వార్తలు

VarmiCompost Importance: సేంద్రీయ వ్యవసాయం లో వర్మీ కంపోస్ట్ మరియు వర్మి వాష్ ప్రాముఖ్యత

0
earthworm compost
earthworm compost

VarmiCompost Importance: సాగు భూముల్లో రసాయనిక ఎరువులను విచక్షణరహితంగా వాడటం వలన భూ భౌతిక రసాయనిక జీవన స్థితిగతులు క్షీణిస్తున్నాయి పురుగులు, తెగుళ్ల వృద్ధి పెరిగి పెట్టుబడి ఖర్చులు బాగా పెరుగుతున్నాయి. పెరుగుతున్న ఉష్ణోగ్రతలు వర్షపాతం లో వస్తున్న పెనుమార్పులు పైరుల అవశేషాలను తొలగించడం ద్వారా లేదా కాల్ చేయడం మరియు నేల కోతకు గురికావడం వల్ల భూమిలో సేంద్రియ కర్బనం శాతం గణనీయంగా తగ్గిపోతుంది. దీనికి ప్రధాన కారణం పశువుల ఎరువు కొరత ఈ పరిస్థితిని అధిగమించి సాగు భూముల్లో తగినంత సేంద్రియ కర్బనం శాతాన్ని పెంచడానికి ప్రత్యామ్నాయంగా వెర్మి కంపోస్ట్ వాడవచ్చు.

Earthworm Compost

Earthworm Compost

ప్రస్తుత విస్తృత వ్యవసాయ సాగు విధానంలో నేల నాణ్యతను భూ ఫలదలతను కాపాడడానికి సేంద్రియ ఎరువుల వాడకాన్ని పునరుద్ధరించడం ఎంతో అవసరం. పశువుల ఎరువు సేంద్రియ ఎరువుల లభ్యతా నానాటికీ తగ్గిపోతున్న ప్రస్తుత పరిస్థితుల్లో కొని వేసుకోవడం లాభదాయకం కాదు. కనుక కంపోస్టు ఎరువులను తయారు చేసుకొని వేసుకోవడం ఎంతో అవసరం. దీనివల్ల పరిసరాల పరిశుభ్రత మరియు పర్యావరణానికి మంచి వస్తుంది. సాంప్రదాయ వ్యవసాయంలో ఒకప్పుడు నేలలో విరివిగా కనిపించే వానపాములు నేటి ఆధునిక వ్యవసాయంలో రసాయనిక ఎరువుల వాడకం పెరగడం సేంద్రియ ఎరువుల వాడకం తగ్గడం వలన వానపాములు సంఖ్య గణనీయంగా తగ్గడం జరిగింది. ఇవి నేల ఆరోగ్యాన్ని కాపాడటంలో ముఖ్యపాత్ర వహిస్తాయని మొట్టమొదటిగా 1881 ప్రపంచానికి తెలియజేశారు.

వర్మీ కంపోస్ట్ తయారికి అనువైన వానపాముల రకాలు; వానపాములు వెన్నెముక లేని జీవులు ఇందులో 3600 రకాలు ఉన్నాయి. వీటిలో సగం మాత్రమే ప్రపంచ వ్యాప్తంగా వ్యాపించి ఉన్నాయి వీటినీ రెండు రకాలుగా విభజించారు.

(బరౌయీంగ్) అనగా బొరియలు చేయు రకము: నేలను గొల్ల చేసి భూమి లోపలి పొరల్లో ఉంటుంది. మన దేశంలో ఈ ఈ రకమైన వానపాములు ఎక్కువగా ఉంటుంది. నీటి ఎద్దడిని బాగా తట్టుకొని 90% మట్టిని 10 శాతం వ్యర్ధా పదార్థాలను ఆహారంగా తీసుకుంటుంది. ఎనిమిది నుండి పది అంగుళాల పొడవు సుమారు 15 సంవత్సరాలు జీవిస్తుంది. అయితే ఈ రకం అంతగా వర్మీకొంపోస్ట్ తయారీకి పనికిరాదు.
ఉదాహరణకు; ఫెరిటియా ఎలాంగెట, ఫెరిటియా ఏసియాటిక.

Also Read: Vermicompost Business: తక్కువ పెట్టుబడి ద్వారా వర్మీ కంపోస్ట్ తయారీతో లక్షల వ్యాపారం

(నాన్ బారౌయింగ్) అనగా బొరియలు చేయని రకము: భూమి పై పొరల్లో ఉంటూ బొరియలు చేయని రకము. ఇది వర్మి కంపోస్టు తయారీకి బాగా అనుకూలం. మట్టిలో గల సేంద్రీయ పదార్థాలను తునాతునకలు చేసి జీవన ఎరువులు తయారు చేస్తాయి. ఇది 90 శాతం వ్యర్థపదార్థాలను 10 శాతం మట్టిని ఆహారంగా తీసుకుని నాణ్యమైన కంపోస్టు గా మారుస్తాయి. వీటిలో పునరుత్పత్తి శక్తి ఎక్కువ. వీటి జీవితకాలం సుమారు రెండున్నర సంవత్సరములు.
ఉదాహరణకు; ఇసీనియా ఫోయిటేడ, యుడ్రిలాస్ యుజేని

 

వర్మీకంపోస్ట్ బెడ్ తయారీ: 

  • భూమికి సమాంతరంగా మూడు అడుగుల వెడల్పు రెండు అడుగుల లోతు ఉండేటట్లు మనకు వీలైనంత పొడవున వర్మికంపోస్ట్ బెడ్ ఏర్పాటు చేసుకోవాలి.
  • ఈ బెడ్ యొక్క అడుగు భాగం గట్టిగా ఉండాలి.
  • తయారైన బెడ్ లపై దాదాపు 45 సెంటీ మీటర్ల ఎత్తు వరకు కుళ్ళు పోయిన వ్యర్థ పదార్థాలను వేసి వాటిపై 5 నుండి 10 సెంటీమీటర్ల వరకు బాగా చివికిన పశువుల పేడ వేసుకోవాలి.
  • వ్యర్ధ పదార్థాలను,పేడను వేసేటప్పుడు బెడ్ పై నీళ్ళు చల్లాలి ఇలా ఒక వారం వరకు అడపాదడపా చల్లాలి.
  • బెడ్ పై ఎప్పుడు 50 నుంచి 60 శాతం తేమ ఉండేలా చూసుకోవాలి.
  • వారం రోజుల తరువాత బెడ్ పై ప్రతి చదరపు మీటర్ కు వెయ్యి వానపాములు చెప్పిన వదులుకోవాలి
    పాములు ఆహారాన్ని వెతుక్కుంటూ లోపలికి వెళ్తాయి.
  • వానపాములు నేరుగా సూర్యరశ్మిని తట్టుకోలేవు కనుక వాటి రక్షణ కొరకు తగిన నీడను ఏర్పాటు చేయాలి. నీడ కొరకు పందిరి గాని లేదా షడ్ గాని ఏర్పాటు చేసుకోవాలి.
  • వానపాములు కు నీడనివ్వడమే కాక ఎరువు నుండి తేమ తొందరగా ఆవిరైపోకుండా కాపాడుతాయి.
    బెడ్ పై పాత గోనెసంచులు లేదా వరి గడ్డిని పరచాలి దీని వలన తేమనిల్వ ఉండటమే కాకుండా పక్షులు నుండి కూడా రక్షణ ఉంటుంది.
  • వానపాములను వదిలిన బెడ్ పై ప్రతిరోజూ పలుచగా నీరు చల్లుతూ ఉండాలి ఈ విధంగా చేయడం వల్ల వ్యర్ధపదార్థాలు రెండు మూడు నెలల్లో వెర్మి కంపోస్ట్ గా తయారయ్యే వీలుంటుంది.
  • బెడ్ నుండి వెర్మి కంపోస్ట్ ను తీయడానికి నాలుగు నుండి ఐదు రోజుల ముందు నీరు చల్లడం ఆపివేయాలి ఇలా చేయడం వలన వానపాములు తేమను వెతుకుతూ లోపలికి వెళ్లి అడుగు భాగానికి చేరుతాయి.
  • బెడ్ పైన నా కప్పిన గోనె సంచులు లేదా వరిగడ్డిని తీసివేయాలి తరువాత ఎరువును శంఖాకారం వలె చిన్నచిన్న కుప్పలుగా వేయాలి.
  • వానపాము లేని ఎరువును 2 నుండి 3 mm పరిమాణం కలిగిన రంధ్రం ఉన్న జల్లెడతో జల్లించి సంచుల్లో నింపి నీడ ప్రదేశంలో నిల్వ ఉంచుకోవాలి.

వర్మీ కంపోస్ట్ తయారీలో తీసుకోవలసిన జాగ్రత్తలు: 

  • వానపాములను సూర్యరశ్మి నుండి వర్షము నుండి రక్షణ కల్పించాలి.
  • వర్మీ కంపోస్ట్ బెడ్స్ లో 40 నుండి 50 శాతం తేమ ఉండేటట్లు చూసుకోవాలి.
  • పాక్షికంగా కూలిన వ్యర్థ పదార్థాల మిశ్రమాన్ని వాడుకోవాలి.
  • ఎలుకలు చీమలు కోళ్లు మొదలైన శత్రువుల బారి నుండి రక్షణ కల్పించాలి.
  • వ్యర్థ పదార్థాలను వేయడం ఎరువును సేకరించడం సకాలంలో చేయాలి.
  • వ్యర్థ పదార్థాల లో ప్లాస్టిక్ మరియు గాజు పదార్థాలు, పాలిథిన్ సంచులు, కోడి గుడ్ల పెంకులు ఉండకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.

వర్మికంపోస్ట్ ఉపయోగములు: 

  • వర్మికంపోస్ట్ రైతులు ఎకరానికి 8-12 క్వింటాల వరకు వివిద పంటలకు వాడవ్ఫచు. పండ్ల చెట్టులకు 5-10 కిలోల వరకు ఈ ఎరువును వాడడం వలన మంచి దిగుబడి వస్తుంది.
  • ఈ కంపోస్ట్ లో 1.5 to 2.0 శాతం నత్రజని,1- 2 శాతం భాస్వరం 1 -1.5 శాతం పొటాషియం ఉంటాయి.
  • వర్మి కంపోస్ట్ వేసిన పంటకు ఏ కాకుండా మరో రెండు నుంచి మూడు పంటలకు కూడా ఉపయోగపడుతుంది.
  • మొక్కలకు కావలసిన అన్ని పోషకాలు ఈ వర్మికంపోస్ట్ వల్ల లభ్యమవుతాయి.
  • భూమికి అవసరమైన అన్ని సూక్ష్మజీవులు వృద్ధిచెంది నేల సహజసిద్ధమైన ఆరోగ్యం కలిగి ఉంటుంది
    కూరగాయలు పండ్లలో నాణ్యత మరియు దిగుబడి పెరుగుతుంది. నేలను గుల్లబరేలా చేసి నేలకు సారాన్ని ఇచ్చి ఒక అవసరమైన పోషకాలను అందిస్తుంది.

వర్మికంపోస్ట్ లో ఉండే పోషకవిలువలు:
నత్రజని – 9.8 నుండి 13.40
భాస్వరం – 0.51 నుండి 1.61
పొటాషియం – 0.15 నుండి 0.73
కాల్షియం – 1.18 నుండి 7.6 1
మెగ్నీషియం – 0.093 నుండి 0.5 68
సోడియం – 0.058 నుండి 0.15 8
జింకు – 0.004 2 నుండి 0.1 10
కాపర్ – 0.00 26 నుండి 0.00 48

వర్మి వాష్:
వానపాముల శరీర భాగాల నుండి అవి విసర్జించే క్యాస్టింగ్ నుండి తయారయ్యే ద్రవాన్ని వర్మివాష్ అంటారు ఇందులో మొక్క పెరుగుదలకు దోహదపడే హార్మోన్లు విటమిన్లు పోషకాలు పుష్కలంగా ఉంటాయి. కావున సేంద్రియ వ్యవసాయంలో మొక్కలకు పోషకాలు అందించటం లో దీనిని విరివిగా ఉపయోగిస్తున్నారు.

వర్మీ వాష్ తయారీ విధానము:
వానపాములు ఉండటానికి అనువుగా బెడ్ ఏర్పాటు చేయాలి. దీనికి ఒక పెద్ద సైజు మట్టి పాత్రలు లేదా ఒక ప్లాస్టిక్ డ్రమ్ ఉపయోగించుకోవచ్చు. పాత్ర అడుగు భాగంలో ఒక రంద్రమ్ ఏర్పాటు చేసి దానిని దూది సహాయంతో ఉంచాలి. మొదటి పాత్ర అడుగు భాగంలో మూడు నుండి నాలుగు అంగుళాలు ఇసుకతో ఆపైన 3 అంగుళాల చిన్న చిన్న ఇటుక ముక్కలు రాళ్లతో నింపాలి. దీనిమీద బాగా సేంద్రీయ పదార్థాన్ని పాత్రలో నాలుగింట మూడు వంతులు.ఇందులో వీలైనన్ని ఎక్కువ అంటే 150 నుండి 200 వానపాములు వదలాలి పాత్రలో ఎల్లప్పుడూ 50 నుండి 60 శాతం తేమ ఉండేటట్లు ప్రతి రోజు నీటిని చిలకరిస్తూ ఉండాలి. వానపాముల విసర్జన పూర్తిగా తయారైన తరువాత ఎక్కువ నీరు పోయాలి. పాత్ర అడుగు భాగంలో నుండి టీ డికాషన్ వంటి ద్రవం బొట్టు బొట్టుగా స్రవించడం మొదలవుతుంది దీనిని సేకరించాలి ఇలాగే మరో రెండు సార్లు నీరు పోసి వచ్చిన ద్రావణాన్ని సేకరించాలి దీనినే వర్మి వాష్ అంటారు. ఇది అత్యంత విలువైన సేంద్రియ ఎరువు సేంద్రియ ద్రవ ఎరువు. సేంద్రీయపదార్థం అంత వర్మీ క్యాస్టింగ్ గా మారి పోయినప్పుడు దానిని తీసివేసి కొత్తగా సేంద్రీయ పదార్థాన్ని వేస్తే వానపాముల నుండి మరలా క్యాస్టింగ్ తయారవడం ప్రారంభమవుతుంది .ఇదే పద్ధతి పలుమార్లు ఆచరించడం వల్ల అత్యంత వర్మి వాష్ లభ్యమవుతుంది.

వర్మి వాష్ పోషక విలువలు:
నత్రజని – 500ppm
భాస్వరం – 390 ppm
పొటాషియం – 460 ppm
కాల్షియం – 540 ppm
మెగ్నీషియం – 110 ppm
ఇనుము – 273 ppm
మాంగనీసు – 180 ppm
జింకు – 180 ppm
రాగి – 21 ppm

వర్మి కల్చర్ :
వానపాముల సంతతి వృద్ధి చేయడాన్ని వర్మి కల్చర్ అంటారు. వానపాములను ఎక్కువ సంఖ్యలో 10 కిలోల వ్యర్ధపదర్దాలకు 50 వానపాముల చెప్పిన వదులుకొని నీడలో పెట్టుకొని అనుకూలమైన వాతావరణ పరిస్థితులు కల్పిస్తే (ఉష్ణోగ్రతలు 15◦నుంచి 30 సెంటి గ్రేడ్ తేమ శాతం 70 నుంచి 80 శాతం) రెండు నెలల్లో వానపాముల సంఖ్య వంద రెట్లు పెరుగుతుంది.

డా .పి అమర జ్యోతి, డా.బి.మౌనిక , జి .నవీన్ కుమార్ , డా .డి.చిన్నం నాయుడు
కృషి విజ్ణాన కేంద్రం , ఆమదాలవలస, శ్రీకాకులం జిల్లా. 

Also Read: Benefits of Vermi Compost: వర్మికంపోస్టింగ్ వల్ల లాభాలు

Leave Your Comments

Agri Ferro Solutions: పంటకు శ్రీరామరక్ష అగ్రి ఫెర్రో సొల్యూషన్స్

Previous article

Farmer Success Story: ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ లోకి గవర్నర్‌ కార్యదర్శి

Next article

You may also like