోని కల్లార్ మరియు బర్లియర్‌లో గల ఫపరిశోధన సంస్థల్లో వరణం అనే పద్ధతి ద్వారా అభివృద్ధి చేశారు.
వాతావరణం :
లవంగ వృక్షము తేమగా ఉండే ఉష్ణమండ వాతావరణంలో 100 -200 సెం.మీ వార్షిక వర్షపాతం నమోదు అయ్యే ప్రాంతాల్లో మరియు సముద్రమట్టానికి 1000 మీ. ఎత్తు ఉండే ప్రాంతాల్లో ఏపుగా పెరగగదు.
- సరాసరి ఉష్ణోగ్రత 20-300 డిగ్రీల సెం.గ్రే
- బాగా తేమగా ఉండే వాతావరణంలో లవంగం చెట్లు పుష్పించవు.
- నిర్జ (డ్రై) మరియు తడి వాతావరణము ఒక దాని తరువాత ఒకటి ఉండే ప్రాంతలో బాగా పెరుగుతాయి.
- మనరాష్ట్రంలో సముద్రమట్టానికి ఎత్తుగా ఉన్న ప్రాంతాలైన హార్సెలీ కొండలు మరియు అరకు ప్రాంతాల్లో కొంత వరకు ఈ వాతావరణం ఉంటుంది.
నేలలు :
సారవంతమైన గరప నేలలు వంగం సాగుకు అనుకూలం. ఇసుక నేల్లో దీని సాగు చాలా కష్టం.
ప్రవర్ధనం :
- వీటిని విత్తనం ద్వారా ప్రవర్థనం చేస్తారు. విత్తనాలను పండిన ఫలం నుండి వేరుచేసి పిమ్మట విత్తుకోవాలి, నారుమళ్ళు తయారు చేసుకోవాలి.
- పెద్ద పరిమాణంలో గల విత్తనాలు 88 శాతం మొలకెత్తితే చిన్న పరిమాణంలో గల విత్తనాలు 43 శాతం మొలకెత్తుతాయి.
- నారుమడి నీడలో ఏర్పాటు చేసుకోవాలి. 1-1 1/2 సంవత్సరం వయస్సు గల నారును జాగ్రత్తగా నాటుకోవాలి. జంజిబర్ నారును నారుమళ్ళలో ఒక సంవత్సరం పాటు ఉంచి తరువాత నాటుకోవాలి.
మొక్కలు నాటుట :
- ఒక మీటరు పొడవు, వెడల్పు లోతు గల గుంతలు త్రవ్వి పశువు ఎరువు కలిపిన మట్టి మిశ్రమాన్ని నింపాలి. వర్షాకాలంలో మొక్కు నాటాలి. 6 మీ. I 6 మీ. దూరంలో నాటాలి.
- జంజిబర్ నారు పూర్తిగా స్థిరపడే వరకు నీరు అందించాలి. వంగమును ఎక్కువగా పండిస్తున్న ప్రాంతాలో సాధారణంగా నారింజ మరియు మాంగోస్టీన్ పంటతో పండిస్తారు.
- మొక్కకు ప్రారంభంలో నీడ ఉండేటట్లు జాగ్రత్త పడాలి.
- ప్రారంభంలో విత్తిన మడిని ఎండిన ఆకలతో కప్పాలి. వేసవిలో క్రమం తప్పకుండా మొక్కకు నీరు పెట్టాలి.
ఎరువు :
- మొదటి సంవత్సరంలో మొక్కలు నాటిన 2 లేదా 3 నెల తరువాత ప్రతి మొక్కకు 4 కేజీ పశువు ఎరువును వేయాలి. దీనితో పాటు జులైలో 25 గ్రా. మ్యూరేట్ ఆఫ్ పొటాష్ వేయాలి. ఇదే మోతాదు సెప్టెబరు, అక్టోబరు మాసంలో మర వేయాలి.
- ఎరువులు ఒక్కొక్కసారి మట్టితో కలిపి ప్రతిమొక్కకు 15 -20 సెం.మీ దూరంలో మరియు 10 -15 సెం.మీ లోతులో వేయాలి.
- 8 సంవత్సరము వయస్సుగల చెట్టుకి 50 కేజీ కంపోస్టు, 1 కేజి అమ్మోనియంసల్ఫేట్, సూపర్‌ఫాస్ఫేట్ మరియు మ్యూరేట్‌ఆఫ్‌పొటాష్‌లను వేయాలి.
- ప్రతి మొక్కకు 10 కి.గ్రా పశువు ఎరువు, 400 గ్రా. నత్రజని, 350 గ్రా. భాస్వరం, 1200 గ్రా. పొటాష్ మరియు వీటితోపాటుగా అజోస్పైర్లిం మరియు ఫాస్ఫోబాక్టీరియా మొక్కకి 50 గ్రా. చొప్పున సరఫరా చేస్తే అత్యధి దిగుబడి ఇవ్వడం జరుగుతుంది.
- జంజిబర్ లవంగాలలో అమ్మోనియం సల్ఫేట్‌ను ప్రతిమొక్కకు 400 గ్రా. చొప్పున రెండు సమానభాగాలుగా వర్షాకాలం చివర్లో వేస్తూ ఉండాలి. ఈ విధంగా 6 సం॥ వయస్సు వరకు వేసి తరువాత ఈ మోతాదుని ఒక కేజీ వరకు పెంచాలి. అలా నత్రజని యాజమాన్యం జంజిబర్ లవంగాల్లో పాటిస్తే హెక్టారుకి 300 కి.గ్రా ఎండు లవంగాలు దిగుబడిని అదనంగా పొందవచ్చును.
కోత మరియు దిగుబడి :
- సాధారణంగా లవంగం 8-10 సంవత్సరం తరువాత పుష్పించి కోతకు వస్తుంది.
- కొన్ని ప్రదేశాల్లో 6వ సంవత్సరంలోనే కోతకి వస్తుంది.
- జంజిబర్ లవంగాలు 4-6 సంవత్సరంలోనే కోతకి వస్తుంది.
- పూ మొగ్గ శాఖ యొక్క కొనభాగంలో చిన్న కొమ్మపై ఉత్పత్తి అవుతాయి.
- మొగ్గు ఎప్పుడైతే లేత ఎరుపు రంగులోనికి మారతాయో అన్నింటినీ సేకరించాలి.
- మొగ్గ విచ్చుకోక ముందే అన్నింటినీ సేకరించాలి. లేకపోతే సుగంధ ద్రవ్యం విలువ తగ్గుతుంది.
- సాధారణంగా ఫిబ్రవరి నుండి మే నెల్లో దిగుబడి బాగా వస్తుంది.
- జంజిబర్ లవంగాలు సాధారణంగా ఆగష్టు నుండి డిసెంబరులో కోతకు వస్తాయి.
- ఫలమును జులై నుండి ఆగష్టులో కోస్తే విత్తనాలను తీసి విత్తుకోవచ్చు. లవంగాల దిగుబడి ప్రతి సంవత్సరం మారుతుంది. కోతకి వచ్చిన చెట్టు ఇచ్చే సరాసరి దిగుబడి 40 కి.గ్రా. ఒక చెట్టు నుండి ఎండిన లవణం 2 కి.గ్రా. మాత్రమే వస్తుంది. తగు జాగ్రత్తలో పెంచిన మొక్కు 10 కి.గ్రా ఎండిన ల వంగాలు దిగుబడిని ఇవ్వవచ్చు. లవంగం చెట్లు 60 సంవత్సరాల వయస్సు వరకు చెప్పుకోదగ్గ స్థాయిలో దిగుబడిని ఇవ్వగలవు.