రైతుబంధు….పద్మవిభూపణ్…..జీవితాంతం వరకు అలుపేరుగని ఉద్యమాలతో రైతుల వెన్నంటి ఉన్న ఆచార్య ఎన్జీ రంగా జన్మదినం నేడు…..
ఏరువాకను జోరువాకగా మార్చి..రైతుల జీవితాలలో వెలుగులు నింపేందుకు చట్టసభల లోపల, వెలుపల అలుపెరుగని పోరాటాలు, ఉద్యమాలు నిర్వహించడమే గాక స్వతంత్ర భారతంలో రైతులు ఆత్మగౌరవంతో బ్రతికేందుకు వ్యవసాయాన్ని పండుగజేసేందుకే తనసమయాన్ని పూర్తికాలం వెచ్చించిన మహనీయుడు డాక్టర్ రంగా….
గుంటూరు జిల్లా, నిడుబ్రోలులో జన్మించిన ఈ తెలుగు తేజం రైతునేతగా, స్వాతంత్ర సమరయోధుడిగా అనేకానేక పోరాటాల్లో తన పదునైన గళాన్ని, విలువైన కలాన్ని రైతు బ్రతుకు బాగు చేసేందుకే వినియోగించి ధన్యజీవులయ్యారు…
ఆచార్య ఎన్జీ రంగాగా గణుతికెక్కిన గోగినేని రంగనాయకులు నవంబర్ 7, 1900 లో నిడుబ్రోలులో జన్మించారు. మహాత్మాగాంధీ గాంధి పిలుపునందుకుని స్వాతంత్ర ఉద్యమంలో ప్రవేశించారు. గోగినేని నాగయ్య, అచ్చమాంబ దంపతులకు జన్మించిన రంగా ఉన్నత విద్యావంతుడు కూడా…..నిడుబ్రోలులో ప్రాథమిక విద్యను అభ్యసించి, గుంటూరు ఆంధ్రాక్రిష్టియన్ కళాశాల నుండి పట్టభద్రుడైన రంగా1926 లో లండన్ ఆక్స్ఫర్డ్ విశ్వ విద్యాలయంలోఆర్ధిక శాస్త్రం లో ఆచార్యత్వానికి అర్హుడై భారత్ కు తిరిగి వచ్చారు..
గాంధీజి బోధనలతో స్వతంత్ర సేనానిగా మారి ప్రజలను ఉద్యమం వైపు మళ్ళించేందుకు రామినీడు పేరుతో రాజకీయపాఠశాలను ఏర్పాటు చేశారు. రంగా స్మృతి చిహ్నంగా ఆ విద్యాలయం నేటికీ చిరస్మరణీయంగా ఉంది. మద్రాసులోని పచ్చయప్పన్ కళాశాలలో ఆర్ధిక శాస్త్ర ఆచార్యుడుగా పని చేస్తున్న కాలంలోనే రంగాకు హేతువాద భావాలు అలవడ్డాయి.
స్యయంగా రైతుబిడ్డ అయిన రంగా స్వాత్రంత్య ఉద్యమ కాలం నుండి రైతునేతగానే తన కార్య కలాపాలను సాగించారు. 1930లో ఉద్యమంలో చేరిన ఆయన1933 నుండి రైతుకూలీలను సమీకరించి ఉద్యమ బలోపేతానికి పాటుపడ్డారు..
రైతులు తాముపండించిన పంటకు మిగిలిన ఉత్పత్తి దారుల్లాగానే ధరను నిర్ణయించుకోలేని దుస్థితినుండి రక్షించుకునేందుకు అంతర్జాతీయ వ్యవసాయ ఉత్పత్తి దారుల సమాఖ్య ఏర్పాటు లో భారత్ తరపున కీలక పాత్ర వహించి ఆనాడే తన దార్శనికతను చాటుకున్నారు రంగా….
గాంధీజి బోధనలతో స్వతంత్ర సేనానిగా మారి..ప్రజలను ఉద్యమం వైపు మళ్ళించేందుకు రామినీడు పేరుతో రాజకీయపాఠశాలను ఏర్పాటుచేశారు. రంగా స్మృతి చిహ్నంగా ఆ విద్యాలయం నేటికీ చిరస్మరణీయంగా ఉంది. మద్రాసులోని పచ్చయప్పన్ కళాశాలలో ఆర్ధిక శాస్త్ర ఆచార్యుడుగా పని చేస్తున్న కాలంలోనే రంగాకు హేతువాద భావాలు అబ్బాయి.
భారత రైతాంగ ఉద్యమ పితగా రైతులోకం భావించుకునే ఎన్జీ రంగా గురించి మరికొన్ని విషయాలను జన్మదిన సందర్భంగా తెలుసుకుందాం.
రైతునేతేకాదు, మంచి రచయతకూడా. ఆంగ్లంలోను, తెలుగులోనూ ఆయన వ్రాసిన హరిజన నాయకుడు అనే నవల మంచి ప్రాచుర్యం పొందింది. రైతుఉద్యమాల్లో విశేష పాత్ర వహించిన రంగాకు ప్రముఖులు, పేరెన్నిక గన్న శిష్యులెందరో ఉన్నారు. సర్ధార్ గౌతు లచ్చన్న, పెద్దిరెడ్డి తిమ్మారెడ్డి, కందుల ఓబుల్ రెడ్డి, చేగిరెడ్డి బాలిరెడ్డి, ఎన్వి నాయుడు, నీరుకొండ రామారావు, బీశెట్టి అప్పారావు, పి.రాజగోపాల్ నాయుడు, యలమంచిలి శివాజి, వడ్డె శోభనాద్రీశ్వరరావులు రైతునేతలుగా వారి వారసులుగా సేవలందించారు. అందిస్తూనే కొంతమంది ఇంకా పనిచేస్తూనే ఉన్నారు.
ఆయన పేరుమీద ఏర్పాటు చేసిన ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ విశ్వ విద్యాలయం మొదటి వ్యవసాయవిప్లవంలో దేశం గర్వపడే విధంగా కార్యకలాపాలను నిర్వహించింది..ప్రస్తుతం గుంటూరు కేంద్రంగా నవ్యాంధ్రప్రదేశ్ నిర్మాణానికి బాటలు వేస్తున్నది. భారత ప్రభుత్వం ఈ రైతు రత్నానికి పద్మవిభూషణ్ బిరుదునిచ్చి గౌరవించింది. వాస్తవానికి భారత రత్న ఇవ్వాల్సింది. ఆభాగ్యం ఎప్పుడో వేచి చూద్దాం…