వార్తలు

Alternative Crops: ప్రత్యామ్నాయ పంటల సాగుతో అధిక లాభాలు

2
Alternative Crops
Alternative Crops
Alternative Crops: రైతు రామారావు విజయగాధ.. ఖమ్మం జిల్లా, రఘునాధపాలెం మండలం, కోయచెలక గ్రామానికి చెందిన రైతు చెరుకూరి రామారావు తనకున్న 20 ఎకరాల భూమిలో వివిధ రకాల పంటలను మార్కెట్‌ డిమాండ్‌ దృష్టిలో ఏడాది పొడవునా సాగుచేస్తూ తనతోపాటు మరో 20 కుటుంబాలకు ఉపాధి కల్పిస్తున్నారు. గతంలో ఈ రైతు వరి, పత్తి వంటి పంటలను సాగు చేసేవారు. ఈ పంటలతో వచ్చే నికర ఆదాయం తక్కువగా ఉన్న నేపథ్యంలో కష్టతరం అవుతున్నందున ఏకపంటకు బదులుగా బహుళ పంటల సాగుతో లాభాలు పొందవచ్చునని గ్రహించి రామారావు గారు వివిధ రకాల ఉద్యాన మరియు వ్యవసాయ పంటలను సాగు చేస్తున్నారు.
Alternative Crops

Alternative Crops

వరికి ప్రత్యామ్నాయంగా కూరగాయ పంటలైన బెండ, వంగ, టమాటా అయినటువంటి బీర, సొర, కాకర, చిక్కుడు బోడ కాకర, దోస వంటి అనేక రకాల పంటలను పంట మార్పిడి విధానంలో కాలానుగుణంగా మార్కెట్‌ డిమాండ్‌ ఆధారంగా సాగు చేస్తూ అధిక లాభాలను పొందటమే కాకుండా రైతులకు ఆదర్శప్రాయంగా నిలుస్తున్నారు రైతు రామారావు గారు. వీటితోపాటుగా సేంద్రియ విధానం, ఆధునిక సాగు పద్ధతులను ఉపయోగించడం ఈయనకున్నమరో ప్రత్యేకత.

Also Read: మహిళా రైతులు సులభంగా ఉపయోగించుకునేలా వ్యవసాయ యంత్రాలు

సాగు ఖర్చు దిగుబడి వివరాలు: 
పంట     దిగుబడి (క్విం)      ఖర్చు        స్థూల ఆదాయం     నికర ఆదాయం    ఆదాయ వ్యయనిష్పత్తి
టమాట        278             92,500       2,78,000           1,85,500              3:01
దొండ          210           1,15,200      3,15,000           1,99,800            2.73 :1
బెండ           284            61,250       2,27,200           1,65,950            3.71 :1
దోసకాయ      110           59,400        1,76,000           1,16,600            2.96 :1
సొరకాయ      128           59,720        2,56,000           1,96,200            4.28 :1
బోడకాకర       65            71,800        3,25,000           2,53,200            4.03 :1
కాకర            68          1,12,200       2,04,000           91,800               1.82 :1
చిక్కుడు       32          61,400          1,28,000           66,600               2.08 :1
వరి              25          27,900          48,500             20,600               1.73 :1
డా. వి. చైతన్య, డా, జె. హేమంత్‌ కుమార్‌, డా. కె. రవి కుమార్‌, పి.ఎస్‌.ఎస్‌ ఫణిశ్రీ, డా. జెస్సీ సునీతడబ్ల్యు, కృషి విజ్ఞాన కేంద్రం, వైరా. 
Leave Your Comments

Terrace Gardening: మిద్దెతోటలో ఎండాకాలంలో ఏమి మొక్కలు పెంచుకోవచ్చో తెలుసుకుందాం 

Previous article

Dairy Industry Establishment: పాడి పరిశ్రమ స్థాపనకు ముఖ్య సూచనలు

Next article

You may also like