చీడపీడల యాజమాన్యం

Summer Chickpea(part II): వేసవి శనగ పంటను ఆశించు చీడపీడలు -యాజమాన్య పద్ధతులు

0
Chickpea
Chickpea

Summer Chickpea(part II): తెలంగాణ రాష్ట్రంలో వేసవి (ఎండాకాలం)లో పండించే పప్పుదినుసులలో శనగ పంట ప్రధానమైనది. అయితే అన్నీ పంటలకు ఉన్నట్లు గానే సహజంగా శనగ పంటకు కూడా చీడపీడల బెడద ఉంటుంది.కానీ మనం ఏ కొంచెం అశ్రద్ధ చేసినా జరిగే నష్టం ఎక్కువ మొత్తం లో ఉంటుంది.

Summer Chickpea(part II)

Summer Chickpea(part II)

శనగ నాశించు తెగుళ్లు- వాటి యాజమాన్యం:

ఫ్యూజేరియం ఎండు తెగులు : ఇది బెట్ట పరిస్థితులు ఉన్నప్పుడు ఏ దశలోనైనా ఆశించవచ్చు. తెగులు సోకిన మొక్కలు వడలిపోయి , చివరికి గోధుమ రంగుకి మారుతుంది. మొక్కలు గుంపులు గుంపులుగా ఎండిపోతాయి. ఈ.తెగులు వ్యాప్తి భూమి , విత్తనాల ద్వారా జరుగుతుంది.

రైజోక్టోనియా వేరుకుళ్ళు తెగులు: ఇది కూడా నేల ద్వారా సంక్రమించే వ్యాధి. మురుగునీరు పోయే సౌకర్యం లేకపోతే దీని ఉదృతి ఎక్కువగా ఉంటుంది. చనిపోయిన మొక్కలని పీకి చూస్తే ప్రధాన వేరు కుళ్ళిపోయి, అవగింజ పరిమాణంలో నల్లని స్క్లీరోషియాలు ఉంటాయి..పిల్లవేర్లు నశించిపోతాయి.

Also  Read:  ఫంగస్ నుండి మొక్కలను రక్షించడానికి ఈ స్ప్రేలను పిచికారీ చేయండి

మొదలుకుళ్ళు తెగులు :

భూమిలో అధిక తేమ మరియు పూర్తిగా కుళ్ళని పశువుక ఎరువు ఉంటే ఈ తెగులు ఎక్కువగా ఆశిస్తుంది. మొక్కల మొదలు భాగం కుళ్ళిపోయి , పైభాగం పసుపురంగుకి మారి పడిపోతుంది.
మొదలు దగ్గర ఆవగింజ పరిమాణంలో తెల్లని శిలీంధ్ర బీజాలు ఉంటాయి.

Chickpea Cultivation

Chickpea Cultivation

తెగుళ్ల సమగ్ర యాజమాన్యం :

★ తెగుళ్లను తట్టుకునే రకాలను సాగుచేయాలి. ఉదాహరణకి నంద్యాల శనగ – 47 —-ఫ్యుజేరియం ఎండు తెగులు. రైజోక్టోనియా ఎండు తెగులు —-JG – 11 ,ICCV-10 (భారతి)..

★శిలీంధ్ర నాశిని ట్రైకోడెర్మా విరిడే ని పశువుల పేడ మరియు వేపపిండితో కలిపి చల్లుకోవాలి. దీనివలన వేరుకుళ్లు ,ఎండు తెగులు వంటివి ఆశించకుండా అరికట్టవచ్చు.

★ కిలో శనగ విత్తనానికి 10 గ్రాల సూడోమోనాస్ ఫ్లోరిసెన్స్ లేదా 2.5 గ్రా ల కార్బండాజిమ్ లేదా 3 గ్రా ల థైరామ్ తో విత్తనశుద్ధి చేసి విత్తుకోవాలి.

★ శనగని మొదటిసారిగా పొలంలో సాగు చేస్తే రైజోబియం కల్చర్ ని విత్తనానికి పట్టించి , నీడలో ఆరబెట్టి విత్తుకోవాలి. (శిలీంద్రనాశీనులు—పురుగుమందులు—రైజోబియం ) ఈ క్రమంలో విత్తనశుద్ధి పద్ధతిని పాటించాలి.

★ తెగుళ్లు ఆశించిన స్థలాల్లో పంట తీసిన తరువాత మరో 3 ఏళ్లవరకు తిరిగి శనగ పంట వేయొద్దు.పంట మార్పిడి చేయాలి.

★ అనువైన సమయంలో విత్తుకోవాలి.

Also Read: Summer Chickpea (part I): వేసవి శనగ పంటను ఆశించు చీడపీడలు -యాజమాన్య పద్ధతులు

Leave Your Comments

Summer Chickpea (part I): వేసవి శనగ పంటను ఆశించు చీడపీడలు -యాజమాన్య పద్ధతులు

Previous article

Integrated Parthenium Management: పార్థీనియం సమీకృత నిర్వాహణ

Next article

You may also like