Agriculture Drones: మారుతున్న కాలానికి అనుగుణంగా వ్యవసాయంలో కీలక మార్పులు చోటుచేసుకుంటున్నాయి. శ్రమ, సమయం అదా చేసేందుకు అనేక సాంకేతిక పరికరాలు ప్రస్తుత రోజుల్లో అందుబాటులోకి తీసుకొస్తున్నారు సంబంధిత సంస్థలు. వ్యవసాయ పరికరాల ద్వారా రైతులకు సాగులో అనేక విధాలుగా ఉపయోగపడుతున్నాయి. కాగా వ్యవసాయంలో డ్రోన్ల వినియోగం కూడా నానాటికి పెరుగుతుంది. విదేశాల్లో ఉండే ఈ పరిజ్ఞానం ప్రస్తుతం మన దగ్గర కూడా ఊపందుకుంది. అందులో భాగంగా డ్రోన్ల వినియోగదారులకోసం ప్రముఖ సంస్థలు ముందుకువచ్చి ఆధునిక సాంకేతిక పరిఙానాన్ని జోడిస్తున్నాయి. ఈ మేరకు ప్రముఖ సంస్థ అగ్రిటెక్ డ్రోన్లను అందుబాటులోకి తీసుకురానుంది. ఈ విషయాన్నీ సదరు సంస్థ ఎండీ పేర్కొన్నారు. వానాకాలం నాటికి రైతుల చెంతకు నోవా ఆగ్రిటెక్ డ్రోన్లు రాబోతున్నాయని సంస్థ ఎండీ ఏటుకూరి కిరణ్ కుమార్ వెల్లడించారు. డీజీసీఏ అనుమతితో నోవా అగ్రిటెక్, ఐవోటెక్ భాగస్వామ్య ఒప్పందంతో డ్రోన్లు వ్యవసాయరంగంలోకి రాబోతున్నాయని అయన ఈ సందర్భంగా అన్నారు.
వ్యవసాయం రంగంలో డ్రోన్ల వినియోగాన్ని తీసుకురావాలని ఐదేళ్ల నుంచి ప్రణాళికలు వేసుకుంటున్నామని ఆయన తెలిపారు. ఈ క్రమంలో ఐదేండ్ల కృషి ఫలితంగా డ్రోన్లను మార్కెట్లోకి విడుదల చేయబోతున్నామని అన్నారు. వ్యవసాయ రంగంలో కూలీల కొరత, సమయం ఆదాతోపాటు అతి సూక్ష్మాతి సూక్ష్మమైన కెమెరాలతో చీడపీడల గుర్తించే విధంగా అలాగే పంటకు అవసరమయ్యే మందుల గురించి కూడా అగ్రిబోట్ డ్రోన్లను రూపొందించామని సంస్థ ఎండీ తెలిపారు. అదేవిధంగా మా సంస్థ దాదాపుగా 15 సంవత్సరాల నుంచి రైతులకు వ్యవసాయ పరికరాలను అందిస్తున్నట్టు ఆయన గుర్తు చేసుకున్నారు. అంతేకాకుండా నోవా కిసాన్ సేవ కేంద్రం ద్వారా లక్షలాది మంది రైతులకు వాతావరణ మార్పులు ప్రముఖ శాస్త్రవేత్తలతో సలహాలు సూచనలు అందిస్తున్నదని ఆయన అన్నారు. అయితే ఈ సేవలతో పాటుగా మరికొన్ని సేవలను ఆచరణలోకి తీసుకొచ్చి రైతులకు అందుబాటులోకి తీసుకురావాలన్నదే మా ఆశయం అని అన్నారాయన. అందులో భాగంగానే నోవా అగ్రిటెక్, ఐవోటెక్ మార్కెట్లోకి తీసుకువస్తున్న అగ్రిబోట్ రైతన్నలకు ఎంతగానో ఉపయోగపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారాయన.
Also Read: నిల్వ ఉన్న ఆహార ధాన్యాల శతృవులు
ప్రస్తుతం రైతన్నలు వ్యవసాయంలో అనేక కష్టాలను ఎదుర్కొంటున్నారని, కూలీల కొరత, సమయం, వాతావసరణం ఇలాంటి సమస్యలతో అన్నదాతలను అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారు. అనుకోసమే మేము అన్నదాతలకు అత్యాధునిక పరికరాలను అందించేందుకు సిద్దమయ్యాము అని అన్నారు. కాగా తమ ఉత్పత్తుల విషయానికి వస్తే.. పంటల చీడపీడలను గుర్తించడంతోపాటు పంటకు అవసరమైన చోట మందులు పిచికారి చేయడం, రసాయనాల వృధాను అరికట్టడం అగ్రిబోట్ ప్రత్యేకత అన్నారు. ఈ డ్రోన్ ప్రత్యేక లెన్స్ వ్యవస్థ ద్వారా పక్కకు వెళుతున్నదనీ, విపత్కర పరిస్థితులను సైతం తట్టుకునే ఆధునిక టెక్నాలజీతో దీనిని రూపొందించినట్టు తెలిపారు. 10లీటర్ల కెపాసిటీతో రోజుకు 30 నుంచి 35 ఎకరాలదాకా మందులను ప్లే చేసే సామర్థ్యం ఉందన్నారు. దీని ధర రూ 8 లక్షల నుంచి రూ 13 లక్షల వరకు ఉందని చెప్పారు. తెలంగాణలో మేడ్చల్, ఆంధ్రప్రదేశ్ విజయవాడ కేంద్రంగా రెండు అత్యాధునిక మోడల్ షోరూంలను ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు.
అంతేకాకుండా డ్రోన్ల వినియోగంపై అన్నదాతలకు తగిన విధంగా శిక్షణ ఇవ్వడంతోపాటు ప్రోత్సాహకం అందిస్తామని నోవా ఆగ్రిటెక్ కం పెనీ రాష్ట్ర వ్యవసాయశాఖకు తెలిపింది. దేశంలో తొలిసారి పంట లపై డ్రోన్ల వినియోగానికి సివిల్ ఏవియేషన్ డైరక్టర్ జనరల్ నుంచి తమ కంపెనీ అనుమతి పొందినట్లు సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ సురేష్ తెలిపారు. కాగా ఒక్కో డ్రోన్ ధరను రూ.8 లక్షల నుంచి 12 లక్షల వరకు నిర్ణయించారు.
Also Read: మలబార్ సాగుతో రైతు ఆర్ధిక పరిస్థితి మెరుగవుతుంది