CM YS Jagan: సహజ వ్యవసాయం నినాదం ఊపందుకుంది. రోజు మనం తీసుకునే ఆహారంలో అనేక రసాయన సమ్మేళనాలు ఉంటున్నాయి. అవి మనకు తెలియకుండానే మన ఆరోగ్యాన్ని దెబ్బతీస్తున్నాయి. ఈ విషయాన్ని చాలా ఆలస్యంగా తెలుకున్నప్పటికీ ప్రస్తుతం రసాయన పంటలను పక్కనపెట్టేసి సహజ వ్యవసాయాన్ని చేయాలని నిర్ణయించుకుంటున్నారు. ఇక దీనికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏకమై కృషి చేస్తున్నాయి. తాజాగా దేశంలో సహజ వ్యవసాయాన్ని ప్రోత్సహించడానికి ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో NITI ఆయోగ్ వినూత్న వ్యవసాయంపై జాతీయ కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా అయన ప్రసంగించారు.
భవిష్యత్తులో ప్రకృతి వ్యవసాయమే కీలకమని అన్నారు సీఎం జగన్. ప్రకృతి వ్యవసాయం చేసే రైతులను ప్రోత్సహించాలి, వారికి రివార్డులు ఇవ్వాలని ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు. పెద్ద మొత్తం విస్తీర్ణంలో ప్రకృతి వ్యవసాయం చేస్తున్న రాష్ట్రాలకు ఆర్థిక సంఘం సిఫార్సుల్లో వెయిటేజీ ఇవ్వాలని సూచించారు సీఎం . ప్రకృతి వ్యవసాయానికి సర్టిఫికేషన్ ప్రక్రియ సరళంగా, రైతులకు అందుబాటులో ఉండాలని, యూనివర్శిటీల్లో ప్రత్యేక పాఠ్యాంశాలు పొందుపరచాలని సీఎం జగన్ తెలిపారు. కేంద్ర ప్రాయోజిత కార్యక్రమాల్లో 90శాతం నిధులను కేంద్రం భరించాలని సూచించారు.
Also Read: మట్టి కుండలో 6 నెలలు పాటు పండ్లు తాజాగా
అదేవిధంగా ప్రకృతి/ సేంద్రీయ వ్యవసాయంపై జాతీయ స్థాయిలో కీలక అంశాలను ప్రస్తావించిన ఏపీ సీఎం వైఎస్ జగన్ నీతి ఆయోగ్ వర్చువల్ సదస్సులో కీలక సూచనలు అందించారు. ప్రకృతి వ్యవసాయం చేసే రైతును దేశానికి గొప్ప సేవకుడిగానే చూడాలని కొనియాడారు. రాష్ట్రంలో ప్రకృతి వ్యవసాయాన్ని భారీ ఎత్తున చేపట్టేందుకు 20 మిలియన్ యూరోల జర్మనీ సహాయం. ఈ నిధులతో ఇండో–జర్మనీ గ్లోబల్ అకాడమీ ఆన్ ఆగ్రోఎకాలజీ రీసెర్చ్ అండ్ లెర్నింగ్ (IGGAARL) ఏర్పాటు గురించి ముఖ్యమంత్రి సదస్సులో వివరించారు.
Also Read: సహజ వ్యవసాయంలో 60% మహిళలు