Value Added Products: శాస్త్రీయ పద్ధతిలో అనర్దనను ఉత్పత్తి చేయడానికి ఒక సాంకేతికత ప్రక్రియను CIPHETలో భారత వ్యవసాయ పరిశోధన మండలి శాస్త్రవేత్తలు అభివృద్ధి చేసారు. ఇలా ఉత్పత్తి చేయడం వలన అనర్దనలో కావాల్సిన యాసిడ్ – షుగర్ నిష్పత్తి, అత్యంత నాణ్యత అంశాలైన (అనగా చక్కెరలు, TSS,విటమిన్ సి మరియు ఖనిజాలు) ఆరు నెలల నిల్వ ఉంచినా కూడా ఎటువంటి తగ్గుదల ఉండదు.
దానిమ్మ జెల్లీ తయారీ కోసం ఒక నవీన పద్ధతిని అభివృద్ధి చేయబడినది. ఈ జెల్లీ చుడటానికి, మంచి రంగు కలిగి ఉండి, నాణ్యత బాగా ఉంటుంది. విటమిన్ ఎ , మినరల్స్‌తో కూడిన పోషకాలు, సహజ రుచితో పాటు మంచి నాణ్యత, ఎక్కువ రోజులు నిల్వ ఉండే గుణం కలిగి ఉంటుంది. దీనిని అనుకూలమైన పరిస్థితుల్లో 4 నెలలు, కోల్డ్ స్టోరేజీలో 6 నెలల వరకు నిల్వ చేయవచ్చు.
Also Read: టెర్రస్ పై 50 రకాల మామిడి పండ్ల పెంపకం
అనార్దన నుండి నోరు రిఫ్రెష్ చేయడానికి,ఎక్కువ పోషక విలువలతో కూడిన, జీర్ణ మాత్రలు సిద్ధం చేశారు.ప్యాక్ చేసినప్పుడు ఆరు నెలల వరకు నిల్వ చేయబడుతుంది. దీనికి అద్భుతమైన రుచి, మంచి పోషక విలువలు, ఖనిజాలు మరియు జీర్ణశక్తిని పెంచే గుణం ఉంటుంది. ఇది ప్యాక్ చేసినప్పుడు ఆరు నెలల వరకు కూడా నిల్వ ఉంటుంది.
జామ తోలు/బార్ తయారీ మరియు ప్రయోజనాలు:
జామ తోలు/బార్ ఉత్పత్తి కోసం ఒక సాంకేతికత ప్రక్రియను అభివృద్ధి చేయడం జరిగింది.ఈ బార్ల ను అనేక రకాల పండ్ల గుజ్జుల మిశ్రమాన్ని మిళితం చేసి తయారు చేయడం జరిగింది. జామ, మామిడి, బొప్పాయి, చక్కెర, సిట్రిక్ ఆమ్లం మరియు అనుమతించదగిన ప్రిసర్వేటీవ్స్ అనేవి దీని తయారికి కావాల్సిన ముఖ్య ప్రధాన పదార్థాలు.క్రాస్ ఫ్లో క్యాబినెట్ డ్రైయర్‌లో ఎండబెట్టడం జరుగుతుంది. ఎండిన షీట్లనుఫ్రూట్ బార్ల తయారీకి కావలసిన ఆకారంలో కతెరించుకోవాలి. సాధారణ పరిస్థితుల్లో ఈ జామ బార్లను 2-3 నెలలు వరకు నిల్వ చేయవచ్చు మరియు చల్లని పొడి పరిస్థితిలో తొమ్మిది నెలల కంటే ఎక్కువ నిల్వ ఉంచవచ్చు.
Also Read: ఎండుద్రాక్ష తో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు