Taiwan Guava Cultivation (PART II):
ఎరువుల యాజమాన్యం: అధిక దిగుబడి కోసం సమతుల్య ఎరువుల యాజమాన్యం అవసరం. 50 కిలోల పశువుల ఎరువు, నత్రజని: భాస్వరం, ఒక చెట్టుకు 1కిలోని 2 భాగాలుగా చేసుకుని మార్చి మరియు అక్టోబర్ నెలలో వేరు వేరుగా వేసుకోవాలి. మార్చి, అక్టోబర్ నెలల్లో రెండు సార్లు యూరియా1% + జింక్ సల్ఫేట్ 0.5% ఆకుల పైన పిచికారీ చేయడం వలన అధిక దిగుబడులు సాధిస్తారు. బోరాన్ లోపం ఉన్న నేలల్లో లేదా పుష్పించే సమయం, ఫలాలు వచ్చే సమయంలో 0.3% బోరాక్స్ పిచికారీ చేసుకోవాలి.

Taiwan Guava Cultivation
తైవాన్ జామ మొక్కల ట్రైనింగ్ : మొక్క 75 నుండి 80 సెం.మీ ఎత్తు వరకు పెరిగినపుడు 50-60 సెం.మీ ఎత్తుకు కత్తిరించుకోవాలి. ఇది అధిక కొమ్మలు రావడాన్నీ ప్రేరేపిస్తుంది. ప్రక్క కొమ్మలు 30 నుం డి 40 సెం.మీ పొడవు పెరిగినప్పుడు, 3/ 4 బలమైన కొమ్మలను ఎంచుకుని మిగతావి కత్తిరించుకోవాలి. కొమ్మలు గొడుగులా మధ్య కాండం చుట్టూ విస్తరించి ఉండేలా చూసుకోవాలి. ఉంచిన కొమ్మలు 20 సెం.మీ పొడవు పైన ఉన్న ఆకుపచ్చని అపరిపక్వ భాగం కత్తిరింత్తిరించుకోవాలి. ఇలాగే ప్రాథమిక శాఖలలో చేసిన విధంగా, ద్వితీయ శాఖలను కత్తిరించుకోవాలి.ఇది తృతీయ శాఖలను ఉత్పత్తి చేయడానికి,మంచి ఆకృతి, పూలు మరియు పండ్ల ఉత్పత్తి చేసే అవకాశం ఇస్తుంది.
Also Read: Taiwan Guava Cultivation (PART I) : హెచ్.డి.పి తైవాన్ జామ సాగు
తైవాన్ జామ – కత్తిరింపులు: కోత తర్వా త లేదా వసంత కాలం లో కత్తెరింపులు చేపట్టాలి. ఎండాకాలంలో చేసుకోకూడదు. బలమైన ఆకారంను నిర్మించడానికి మరియు బలహీనమైన కొమ్మలను నివారించడానికి మొక్క దశలో ట్రైనింగ్ చేసుకోవాలి. రూట్ సక్కర్, నీటి మొలకలు, అవసరం లేని కొమ్మ లను తప్పనిసరిగా తొలగించాలి. ఎత్తును నియంత్రించడానికి, అంచున ఉన్న రెమ్మల ఎత్తుని నియంత్రించడానికి కొమ్మ కత్తిరింపులు అవసరం.
పేనుబంక, లార్వాలు లేదా పండు ఈగలు గుర్తించినట్లయితే, షెర్పా 0.2 -0.3%, ట్రెబాన్ 0.2% వంటి జీవసంబంధమైన కీటక నాశినీ పిచికారీ చేయవచ్చు. పండ్ల మచ్చల వ్యా ధి,డౌనీ బూజు తెగులు గమనించిన రిడోమిల్ 0.2%, అన్విల్ 0.2% పిచికారీ చేసుకోవాలి. జామ చెట్లకు ఎరువులు అందించే సమయంలో వృధా నీటిని ఉపయోగించకూడదు.

Taiwan Guava
తైవాన్ జామ లాభాలు మరియు దిగుబడి : తైవాన్ జామ ఒక ఎకరంలో 250 మొక్కలను సాగు చేయవచ్చు. ఒక చెట్టు నుండి 35- 40 కిలోలు, అలాగే ఎకరానికి 7,500 కిలోల దిగుబడి సాధించవచ్చు. తైవాన్ జామ ఎకరాకు 7- 10 లక్షల వార్షిక ఆదాయాన్ని సమకూర్చుతాయి. ఒక తైవాన్ జామ మొక్క ధర దాదాపు రూ. 35/-.గ్రేడింగ్ & ప్యాకింగ్:రైతులు సాధారణంగా అనధికారికంగా క్రమ పద్ధతి లేని గ్రేడింగ్ చేస్తుంటారు. దెబ్బ తిన్న పండ్లను, అనాకర్షణీర్షయ, చిన్న సిజ్ ఉన్న పండ్లను వేరు చేయడానికి చేస్తారు. తైవాన్ జామను స్థానిక మార్కెట్లకు తరలించడం కోసం గోనె సంచులు లేదా బుట్టలు వాడుతారు. సుదూర మార్కె ట్ కోసం, బుట్టలు లేదా పెట్టెల్లో నింపి రవాణా చేస్తారు.ఖర్చు ఎక్కువ అయినా కూడా మంచి నాణ్యతతో రవాణాకు ప్లాస్టిక్ పెట్టెలు సమర్థవంతంగా పనిచేస్తాయి.

Grading and Packing of Taiwan Guava
తైవాన్ జామ నిల్వ : గది ఉష్ణోగ్రత వద్ద తైవాన్ జామ పండ్ల యొక్క నిల్వ సామర్ధ్యం చాలా తక్కువ రోజులు మాత్రమే ఉంటుంది. శీతాకాలపు పంట 6- 9 రోజుల వరకు నిల్వ చేయవచ్చు. వర్షాకాలంలో రకాన్ని బట్టి 2-4 రోజుల వరకు నిల్వ చేసుకోవచ్చు. అధునాతన కూలింగ్ పరిస్థితులలో 14 రోజుల వరకు నిల్వ చేయవచ్చు.10°C ఉష్ణోగ్ర తలో లేదా అంతకంటే తక్కువలో పండ్లను నిల్వ చేసుకోవచ్చు. దీని కోసం పండ్లు గట్టిగా, పూర్తి పరిపక్వం ఆకుపచ్చగా ఉండాలి. అపరిపక్వ లేదా అధికంగా పండిన పండ్లు తక్కువ-ఉష్ణోగ్రత నిల్వకు పనికి రావు.
Also Read: క్లోనింగ్ విధానంలో తైవాన్ జామ..