Bloodless Castration: బర్డిజోతో కాస్ట్రేటర్ తో రక్తం లేకుండా వృషణాలు నిర్వీర్యం చేయవచ్చు.ఇది అహింసతో కూడుకున్న పని కాబట్టి జీవం భయాందోళనకు గురి కాకుండా ఉంటుంది. ఇది అన్నింటికన్నా సులువుగా తక్కువ శ్రమతో చేయవచ్చు. రబ్బరు రింగులతో క్యాస్ట్రేట్ చేయడానికి, ఎలాస్ట్రేటర్ అనే పరికరం సహాయంతో వృషణాలను పనికి రాకుండా చేసే చేయవచ్చు. ఇది పిన్న వయస్సులో ఉన్న నెమరు వేసే జంతువులను క్యాస్ట్రేట్ చేయడానికి మాత్రమే ఉపయోగించవచ్చు.
Also Read: Bioethanol: పెరుగుతున్న ఇంధన ధరలకు ప్రత్యామ్నాయం బయోఇథనాల్
ఎలాస్ట్రేటర్ యొక్క నాలుగు వెళ్ళ చుట్టూ రబ్బరు రింగ్ ఉంచాలి, హ్యాండిల్ను తిప్పితే, రబ్బరు సాగుతుంది. జంతువు యొక్క స్క్రోటమ్‌ను రింగ్ మధ్య అమర్చాలి, అది రెండు వృషణాలను మధ్యగా వెళ్లేలా చూసుకోవాలి. ఎలాస్ట్రేటర్‌ను విడుదల చేయాగా, రబ్బరు రింగ్ శుక్ర కోశం చుట్టూ గట్టిగా బిగించి ఉంటుంది. రెండు వారలు ముగిసిన తరువాత, స్క్రోటమ్ రాలిపోతుంది. సంయోగ భావాలను గుర్తించుట కోసం ఈ మధ్య వృషణాలను తొలగించిన జంతువులను తనిఖీ చేయాలి.
కాస్ట్రేషన్ తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు:
దూడలను వాటి తల్లులతో పాటు శుభ్రమైన గడ్డిని మాత్రమే వేయాలి. ఫాంలో గోతుల చుట్టూ బురదగా లేదా మురికిగా ఉందకుండ చుస్కోవాలి. కాస్ట్రేషన్ తర్వాత సుమారు 10 రోజుల పాటు జంతువును గమనిస్తూ ఉండాలి. ఈగల దాడులు మరియు ఇన్ఫెక్షన్ (ముఖ్యంగా ఎమాస్క్యులేటర్ పద్ధతితో) పట్ల జాగ్రత్తగా ఉండాలి. ఈగల దాడులను నివారించేందుకు గాయాలకు మందులు పూసి చికిత్స చేయడం మంచిది. వృషణాల వద్ద వాపు మరియు నొప్పి తీవ్రంగా ఉండి జంతువుకు జ్వరం వస్తే, సరైన యాంటీబయాటిక్ ను ఇంజెక్ట్ చేయడం వలన వాపు తగ్గి సాధారంగా అవడానికి వీలుంటుంది.
Also Read: Herbicides: కలుపు మందుల వాడకంలో సూచనలు