Betel Vine Cultivation: తమలపాకు (పైపర్ బెటిల్ లిన్) ఆకును వక్క, సున్నం మరియు కాచుతో పాటు కలిపి నమాలడానికి ఉపయోగిస్తారు. భారతదేశం (India), శ్రీలంక, మలేషియా మరియు ఇండోనేషియా దీని పుట్టుక ప్రదేశాలుగా శాస్త్రవేత్తలు పేర్కొంటారు. ప్రస్తుతం ఇది ఆంధ్రప్రదేశ్ లోని విశాఖ వంటి ఏజెన్సీ ప్రాంతాలలో ముఖ్యమైన వాణిజ్య పంటగా పండిస్తారు.
దీనిని ఆంధ్రలో దాదాపు 3,600 హెక్టార్లలో సాగుచేస్తున్నారు. ఈ పంటలో మగ మరియు ఆడ మొక్కలు వేరు వేరుగా ఉంటాయి కాబట్టి, రెండు లింగాలు గల చెట్లను పెంచాల్సి వస్తుంది. ఇది నీడని అమితంగా ఇష్టపడే పంట అధిక ఎండను తట్టుకోలేదు. తమలపాకు తీగ పెరుగుదలకు అధిక తేమతో కూడిన ఉష్ణమండల వాతావరణం చాలా అవసరం. ఈ పరిస్థితులలో మాత్రమే ఈ పంటను సాగు చేసుకోవచ్చు.
Also Read: తమలపాకు సాగులో ఈ నివారణతో తెగుళ్లకు చెప్పండి గుడ్‌బై
కేరళ వంటి మెట్ట, చిత్తడి నేలల్లో దీనిని ప్రధానంగా వక్క మరియు కొబ్బరిలో బహుళ అంతస్తుల పంటగా సాగు చేస్తారు. ఈ పంట బాగా ఎండిపోయి సారవంతంగా ఉండే నేలల్లో బాగా పెరుగుతుంది. ముంపు, క్షార నేలలు ఆకు సాగుకు అంతగా అనుకూలం కాదు. ఎర్ర గరప నేలల్లో కూడా పంట బాగా వస్తుంది. ఈ పంటకు సరైన నీడ మరియు నీటిపారుదల ఆవశ్యకం. సంవత్సరంలో 200 నుండి 450 సెం.మీ వరకు వర్షపాతం పడే ప్రాంతాలను ఎంపిక చేసుకోవాలి.
పంట కనిష్టంగా 10 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతను మరియు గరిష్టంగా 40ºC వరకు తట్టుకుంటుంది. ఉష్ణోగ్రతలు తక్కువ ఉన్న చోటున సాగు చేస్తే ఆకు నాణ్యత తక్కువగా ఉంటుంది. ఆకు అభివృద్ధికి వేడి, పొడి గాలులు అత్యంత హానికరం. ప్రపంచంలో దాదాపు 100 రకాలకు పైగా తమలపాకు రకాలు ఉన్నాయి, వాటిలో దాదాపు 40 రకాలు మాత్రమే భారతదేశంలో, అందులో పశ్చిమ బెంగాల్‌లో 30 రకాలు మాత్రమే సాగులో ఉన్నాయి. మన దేశ విస్తీర్ణంలో దేశావారి, బంగ్లా, కపూరి, మీఠా మరియు సాంచి ఐదు ప్రధాన రకాలుగా ఉన్నాయి.
కపూరి మరియు సాంచి రకాలు భారత దేశంలో మంచి ప్రఖ్యాతి పొంది అధిక విస్తీర్ణంలో ఉన్నాయి. ఈ రెండు భారతదేశం, బంగ్లా మరియు సి.వీ మీఠా పశ్చిమ బెంగాల్‌లో మాత్రమే వాణిజ్య స్థాయిలో సాగులో ఉంది. తమలపాకును మన దేశంలో 40,000 హెక్టార్లలో సాగు చేస్తున్నారు. దీనికి ఎక్కువ పెట్టుబడి మరియు శ్రమ అవసరమవును. తులసి, వేణ్మణి, అరికోడి, కల్కోడి, కరిలంచి, కర్పూరం, చెలంతి కర్పూరం, కూట్టక్కోడినందన్, పెరుంకోడి, అమరవిల మరియు ప్రముత్తన్, కల్లార్కోడి, రెవేసి, కర్పూరి, SGM 1, వెల్లైకోడి, పచ్చికోడి, సిరుగమణి 1, అంతియూర్కోడి, కన్యూర్ కోడి తమిళనాడులో ఎక్కువ విస్తీర్ణంలో ఉన్నాయి.
Also Read: Brinjal cultivation: వంకాయ సాగుకు అనుకూలమైన సమయం