ఆరోగ్యం / జీవన విధానం

Amla Health Benefits: సాంకేతిక ప్రక్రియలో ఆమ్లా పానీయం తయారీ

1
Fastest growing trees
Fastest growing trees

Amla Health Benefits: ఆమ్లా లేదా ఇండియన్ గూస్బెర్రీ అనేది భారతీయ మూలానికి చెందిన ముఖ్యమైన పండ్ల జాతికి చెందిన పంట.ఈ ఆమ్లా పండు అనేది గొప్ప ఔషధ విలువలు , పోషక విలువలు మరియు విటమిన్ సి అనేవి అదిక మొతాదులో ఉంటాయి. ఇంకా పిండిని ఆమ్లా కి వగరు మరియు ఆమ్ల స్వభావం ఉండటం వలన దానిని తినటానికి పెద్ద గా ఇష్టపడరు. ఔషధ ప్రయోజనాల కోసం మరియు ప్రత్యక్షంగా తినడానికోసం చాలా పదార్థాలను ఉత్పత్తి చేసారు. ఒక కొత్త సాంకేతిక ప్రక్రియ ద్వారా శ్రెడింగ్ బ్లాంచింగ్ తో పొటాషియం ఉప్పు వాడి ఆకర్షణీయమైన రంగు, రుచి వాసనతో నాణ్యత కలిగిన అనోలా పానీయాన్ని అభివృద్ధి చేయడం జరిగింది.అనోలా రసం యొక్క మిశ్రమం(20%), చక్కెర సిరప్ (70%–25°B),

Amla Health Benefits

Amla Health Benefits

ఇతర పండ్ల రసాలు (జామ,పైనాపిల్ మొదలైనవి) (10%) ఉపయోగించడం ద్వారా మంచిగా అంగీకరించబడినది.నల్ల ఉప్పు, తెల్ల ఉప్పు, నల్ల మిరియాలు, ఆమ్‌చూర్ పొడి ధనియాలు దీని
తయారీకి కావాల్సిన ఇతర పదార్థాలు. తరువాత ఈ మిశ్రమాన్ని నిల్వ చేయడానికి ముందుగా వేడి నీటిలో బాటిల్ని ఉంచి స్టెరిలైస్ చేసాక నిల్వ ఉంచాలి.

Also Read: వెల్లుల్లి పంట ఎండిపోవడంతో రైతుల ఆందోళన

ఆమ్లా రసం ఉపయోగాలు: ఉసిరి రసం విటమిన్ సి గొప్ప అధికంగా ఉండే ఆహార పదార్థం. ఇది రోగనిరోధక శక్తిని పెంచే ఒక ముఖ్యమైన సూక్ష్మ పోషకం.ఈ ఉసిరి రసం యాంటీఆక్సిడెంట్ కంటెంట్ మరియు యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు కలిగి ఉండటం వలన కాలేయ ఆరోగ్యానికి ఉపయోగపడుతుందని నిపుణులు కనుగొన్నాయి. ఆమ్లా రసం జీర్ణ రుగ్మతల నివారణకు తోడ్పడుతుంది. GERD, విరేచనాలు, కడుపులో అల్సర్ వంటివి రాకుండా దోహదపడుతుంది. జుట్టు రాలడాన్ని తగ్గిస్తుంది. మరియు హెయిర్ ఫోలికల్ కణాల ఉత్పత్తిని పెంచి జుట్టు పెరుగుదలను పెంచుతుంది. ఉసిరి సారం మూత్రపిండాల పనితన్నాని మూత్రపిండాలు దెబ్బతినకుండా సహాయపడుతుందని జంతు అధ్యయనం లో నిరూపించబడింది.

Also Read: అంతర్జాతీయ దరిత్రి దినోత్సవం

Leave Your Comments

cotton seed price: పత్తి రైతులకు షాకిచ్చిన కేంద్రం

Previous article

Sugarcane Farmers: చెరకు సాగుదారుల ఆదాయాన్నిపెంచేందుకు టాస్క్‌ఫోర్స్

Next article

You may also like