Ramagundam fertilizer plant: తెలంగాణ రైతులకు ఎరువుల కొరత తీర్చే ప్రతిష్టాత్మక రామగుండం ఫ్యాక్టరీ ప్రారంభం కానుంది. రెండు దశాబ్దాలకు పైగా రైతుల కష్టాలు తీరేలా కీలక ఘట్టానికి నాందిపడింది. 22ఏళ్ల తర్వాత తొలిసారిగా రామగుండం ఎరువుల కర్మాగారం పునః ప్రారంభం దిశగా ముందడుగేయనుంది. వివరాలలోకి వెళితే.
రైతులు పంట సాగు చేసేందుకు భూమి, నీరు, ఎంత అవసరమో దానికి ఎరువులు కూడా అంతే అవసరం. అయితే తెలంగాణాలో మాత్రమే కాకుండా దేశవ్యాప్తంగా ఎరువుల సమస్య వెంటాడుతూ ఉంది. ప్రభుత్వాలు ఎన్ని చర్యలు చేపట్టినప్పటికీ ఆ సమస్యకు మాత్రం ఫుల్ స్టాప్ పడట్లేదు. ఇదే అదునుగా కొందరు నకిలీ వ్యాపారులు నకిలీ ఎరువులను రైతులకు అందిస్తూ తీవ్ర నష్టం కలుగజేస్తున్నారు. అయితే తెలంగాణాలో ఇకపై అలాంటి సమస్యలు జరగదనే చెప్పాలి. ఎందుకంటే రామగుండంలో ఎరువుల ఫ్యాక్టరీ ప్రారంభం కానుంది.
ప్రధాని నరేంద్రమోదీ త్వరలో పెద్దపల్లి జిల్లాలోని రామగుండం ఎరువుల కర్మాగారాన్ని అధికారికంగా ప్రారంభించనున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఈ నెల 25 లేదా 26 తేదీల్లో ప్రధాని మోడీ తెలంగాకు రానున్నారని, .. అయితే 26న వచ్చే షెడ్యూల్ కూడా కన్ఫర్మ్ అయినట్లు సమాచారం. నిజానికి ఈ కర్మాగార నిర్మాణానికి 2016 ఆగస్టు 7న గజ్వేల్‌లో ప్రధాని శంకుస్థాపన చేశారు. గత సెప్టెంబరు 9న మోదీ చేతుల మీదుగా జాతికి అంకితం చేయించేందుకు ఏర్పాట్లు చేసినప్పటికీ చివరి క్షణంలో కార్యక్రమం వాయిదా పడింది. తాజాగా ప్రధానమంత్రి పర్యటనకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని కేంద్రం నుంచి మార్గదర్శకాలు జారీ అయ్యాయి. ఈ మేరకు ఆర్.ఎఫ్.సి.ఎల్. యాజమాన్యం అప్రమత్తమై అవసరమైన చర్యలు చేపడుతోంది. వార్షిక మరమ్మతుల కోసం 10వ తేదీ నుంచి కర్మాగారాన్ని షట్‌డౌన్ చేయాలని నిర్ణయించినప్పటికీ ప్రధాని కార్యక్రమం ఉన్నందున వాయిదా వేశారు.
గతంలో రామగుండంలోని ఎస్బీఐ ఎరువుల కర్మాగారంలో ఉత్పత్తి అయ్యే యూరియాను స్వస్తిక్ బ్రాండ్‌తో విక్రయించగా… ప్రస్తుతం ఉత్పత్తి కానున్న యూరియాను కిసాన్ బ్రాండ్‌తో నేషనల్ ఫెర్టిలైజర్స్ లిమిటెడ్ మార్కెటింగ్ చేయనుంది.