జాతీయంవార్తలు

PM Modi: గోధుమ సరఫరా పరిస్థితిని సమీక్షించిన ప్రధాని మోడీ

0
PM Modi

PM Modi: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భారతదేశ గోధుమలు మరియు ఇతర వ్యవసాయ వస్తువులు అధిక నాణ్యతతో ఉండాలని, ప్రపంచ ప్రమాణాల ఆహార వనరుగా నిలవాలని సూచించారు. భారతదేశ గోధుమల సరఫరా, స్టాక్ మరియు ఎగుమతులపై మోడీ సంబంధిత అధికారులని అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా రైతులను ఆదుకోవాలని ప్రభుత్వ అధికారులకు పిలుపునిచ్చారు. వ్యవసాయోత్పత్తి, సేకరణ మరియు ఎగుమతి స్థితి మరియు రైతులకు ప్రయోజనం చేకూర్చే ప్రస్తుత మార్కెట్ ధరలపై 2022 మార్చి మరియు ఏప్రిల్‌లలో పెరుగుతున్న ఉష్ణోగ్రతల ప్రభావం గురించి కూడా ఆయన అడిగి తెలుసుకున్నారు.

PM Modi

ప్రధానమంత్రి కార్యాలయానికి చెందిన ఉన్నతాధికారుల వివరాల ప్రకారం.. ఆహారం, ప్రజాపంపిణీ, వ్యవసాయ శాఖల కార్యదర్శులు ఈ సమావేశానికి హాజరయ్యారు. ఆహార కార్యదర్శి సుధాన్షు పాండే మాట్లాడుతూ 2022-23 మార్కెటింగ్‌లో భారతదేశ గోధుమ ఉత్పత్తి మునుపటి అంచనా 111.32 మిలియన్ టన్నుల నుండి దాదాపు 5.7 శాతం తగ్గి 105 మిలియన్ టన్నులకు చేరుకుంటుందని మరియు అధికారిక కొనుగోళ్లు కేవలం 19.5 మిలియన్లకు సగానికి తగ్గుతాయని అంచనా వేశారు. వేసవి ప్రారంభమైనందున వ్యవసాయ మంత్రిత్వ శాఖ 2021-22 పంట సంవత్సరానికి గోధుమ ఉత్పత్తి అంచనాలను గతంలో 111.3 మిలియన్ టన్నుల నుండి 105 మిలియన్ టన్నులకు తగ్గించిందని పాండే చెప్పారు. 2020-21 పంట సంవత్సరంలో భారతదేశం 109.59 మిలియన్ టన్నుల గోధుమలను ఉత్పత్తి చేసింది.

PM Modi wheat

ఇదిలా ఉండగా 2022-23 మార్కెటింగ్ సంవత్సరంలో (ఏప్రిల్-మార్చి) ప్రభుత్వ గోధుమ సేకరణ 19.5 మిలియన్ టన్నులకు పడిపోయే అవకాశం ఉందని ఆహార కార్యదర్శి పేర్కొన్నారు. కనీస మద్దతు ధర (ఎంఎస్‌పి)తో పోల్చితే కొన్ని రాష్ట్రాల్లో గోధుమల మార్కెట్‌ రేట్లు పెరగడం, రైతులు, వ్యాపారుల వద్ద ఉన్న నిల్వలు మరింత పెరుగుతాయని అంచనా వేయడం వంటి అనేక కారణాల వల్ల గత ఏడాదితో పోలిస్తే గణనీయమైన తగ్గుదల ఉంటుందని ఆయన అన్నారు.

Leave Your Comments

Water Scarcity: ప్రపంచవ్యాప్తంగా 80% కంటే ఎక్కువ పంట భూములకు నీటి కొరత

Previous article

Rythu Bharosa: ‘మే’ 15వ తేదీన వైఎస్ఆర్ రైతు భరోసా

Next article

You may also like