Acorus Calamus: అకోరస్ కాలమస్ అను శాస్త్రీయ నామం గల మొక్క అకోరేసి (అరేసి) కుటుంబానికి చెందినది. దీనిని వాచా, అకోరస్, స్వీట్ ఫ్లాగ్, తీపికలోమెల్ అని వివిధ పేర్లతో స్థానికంగా పిలుస్తూ ఉంటారు కానీ స్వీట్ ఫ్లాగ్ అని అధిక ప్రాచుర్యంలో ఉంది. ఈ మొక్క చిత్తడి నేలల సమీపంలో ఎక్కువగా విస్తరించి ఉంటుంది. దీని ఆకులలో నిమ్మకాయను పోలి ఉన్న సువాసన వెదజల్లే గ్రంధులు ఉంటాయి. అందువలన దీని చుట్టూ పక్కన నడుస్తుంటే నిమ్మ వంటి సువాసన వస్తుంది. దీని వేర్లు కూడా తీపి సువాసనను కలిగి ఉంటాయి. అకోరస్ యొక్క దీర్ఘ ఔషధ విలువ కోసం ప్రసిద్ధి చెందినందు వలన దీనిని ఇతర ఔషద మొక్కల కన్నా ఎక్కువ సాగు చేస్తారు.
ఈ మొక్క 6 అడుగుల పొడవు, నిత్యం సుగంధం గా, కత్తి ఆకారంలో ఉండే ఆకులు కలిగి ఉంటుంది. దీని పువ్వులు పసుపు/ ఆకుపచ్చ వర్ణంలో ఆకర్షణీయంగా ఉంటాయి. దీని వేరు వ్యవస్థలో శాఖలుగా ఉండే దుంప/ రైజోమ్‌తో ఉంటాయి. దీని దుంప /రైజోమ్ లేదా వేర్లలో మోనోటెర్పీన్ హైడ్రోకార్బన్‌లు, సీక్వెస్ట్రైన్ కీటోన్‌లు, (ట్రాన్స్- లేదాఆల్ఫా) అసరోన్ (2, 4, 5-ట్రైమెథాక్సీ-1-ప్రొపెనైల్బెంజీన్) మరియు బీటా-అసరోన్ (సిస్-ఐసోమర్)లు ఉండడం వలన మానవ ఔషధంగా వాడుతారు.
Also Read: Jasmine Essential Oil: మల్లెపూల నుండి సుగంధ తైలం తీయటం
ఈ మొక్కకు సుదీర్ఘ ఔషద చరిత్ర ఉంటుంది. భారత దేశం మాత్రమే కాకుండా జర్మన్, గ్రీస్, ఇతర పాశ్చాత్య దేశాలలో కూడా స్థానికేతర జానపదాలలో వాడుకలో సుదీర్ఘ చరిత్రను కలిగి ఉంది. సుగంధ మూలాలను ఆల్గోన్‌క్విన్స్, క్రీ మరియు ఇతరులు ఔషధంగా ఉపయోగిస్తారు.
మొదట యూరోపియన్ స్థిరనివాసులు, ఔషధ ప్రయోజనాల కోసం దీనిని పెంచారు ఆ తరువాత ఉత్తర అమెరికా నుండి భారతదేశంలోకి ప్రయేశింప చేయబడింది. దీనిని వారు రైజోమ్‌ల ద్వారా సులభంగా ప్రచారం చేసారు. ఈ మొక్క కొద్దిగా విష పూరితం, అయితే ఇతర టానిక్‌లు తయారు చేయుటకు ఉపయోగకరమైన అనుబంధాన్ని ఏర్పరుస్తుంది.
అకోరస్ దగ్గు మరియు జలుబు నివారణలకు బాగా ప్రాచుర్యం పొందింది. బ్రోన్కైటిస్ వంటి శ్వాసకోశ రుగ్మతలు, ముడి రూపంలో ఇది దగ్గు లాజెంజ్‌గా కూడా ఉపయోగించబడుతుంది. అకోరస్ కాలమస్ జీర్ణవ్యవస్థకు మేలు చేస్తుంది. అజీర్తి, మరియు వాంతులు, శరీరంలో ఉండే అపానవాయువు కోలిక్‌కు వ్యతిరేకంగా పనిచేయును.
ఇది కేంద్ర నాడీ వ్యవస్థను నిరుత్సాహపర్చం వల్ల మానసిక-నిద్రలేమి రుగ్మతలను తగ్గిస్తుంది. అకోరస్ వేరు యొక్క ఆవిరి కొన్ని కీటకాలను తిప్పికొడుతుంది. దీనిని సేంద్రియ వ్యవసాయం కీటక నాశినిగా వాడుతారు.